దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు దేశంలో కొత్తగా 156 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా తాజాగా తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు. జనవరి 2 వ తేదీ వరకు బహిరంగ సభలకు, ర్యాలీలకు ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తూ ఇప్పటి కే జీవోను విడుదల చేసింది.
Read: స్పైడర్‌మ్యాన్ లిజార్డ్… సోషల్ మీడియాలో వైరల్…
ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. దక్షిణాదిన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూను అమలు చేసే ఆలోచన లేదని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
