వాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్..
అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యడం ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేస్తే తప్పించుకోలేరు.. ప్రేమ పేరుతో మహిళలను ముగ్గులోకి దింపుతున్నారు.. ఇలాంటివి సహించేది లేదు.. చిన్న చిన్న అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా ఐయిపోతారు జాగ్రత్త అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తుంది.. గంజాయి పండించొద్దని గిరిజన ప్రాంతాల్లోని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా దీనిపై సమీక్ష చేయలేదన్నారు. అందుకే, విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు.
జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్న పిల్లలు కొట్టుకున్నట్లుంది.. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా?.. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం లేదు.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలి పెట్టొద్దు.. అందరినీ జైలుకు పంపండి అని సీపీఐ నారాయణ కోరారు. జగన్ శైలి చూస్తుంటే అడవి నుంచి ఇప్పుడే జనం మధ్యలోకి వచ్చినట్లుంది.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. స్వయం ఉపాధి పథకం కింద రూ.5లక్షలు!
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు.
కేంద్రమంత్రులతో కోమటి రెడ్డి భేటీ.. ఆ అంశాలపై చర్చ
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.”రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు. 95 శాతం భూసేకరణ పూర్తయింది. కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తామన్నారు. హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరాం. రెండు ప్యాకేజీలు గా రోడ్డు నిర్మాణం జరిపేందుకు టెండర్లు పిలిచేందుకు అధికారులు గడ్కరీ ఆదేశాలిచ్చారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్ ను వేగవంతం చేయాలని కోరాం. అటవీ భూములు, అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని అధికారులకు గడ్కరీ సూచించారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచెందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.” అని మంత్రి వెల్లడించారు.
గ్రూప్ 2 ఫలితాలు విడుదల
గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్‌సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. సోమవారం గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టులకు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. కాగా.. మార్చి 14వ తేదీన గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.
రోహింగ్యా, బంగ్లాదేశీలను భారత్ నుంచి పంపించాలి..
భారత్‌లోకి నానాటికి బంగ్లాదేశ్, రోహింగ్యాల వలసలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో పాటు పలు రాష్ట్రాల్లో వీరు స్థిరపడటం భద్రతా పరమైన చిక్కుల్ని తీసుకువస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోహింగ్యా, బంగ్లాదేశీయుల వలసలపై హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా స్థిరపడిన వారిని గుర్తించి వారిని దేశం నుంచి పంపించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ను కోరింది. సరిహద్దు మౌలిక సదుపాయాలు, భద్రతను సమీక్షించడానికి, అక్రమ క్రాసింగ్‌లను అరికట్టడానికి నిధులను, అధునాతన నిఘా టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్యానెల్ నొక్కి చెప్పింది. సరిహద్దుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఫెన్సింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన నిధులు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయా..? అనే వివరాలను నిర్ధారించుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
బలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్న బీఎల్ఏ తమ ఆధీనంలోకి 100 మందికిపైగా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, బందీలుగా చేసుకున్నట్లు తెలిపింది. ఆరుగురు పాకిస్తాన్ సైనిక సిబ్బంది కూడా ఈ సంఘటనలో మరణించినట్లు వెల్లడించింది. పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు తొమ్మిది బోగీలలో 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై కాల్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దళాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలను చంపేస్తామని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ సంతకం చేసిన ఒక ప్రకటన తెలిపింది. బీఎల్ఏ పోరాట యోధులు రైల్వే పట్టాలను పేల్చేసి, రైలును బలవంతంగా ఆపేశారు. ఆ తర్వాత దానిలోకి ఎక్కి ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారు. ఈ ఆపరేషన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి బాధ్యత తీసుకుంటుందని బీఎల్‌ఏ ప్రతినిధి సోషల్ మీడియాలో చెప్పారు.
రవితేజ కొడుకు హీరో అవుతాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి?
రవితేజ కొడుకు మహాధన్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి భళా అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అతని పాత్ర చూసి, అతని నటన చూసి భవిష్యత్తులో కచ్చితంగా హీరో మెటీరియల్ అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక షాకింగ్ న్యూస్ తాజాగా తెలుస్తోంది. అదేంటంటే రవితేజ కొడుకు మహాధన్ స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయబోతున్నాడు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ స్పిరిట్ అనే సినిమా రూపొందాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ కొడుకులతో పాటు రవితేజ కొడుకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయబోతున్నాడు. ఇప్పటికే మరో 12 నుంచి 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. కానీ ఒక స్టార్ హీరో కుమారుడుతో పాటు ఒక స్టార్ డైరెక్టర్ కుమారులైన ఇద్దరూ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేయబోతూ ఉండడం హాట్ టాప్ పిక్ అవుతోంది.
ఎన్టీఆర్ కొత్త లుక్ చూశారా.. ఆ మూవీ కోసమేనా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో నెల రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నారు. తాజాగా ఆయన ఎయిర్ పోర్టు దగ్గర చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
