నేడు రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అయితే.. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ నేడు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల నేటి ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లనున్న వైఎస్ షర్మిల.. గవర్నర్‌ను కలిసి తనపై దాడి, అరెస్టు తదితర వివరాల గురించి ఫిర్యాదు చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కాసేపట్లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత స్పందించనున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్న అంశాలు.. దానికి సంబంధించిన పరిణామాలపై ఆమె మాట్లాడనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలితీవ్రత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు. కొమురంభీం జిల్లాలో 9.4 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత. ఆదిలాబాద్ జిల్లాలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు. నిర్మల్ జిల్లా పెంబీలో 11.2, మంచిర్యాల జిల్లాలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు.
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగింది. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే బదిలీ జరగడంతో ఏదైనా రాజకీయ కోణం ఉందా..? అనే చర్చకు తెర లేచింది. వరంగల్ పోలీస్ కమిషనర్ పోస్టు డీఐజీ హోదా అధికారులు చేసేది.. డీఐజీ క్యాడర్ లో వరంగల్ పోలీసు కమిషనర్ గా 2021 ఏప్రిల్ లో బాధ్యతలు తీసుకున్న తరుణ్ జోషి తన మర్కు చూపిస్తూ పని చేశారు. 2022 జనవరిలో ఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఐజీ ప్రమోషన్ పొందిన తర్వాత బదిలీపైనా హైదరాబాద్ కి వెళ్ళిపోతారు. వరంగల్ కి కొత్త పోలీస్ కమిషనర్ వస్తారని అంచనా వేశారు. ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ తరుణ్ జోషి ఐజీ హోదా పొందిన కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ గానే 11 నెల పాటు విధులు నిర్వహిస్తువచ్చారు. ఇలాంటి వరంగల్ పోలీసు కమిషనర్ ఎందుకు ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన బదిలీకి కారణం ఏంటి ఇప్పుడు ఇదే పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
దిల్ రాజు అనుకున్నంత పనీ చేశాడు
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్స్ ఏ సినిమాకి దొరుకుతాయి అనే చర్చ జరుగుతుంటే, మంచి థియేటర్స్ మాత్రం నా సినిమాకే వస్తాయని చెప్పిన దిల్ రాజు ‘వారిసు’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం కొంతమందికి షాక్ ఇచ్చి ఉంటుంది.
ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఘాతుకం.. రూ.1.9 కోట్ల కోసం భార్య హత్య
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు. అక్టోబర్ 5న ఈ ఘటన జరిగింది. భర్త మహేష్ చంద్, తన భార్య షాటును హత్య చేయించాడు. మహేష్ చంద్ అభ్యర్థన మేరకు షాలు తన బంధువైన రాజుతో కలిసి బైకుపై గుడికి వెళ్తుండగా తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో వారి బైకును కారుతో ఢీకొట్టించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షాలు అక్కడిక్కడే మరణించింది. ఆమె బంధువు చికిత్స పొందుతూ మరణించాడు.
తాళిబొట్టు కొట్టేసిన కొడుకు.. పోలీసులకు పట్టించిన తల్లి
కొడుకు దొంగగా మారడంతో తట్టుకోలేని తల్లి అతడిని పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై విష్ణు నగర్ దేవి చౌక్‌లో సోమవారం ఉదయం ఓ దొంగతనం జరిగింది. ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడ నుంచి తాళి బొట్టును లాక్కుని వెళ్లాడు ఓ వ్యక్తి. ఆలస్యం చేకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. విష్ణు నగర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. పసుపు రంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పంపించి.. అతన్ని ట్రేస్ చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో.. విష్ణు నగర్ పోలీసులు ఫూలే నగర్ వాసి నుంచి అతని గురించి తెలుసనే సమాచారం వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె పేరు తానిబాయి రాజు వాఘ్రి. ఆ ఫొటోలో ఉంది తన కొడుకు కణు అని చెప్పిందామె. అయితే అతని గురించి ఎందుకు అడుగుతున్నారని పోలీసులను నిలదీసింది. దీంతో అతను చేసిన పనిని ఆమె వివరించారు. తన కొడుకు తాళిబొట్టు దొంగతనం చేశాడన్న వార్త విని ఆ తల్లి బాధపడింది. పోలీసులను దగ్గరుండి మరీ ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. తన భార్యకు సర్జరీ అయ్యిందని, పూల వ్యాపారం నడవకపోవడంతో ఖర్చులకోసం ఇలా దొంగతనం చేయాల్సి వచ్చిందని కణు నేరం ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బు అవసరం అయిన మాట వాస్తవమే అయినా.. ఇలా కొడుకు దొంగతనానికి పాల్పడడం భరించలేకపోతున్నానని కన్నీళ్లతో కణు తల్లి చెప్పింది.
గుజరాత్ లో తొలివిడుత ఎన్నికలు షురూ..
గుజరాత్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా భార్య రివాబా
స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రివాబా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. బీజేపీ నుంచి జామ్‌నగర్ నార్త్ నుంచి రివాబా జడేజా పోటీలో ఉన్నారు.
అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన
అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహకరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది. ఎఫ్ఏటీఎఫ్ నుంచి బయటపడేందుకు కూడా అమెరికా, పాకిస్తాన్ కు సహకరించింది. తాజాగా పాకిస్తాన్ తో కలిసి పనిచేసేందుకు అమెరికా ఎదురుచూస్తోందని ఆ దేశం ప్రకటించింది. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ కీలకం అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు. పాక్ ఆర్మీ కొత్త చీఫ్ గా అసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకున్న సమయంలో అమెరికా బుధవారం ఈ వ్యాఖ్యలను చేసింది. పాకిస్తాన్‌తో మా దీర్ఘకాల సహకారాన్ని విలువైనదిగా భావిస్తోందని, సంపన్నమైన, ప్రజాస్వామ్య పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలకు కీలకం అని కరీన్ జీన్ పియర్ అన్నారు. పాకిస్తాన్ లో ప్రజలకు సుస్థిరత, శ్రేయస్సును ప్రోత్సహించడానికి పాకిస్తాన్‌తో కలిసి పని చేయడం కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని అన్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. మొదటి స్థానంలో బాబర్ అజామ్, 8వ స్థానంలో కోహ్లీ, 9వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. వన్డే బౌలర్ జాబితాలో టీమిండియా ఆటగాళ్లు చోటు దక్కించుకోలేకపోయారు.
