Site icon NTV Telugu

ప్రభుత్వ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం…సజ్జల

ఏపీలో భారీవర్షాలు, వరదల కారణంగా అపారమయిన నష్టం సంభవించింది. కడప జిల్లాలో వరద గ్రామాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించిన సజ్జల రామకృష్ణా రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కడప జిల్లాలో వరద విలయం సృష్టించిందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తగ్గిందన్నారు.

వరదల తరువాత ప్రభుత్వం అన్ని రకాలుగా ఉదారంగా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని, నిబంధనలు సడలించి సహాయ కార్యక్రమాలు చేశారన్నారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం జగన్ పర్యటన తరువాత వరద బాధితులను మరింత ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సజ్జల.

కాగా, డిసెంబర్ 2న సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. వరద గ్రామాల్లో బాధితులను పరామర్శించనున్నారు సీఎం జగన్.

Exit mobile version