NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్‌!

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావ్ లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది ఎన్ఆర్ఐ లకు ప్రజా స్వామ్య స్ఫూర్తి తెలియదన్నారు. 51 శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. సహేతుకంగా విశ్లేషణ చేయాలి ప్రతిపక్షం అన్నారు. అచ్చోసిన ఆంబోతులం ..పోడియం కి వస్తాం అంటే అహం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పదే పదే గత పాలన గురించి మట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడుని చేసింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ని ఎంపీ గా గెలిపించింది కాంగ్రెస్ అన్నారు. కేంద్ర మంత్రి చేసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడుని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది వైఎస్ అన్నాఉ. పోతిరెడ్డిపాడు పొక్క పెంచునప్పుడు కొట్లాడింది పీజేఆర్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆరోజు ఎవరు కొట్లాడలేదన్నారు. మా పార్టీ పీజేఆర్ కొట్లాడారని తెలిపారు.

కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం ఏర్పాడింది. అధికార కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు.. కొడంగల్ నుంచి బొంబాయికు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో.. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవి.. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలి.. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు.. ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుని పెద్ద మనసుతో చెప్పామని ఆయన తెలిపారు. దాడి చేయడం మొదలు పెట్టారు.. కేటీఆర్ తీరు సరిగ్గా లేదు.. కాంగ్రెస్ హయాంలో ఎందుకు నీళ్ళు లేవు.. వివరాలు చెప్పా మంటారా? అంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జనం నీరు తాగలేదా? అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం కామెంట్స్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు అంటూ ఆయన తెలిపారు. రికార్డు సరిచేయండి.. పోతిరెడ్డిపాడుపై చర్చ చేయండి.. ఎవరు మాట్లాడలేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఉన్నాం అన్నారు.. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టారు అనే బయటకు వచ్చాం.. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బయటకు వచ్చాం.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందే టీఆర్ఎస్.. మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే.. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని హరీశ్ రావు అన్నారు. మాతో గొంతు కలిపింది పీజేఆర్ ఒక్కరే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పీజేఆర్ కొడుకు కూడా ఇప్పుడు మాతోనే ఉన్నాడు.. సీఎం రేవంత్ సభను తప్పుదారి పట్టించారు.

అప్పుల గురించి మాట్లాడతారు కానీ.. ఆస్తుల గురించి మాట్లడరా..?
నాల్గవ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్లు ప్రారంభమయ్యాయి. ఈ చట్టాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ఒక తీర్మానాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం ముగిసింది. రామ్మోహన్ రెడ్డి చెన్నై ఎమ్మెల్యే వివేక్ ప్రాతినిధ్యం వహించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ సభలో మాట్లాడారు.. రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారని తెలిపారు. అప్పుల గురించి మాట్లాడతారు. …కానీ ఆస్తుల గురించి మాట్లడరు అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 56 వేళ కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పడం అబద్ధం అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వద్ద స్టాక్స్ ఉన్న విషయం చెప్పడం లేదన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అన్నారు. కేవలం 7 ,8 వేల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. అప్పట్లో విపక్ష నేతగా భట్టి విక్రమార్క బాగా మాట్లాడారు… సిఎం అవుతారు అనుకున్నాం … కానీ కాలేదనిత తెలిపారు. విపక్ష నేతగా భట్టి బాగా మాట్లాడారు…అందుకే అధికారంలోకి వచ్చారన్నారు. అప్పులు…ఆస్తులను కలిపి చూడాలన్నారు. అమెరికా ,జపాన్ లకు కూడా అప్పులు ఉన్నాయని తెలిపారు.

కాకినాడ వైసీపీలో టెన్షన్.. సీట్ల మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు భేటీ
కాకినాడ జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులు ప్రచారంతో పొలిటికల్ స్క్రీన్ హీట్ ఎక్కింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులకి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్ పడుతున్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఇద్దరు ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎంపీపీలు జడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. ఎటువంటి అపోహలు అవసరంలేదని పైకి చెప్తున్నా లోలోపల తెగ మదన పడిపోతున్నారు. అయితే, పిఠాపురం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి మద్దతుగా ఆయన అనుచరులు క్యాంప్ ఆఫీసు కి చేరుకున్నారు. పెండెంకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రతిపాడులో కూడా సీట్ చేంజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై తనకు నమ్మకం ఉందని ఎంపీకి పోటీ చేస్తావా అని పార్టీ పెద్దలు అడిగారని ఇదే కంపార్ట్ అని చెప్పానని పెండెం దొరబాబు చెప్తున్నారు.. మరోవైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సైతం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.. కన్నబాబును కాకినాడ ఎంపీగా పరిశీలిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం తెలుస్తుంది.

పోలవరం ప్రాజెక్టును డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి..
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదు అనేది అవాస్తవం.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే.. నీళ్ళు తోడుకొడానికి ఉపయోగించుకోవాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బు తోడుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.. త్వరలో వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు పోలవరం లో పర్యటిస్తాం.. ఓటుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. ఆడుదాం ఆంధ్రా సంగతి ఎలా ఉన్నా.. ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది అని పురంధేశ్వరి తెలిపారు.

అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు
ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్ కోసం హ్యూజ్ డిమాండ్ ఉంది. రాజమౌళి సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా టికెట్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే… సలార్ మాస్ జాతర్ మిడ్ నైట్ నుంచే షురూ కానుందని తెలుస్తోంది. మామూలుగా అయితే… అన్ని సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ రోజు ఉదయం లేదంటే తెల్లవారుజామున ఉంటుంది కానీ సలార్ ఫస్ట్ షో మాత్రం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఉంటుందని తెలుస్తోంది.