NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

Whats Today: విజయవాడ : రేపు కంకిపాడు రానున్న డిప్యూటీ సీఎం పవన్.. పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పల్లె పండుగ

తిరుమల : ఇవాళ శ్రీవారి ఆలయంలో భాగ్ సవారి.. సాయంత్రం మాఢవీధుల్లో అప్రదక్షణంగా ఊరేగనున్న మలయప్పస్వామి.. నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల పునరుద్ధరణ…

తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73684 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 36482 మంది భక్తులు. హుండి ఆదాయం 2.72 కోట్లు.

కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం. విగ్రహాల కోసం గ్రామస్తుల కొట్లాట. అర్థరాత్రి పూజల తర్వాత విగ్రహాల ఊరేగింపు. బన్ని ఉత్సవం చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.

అనంతపురం : మంత్రుల పర్యటన వివరాలు.. విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన. హ్తెదరాబాద్ లో మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ పర్యటించనున్నారు.

ఏలూరు: జిల్లాలో నేటి నుండి ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ నెల 20 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు స్వామి, అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతుర్లుగా అలంకరణ కాగా.. 17 న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, 18 న రథోత్సవం ఏర్పాటు చేశారు. ఇక 20 వ తేదీ రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలకు ముగింపు కార్యక్రామం ఉంటుంది. ఉత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు.

ప్రకాశం : జరుగుమల్లి మండలం బిట్రగుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. బౌద్ద మహోత్సవాలు సందర్భంగా అంబేద్కర్ మరియు బుద్ధుడి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.. దసరా పండగ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతున్న కారణంగా ఊరిలోకి ఎస్సీ కాలనీవాసుల ఊరేగింపు అనుమతించని గ్రామస్తులు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట.. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు..గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , రాజమండ్రి సిటీ , రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనంతపురం : జిల్లాలో సాగు,తాగు నీరు సమస్యలప్తె సీపీఎం బస్సు యాత్ర. ఈనెల 15 నుంచి 20 వరకు కొనసాగునున్న యాత్ర.

శ్రీసత్యసాయి జిల్లా: లో గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం. గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో విచారణ వేగవంగం చేసిన పోలీసులు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలింపు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు.

ఏపీ వాతావరణ శాఖ : నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. రేపటి నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీలో విస్తారంగా వర్షాలు. అల్పపీడన ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. తుఫాన్‌ ప్రభావంపై అన్ని జిల్లాల కలెక్టర్లలతో హోంమంత్రి అని టెలికాన్షరెన్స్‌. కంట్రోల్‌ రూమ్‌, హెల్ఫ్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశం.

విశాఖ: నేడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో జమ్మివేట ఉత్సవం ఘనంగా జరగనుంది. శమీపూజ కోసం కొండ దిగువకు రానున్న స్వామివారు. సాయంత్రం దర్శ
నాలు రద్దు చేశారు అలయ అధికారులు.

హైదరాబాద్ : ఇవాల కొడంగల్ కు తెలంగాన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 తర్వాత హెలికాప్టర్ లో హైదరాబాద్ కి రానున్నారు. అనంతరం అలయ్ బలయ్ కి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వనీయ సమాచారం

హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.71,200.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,670.. హైదరాబాద్ లో కిలో వెండి రూ.1,03,000

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ aylr జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిది దీన బంధు కాలనీలో నదీమ్ (24) అనే యువకుడి దారుణ హత్యకు గురైంది. తాగిన మైకంలో కొట్టి చంపినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్: ఘాట్ కేసర్ సమీపంలో నిన్న నైట్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్న శాలిమర్ ఎక్స్ప్రెస్ లో B3, B4, B5 బోగీల్లో బ్రేక్ వేసినప్పుడు వీల్స్ టైట్ కావడంతో చిన్న స్పార్క్స్ వచ్చాయి, 10.30 ట్రైన్ ఘాట్ కేసర్ నుండి వెళ్ళిపోయింది. ఎటువంటి అపాయం జరగలేదు….

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఏటా దసరా మరుసటి రోజు ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయ. ఆలయ్ బలయ్ కి అన్ని రంగాల వారిని ఆహ్వానం పలికారు. పార్టీలకు అతీతంగా అలయ్ బలయ్ కర్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

తమిళనాడులో భారీ వర్షాలు..10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 48గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు..తాంజావూర్, తిరునారూర్, తిరుకొటై జిల్లాల్లో కుండపోత.. పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు.. తేని జిల్లాలో ప్రమాదకరంగా జలపాతాలు.. సందర్శకులను నిలిపివేసిన అధికారులు

మహారాష్ట్ర: ఎన్ సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కాల్చి చంపిన దుండగులు… ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బాబా సిద్ధిఖీ మృతి.. కుమారుడి ఆఫీసులో ఉండగా కాల్పులు.. మూడు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు..
Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్