NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం.. 80వేల మందికి నిత్యావసరాల కిట్‌!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ (శుక్రవారం) సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నాం.. ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నేటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక, ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఇష్టానుసారం వసూళ్లు చేయకుండా ఒకే ధర నిర్ణయిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే, ఈరోజు నుంచి అందరికి మూడు రోజుల్లో నిత్యావసరాల సరఫరా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తొలిరోజైన నేడు 80 వేల మందికి నిత్యావసరాల కిట్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.

టీడీపీ ఆఫీసు దాడి కేసులో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ..
గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు. కాగా, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు కొన్ని టీంలు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపిన వారి కదలికలపై నిఘాపెట్టామని.. కేసులో ఉన్న అందరిని అరెస్టు చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తాడేపల్లి పోలీసులు చెబుతున్నారు. కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను హైదరాబాద్ లోని తన ఫాం హౌస్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ఆయనను హాజరుపర్చగా.. మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో సురేష్‌ 80వ నిందితుడిగా ఉన్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తున్న గోదావరి..
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన కృష్ణ, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం కృష్ణమ్మ కొంచెం శాంతించినా.. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిమట్టం క్రమంగా పెరుగిపోతుంది. అయితే, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటిమట్టం 12 అడుగులకు చేరిపోయింది. అలాగే బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీకి సంబంధించిన మొత్తం 175 గేట్లను ఎత్తి వేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరదం వస్తుండటంతో.. వరద మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు ఒక పాయింట్ వంతున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుంది.

నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన షెడ్యూల్‌..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 7:45 నిమిషాలకు హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో విజయవాడ కు బయలుదేరుతారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు హెలికాప్టర్లో మధిర నియోజకవర్గం కట్టలేరు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన ఎర్రుపాలెం మండలం మీనవోలు, ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉప్పొంగడంతో ముంపునకు గురైన ప్రకాష్ నగర్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. ఉదయం 11:15 గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సింగరేణి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు సింగరేణి పల్లి నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజులురావుపేట్ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని నీట మునిగిన పంట పొలాలను, వర్షం నేపథ్యంలో దెబ్బతిన్న ఎన్ఎస్పి కెనాల్ ను పరిశీలిస్తారు.

నేడు ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ఏరియల్‌ సర్వే ..
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. ఖమ్మంలోని 20 కాలనీలకు పైగా వరద నీటిలో చిక్కుకోగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా శివరాజ్‌సింగ్‌ ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్‌ ఆయనతో కలిసి వరద ప్ర­భా­విత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నా­రు. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొననున్నారు. అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు. అనంతరం ఉదయం 11.30 కు సచివాలయంలో సీఎంఓ అధికారులతో బ్రీఫింగ్ ఏర్పాటు చేశారు. మధ్నాహ్నం 2.30 కు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3.30కు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ తో కలిసి రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాటిల్లిన నష్టంపై సమీక్షపై మాట్లాడనున్నారు.

మణిపూర్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం ఒక భారీ క్యాలిబర్ లాంచర్, ఒక 12-బోర్ డబుల్ బ్యారెల్ రైఫిల్, ఒకటి .177 రైఫిల్ + మ్యాగజైన్, రెండు పిస్టల్స్, ఒక పాంపీ గన్, ఐదు గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ‘మణిపూర్‌లో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించే ప్రయత్నంలో హింసాత్మక కార్యకలాపాలను నిరోధించడానికి, దుర్మార్గులను ఎదుర్కోవడానికి భారత సైన్యం తన సెర్చింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మణిపూర్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఆర్మీ భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది.’ అని డీఆర్వో ప్రకటించింది. కచ్చితమైన సమాచారం అందిన తర్వాత భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీని ఫలితంగా కాంగ్‌పోక్పి, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలను రికవరీ చేశారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న దుండగులను పెద్ద దెబ్బ తీశారు. కౌత్రుక్‌లోని నిరాయుధ గ్రామస్థులపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కుకీ ఉగ్రవాదులు డ్రోన్‌ల నుండి బాంబులను జారవిడిచారు.

సింగపూర్ పర్యటన విజయవంతమైంది: ప్రధాని మోడీ
మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్ ప్రభుత్వానికి, ప్రజలకు వారి ఆప్యాయతకు ధన్యవాదాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతకుముందు సింగపూర్ పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోడీ, సింగపూర్ పీఎం లారెన్స్ వాంగ్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తమ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తమ సంభాషణలో ఇరువురు నేతలు భారత్ – సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఆ తర్వాత.. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ సర్వీసెస్ రంగాలలో ఇరుపక్షాలు నాలుగు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి. ప్రధాని మోడీ ప్రధాని లారెన్స్ వాంగ్‌ను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.

హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది!
హర్షిత్ రాణా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న హర్షిత్.. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాణించాడు. అయితే ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్‌ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. అతడికే ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి సెండాఫ్ పలికాడు. హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించాడు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు. భారీ జరిమానా పడినా హర్షిత్ రాణా మారలేదు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్‌ ట్రోఫీ 2024లోనూ అదే తరహా సెలెబ్రేషన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను కవ్వించాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-డీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్.. అనంతపురం వేదికగా ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్‌లో(2/13) సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇండియా-సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5)ను అవుట్ చేసిన హర్షిత్.. అతడేకే ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలెబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్‌గా మారింది.

దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ. ఓవర్సీస్ తో ఒకేసారి ఏపీ/టీజీ లో షోస్ ఒకే టైమ్ కి వేసేలా పక్కా పప్లానింగ్ తో వెళుతున్నాడు. 1.08 నిముషాలు కి  తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి, కాకినాడ పద్మప్రియ, రాజమండ్రిలోని గీతా అప్సర, అమలాపురం రమా టాకీస్, మండపేట రాజారత్నలో ప్రీమియర్స్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇటు కృష్ణ జిల్లాల్లో ట్రెండ్ సెట్, అలంకార్, శైలజ థియేటర్స్ లో తల్లవారు జామున షోస్ ప్లానింగ్ చేశారు. గుంటూరు రీజియన్ లో ఒంగోలులో గోపి కృష్ణ, గోరంట్ల కంప్లెక్స్, సత్యంలో భారీ గా స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. నెల్లూరు రీజియన్ లో కందుకూరు, దర్శి, కనిగిరి, నెల్లూరు టౌన్ లో వేకువ జామున షోస్ అగ్రిమెంట్స్ చేసారు. ఉత్తరాంధ్రలోని వైజాగ్ లో రికార్డు స్థాయి ప్రీమియర్స్ కు థియేటర్స్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. నందమూరి కంచుకోట సీడెడ్ లో డే -1 గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉంది దేవర. ఇక నైజాంలోని సుదర్శన్ 35, భ్రమరాంబమల్లికార్జున, విశ్వనాధ్, శ్రీరాములు, విమల్ థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ 1.08 షోస్ స్టార్ట్ చేస్తున్నారు.