NTV Telugu Site icon

Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు

Bangladesh

Bangladesh

Explosion in Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 11 అగ్నిమాపక సేవల అత్యవసర విభాగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నడిపిస్తోంది అదృశ్య హస్తం కాదు.. అమెరికానే..

రద్దీగా ఉండే సిద్దిక్ బజార్‌లో ఉన్న ఈ భవనం అనేక కార్యాలయాలు, దుకాణాలతో కూడిన వాణిజ్య భవనం. ఏడు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో శానిటేషన్ మెటీరియల్స్ విక్రయించే దుకాణంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడుకు కారణం అస్పష్టంగా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Show comments