NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కవితకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక తాజాగా ఆమెకు వైద్య పరీక్షలు చేయాలని జైలు అధికారులకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. పరీక్షలు అనంతరం నివేదికను అందించాలని ధర్మాసనం పేర్కొంది. ఇక లిక్కర్ కేసులో భాగంగా సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 22 వరకు ట్రయల్ కోర్టు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను జైలు అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత లాయర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తన మనవిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆస్పత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించారు. కవిత పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించింది.

టీజీ రైతులకు అలర్ట్..ఆ లింక్ లు ఓపెన్ చేస్తే..రుణమాఫీ డబ్బులు మాయం..!
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట మోసానికి పాల్పడుతున్నారు. ఏదో ఒక బ్యాంకు పిక్చర్ ను వాట్సాప్ ప్రొఫైల్ ఫిక్ గా పెట్టి ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తోంది. సైబర్ నేరగాళ్లు పంపించే లింకు యాక్సెప్ట్ చేస్తే..ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్ పే గూగుల్ పే యూ పే వాడకంలో జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. అలాంటి లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే 1930  ఫోన్ చేయాలని సూచించింది. కాగా.. నేడు తెలంగాణ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ చేయనుంది. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. 11.50 లక్షల మంది రైతుల రుణమాఫి సాయాన్ని పొందుతారు. ఇప్పటికే బ్యాంకులకు ఆర్థిక శాఖ నిధులు జమ చేసింది. ఆగస్టు పూర్తయ్యేలోపు 3 దశల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఈ నెలఖారులోపు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. కుటుంబాన్ని నిర్ధారించేందుకే ప్రామాణికంగా రేషన్ కార్డును చూడనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ మేరకు సూచనలు చేసింది.

అధికారుల నిర్లక్ష్యం..వరదల్లో చిక్కుకున్న 15మంది కూలీలు
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు దూసుకుపోతోంది. వరద ప్రవాహంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని రుద్రమకోట గ్రామానికి చెందిన కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్ ను సిద్ధం చేశారు ఏపీ అధికారులు. భద్రాద్రి అశ్వరావుపేట మండలం అనంతరం గ్రామంలో కేసీఆర్ కాలనీని వరద నీరు ముంచేసింది. గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వరద నీరు గ్రామం చుట్టూ చేరుకోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలు ఊళ్లోంచి కాళీ చేసి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దాని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్‌ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు కోట, గుణ, కళింగపట్నం మీదుగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. గాలి విచ్చిన్నతి ఈ రోజు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1కి.మీ నుంచి 5.8కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంది.

టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు అందరికీ తెలుసు.. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు అని ఆమె చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలకే ఇబ్బందులు ఎదురయ్యాయి.. ప్రజలిచ్చిన మద్దతును ఓర్చుకోలేక పోతున్నారు.. రెండు పార్టీల వ్యక్తులకు అప్పీల్ చేస్తున్నా.. అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.. చట్టం ఎవరికైనా ఒక్కటే టీడీపీ, వైసీపీ నేతలు, పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి అని ఏపీ హోంమంత్రి అనిత వేడుకున్నారు. ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, కేంద్ర హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలి అని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది.. దేనికైనా సమయం వస్తుంది.. అన్ని అంశాలు చట్టపరంగా చర్యలు ఉంటాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే.. గతంలో దిశా యాప్ ను మగవాళ్ళతోను డౌన్ లోడ్ చేయించారు.. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యా శాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడించారు.

మిత్రపక్షాల మధ్య విభేదాలు.. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్న ఆప్
త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని.. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఉండబోదని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆప్, కాంగ్రెస్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. హర్యానాలో జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు దోచుకున్నాయని మాన్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన రెండు సీట్లు అంబాలా, సిర్సాతో సహా 10 సీట్లలో ఐదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక జాట్‌ల ఆధిపత్యం ఉన్న మూడు స్థానాలైన సోనేపట్, రోహ్‌తక్, హిసార్ కూడా గెలుచుకుంది. ఓబీసీలు, అగ్రవర్ణాల మద్దతు కారణంగా కర్నాల్, ఫరీదాబాద్, గుర్గావ్, భివానీ-మహేంద్రగఢ్, కురుక్షేత్రలో బీజేపీ విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 58.20 శాతంగా ఉన్న బీజేపీ ఓట్ల శాతం 2024 నాటికి 46.11 శాతానికి పడిపోయింది.

‘‘ఇండియా గ్రేట్ పవర్’’.. ఐరాస వేదికగా రష్యా ప్రశంసలు..
భారత్-రష్యా బంధంపై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను నిర్ణయించుకునే, దాని భాగస్వాములను ఎన్నుకునే గొప్ప శక్తి కలిగి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి విలేకరుల సమావేశంలో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేస్తున్నందున ఆ దేశంపై ఒత్తిడి చేయడం పూర్తిగా అన్యాయమైనదని ఆయన అన్నారు. భారత్ తన సొంత ప్రయోజనాలను నిర్దేశించుకునే “గొప్ప శక్తి” అని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడి లోనవుతుందని మాకు తెలుసని, ఇది అంతర్జాతీయ రంగంలో పూర్తిగా అన్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇటీవల రష్యాలో పర్యటించడం, రష్యాతో ఇంధన సహకారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జూలై 8-9 తేదీల్లో రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, ఈ పర్యటనపై వెస్ట్రన్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ్ మాట్లాడుతూ.. ప్రపచంంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య నాయకుడు, ప్రపంచంలో రక్తపాత నేరస్తుడిని కౌగిలించుకోవడం నిరాశకు గురి చేసింది’’ అని మోడీ, పుతిన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా కన్ఫామ్..
నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ జాతి రత్నాలు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నవీన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన స్టైల్ మ్యానరిజంతో ప్రేక్షకులను తెగ మెప్పించాడు నవీన్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో వైవిధ్యమైన కథ ఎంచుకొని మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక ఇప్పటివరకు కేవలం మూడు సినిమాల్లోనే హీరోగా నటించిన నవీన్.. సినిమా తీయడానికి టైం ఎక్కువగా తీసుకున్న మంచి సినిమా చేస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. ఇకపోతే చాలా రోజులుగా నవీన్ పోలిశెట్టి నుండి కొత్త సినిమా అప్డేట్ ఏది రాలేదనుకున్న సమయంలో.. తన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. తానుగా పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానని.. దురదృష్టవశాత్తు తన చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని., కాలికి కూడా ఇంజురీ అయిందని., ఇది నాకు చాలా టఫ్ టైం అండ్ పెయిన్ ఫుల్ టైం అంటూ.. బాగా క్రియేటివ్ గా ఆలోచించి పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టులో తాను గాయాల వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా సినిమాలను తీసుకురాలేకపోతున్నాను అందుకు సారీ అంటూ తెలుపుతూనే.. మరోవైపు గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న రాబోయే సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా మీకు నచ్చే విధంగా తయారవుతుందని చెప్పుకొచ్చాడు.