NTV Telugu Site icon

Top Headlines @ 9AM: టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీసీకుంట మండలంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధుసూదన్ రెడ్డికి పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా మహేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇందిరాభవన్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు. బాధ్యతల అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజల అనంతరం గాంధీభవన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలో యాభై నుంచి అరవై మంది వరకు కూర్చోవచ్చు.వేదికపై 500 మంది వరకు ముఖ్యనేతలు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రంగులు వేయించి, కొత్త ఫర్నిచర్ వేయించి గాంధీభవన్‌ను ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శనివారం మధ్యాహ్నం సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గాంధీభవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

నేడు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంటారు. గాంధీభవన్‌లో ఆయనకు కేటాయించిన రాష్ట్రపతి ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇందిరాభవన్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు. బాధ్యతల అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజల అనంతరం గాంధీభవన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలో యాభై నుంచి అరవై మంది వరకు కూర్చోవచ్చు. వేదికపై 500 మంది వరకు ముఖ్యనేతలు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ నందిగం సురేష్..
గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే, టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహాకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక‌.. ఎవ‌రు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి (మంగళవారం) మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయ‌డానికి, దూషించ‌డం, భ‌య పెట్టడం లాంటివి చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా త‌మ న్యాయ‌వాదుల‌ను కూడా విచార‌ణ‌కు అనుమ‌తించాల‌ని నందిగం సురేష్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌ను న్యాయస్థానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

నేడు ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు..
పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్‌ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవ­లను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. చర్చలకని పిలిచిన రాష్ట్ర సర్కార్ తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్‌సీ వైద్యు­ల సంఘం తెలిపింది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్‌ వైద్యుల అవ­సరం లేదు.. ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్‌ ఆస్ప­త్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌ తెలిపారు. ఏపీ ఎన్‌జీవో, స్టాఫ్‌ నర్స్, సీహెచ్వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా ఈ నిరసనకు సపోర్ట్ ఇచ్చాయి.

‘మీరు ప్రధాని అవుతారంటే మేం మద్దతిస్తాం’.. కేంద్ర మంత్రి గడ్కరీకి ఆఫర్
ప్రధాన మంత్రి పదవి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఆశయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం పెద్ద ప్రకటన చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ..”నాకు ఒక సంఘటన గుర్తుంది.. నేను ఎవరి పేరునూ తీసుకోను. మీరు ప్రధానమంత్రి అవుతారంటే మేం మీకు మద్దతిస్తాం అని ఆ వ్యక్తి చెప్పాడు.” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందో మాత్రం చెప్పలేదు. నాగ్‌పూర్‌లో జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ” మీరు ప్రధాని అయితే మీకు మేం మద్దతిస్తాం అని అన్నారు. మీరు నాకు ఎందుకు మద్దతిస్తారని అడిగాను. నేను మీ నుంచి ఎందుకు మద్దతు తీసుకుంటాను? ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు. నేను నా విలువలకు, నా సంస్థకు విధేయుడిని… ఏ పదవి కోసం రాజీపడను. ఈ విలువ భారత ప్రజాస్వామ్యానికి పునాది.” అని మంత్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా.. 2024, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని పదవికి నితిన్ గడ్కరీ పేరు చర్చకు వచ్చింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు “ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అత్యంత అనుకూలమైన మూడవ నాయకుడిగా గడ్కరీ నిలిచారు.

ఏఐతో న్యూడ్ వీడియోస్ రూపొందించి.. 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్
ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా మహిళలు ఈ మోసానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. నిందితులు పోలీసు అధికారిగా నటిస్తూ మహిళలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారు. జబల్‌పూర్‌లోని కళాశాల విద్యార్థులను ఏఐ రూపొందించిన వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ సిట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) ఆర్‌కె శివ నేతృత్వం వహిస్తారు. ఇందులో క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ మంకున్వార్ బాయి మహిళా కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న రెండవ సినిమా దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు రాబోతున్న దేవర మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ రోజుకొక రికార్డు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 1.25 మిలియన్ దాటి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. ఇక టికెట్స్ పరంగా 40,000పైగా టికెట్స్ బుక్ అయ్యాయని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత వేగంగా $100k కలెక్ట్ చేసి రికార్డు సాధించాడు దేవర.  ఓవర్సీస్ లో ఇంతటి  భారీ బుకింగ్స్ కు కారణాలు ఏంటని ఆరాతీయగా ‘RRR’ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడం, 6 ఏళ్ల తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్ , పాటలు సుపర్ హిట్ అవ్వడంతో పాటు, కొరటాల ఎన్టీయార్ కాంబో క్రేజ్ అని గలగలిపి దేవర హ్యుజ్ బుకింగ్స్ లో కనిపించిందని  ఓవర్సీస్ బయ్యర్స్  చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ షోస్ కు ఇప్పటి నుండే తాకిడి ఎక్కువగా ఉంది. సెప్టెంబరు 27న భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవరను నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలిని సంయుక్తంగా నిర్మించారు.

Show comments