Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

గుట్కా ప్యాకెట్ల చిచ్చు..! హెడ్ కానిస్టేబుల్‌పై జనసేన కో-ఆర్డినేటర్‌ దాడి..
గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్‌ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్.. అయితే, భగత్ సింగ్ కాలనీ సమీపంలోని కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లను అమ్ముతుండగా ఫొటోలు తీశాడు హెడ్ కానిస్టేబుల్ మణి.. దీంతో, హెడ్ కానిస్టేబుల్ మణితో ఘర్షణకు దిగారు షాపు యజమాని లక్ష్మీ.. అంతేకాదు, సమీపంలోనే మద్యం తాగుతున్న సుధాకర్ , అతని బ్యాచ్ కు ఫోన్ చేసిన ఈ విషయం చెప్పింది.. దీంతో, కారులో ఘటనా స్థలానికి చేరుకున్న సుధాకర్‌ అండ్ బ్యాచ్.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి దిగింది.. అయితే, తాను పోలీసునని చెప్పినా వినిపించుకోకుండా.. సుధాకర్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు.. ఈ వ్యవహారంపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణకు ఫిర్యాదు చేశారు హెడ్ కానిస్టేబుల్.. మరోవైపు ఘటనా స్థలాన్ని చేరుకున్న రూరల్ సీఐ ఈశ్వరయ్య, పోలీసులు.. అసలు గొడవ, దాడికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు.. మరోవైపు.. జనసేన జిల్లా కో-ఆర్డినేటర్‌ పిడతల సుధాకర్‌ పరారయ్యాడు.. మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఘటనపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సీరియస్‌ అయ్యారు.. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కొట్టినట్టు కేసు నమోదు చేశారు.. పరారీలో ఉన్న సుధాకర్‌ కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు రూరల్‌ పోలీసులు..

జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపు.. ధీమా వ్యక్తం చేసిన మంత్రి..
కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు… గత ప్రభుత్వం గమ్యం లేని పరిపాలన చేశారు.. రాష్ట్ర అభివృద్ధి పట్ల విజన్ కనిపించలేదు.. బటన్ నొక్కాం సంక్షేమ ఇచ్చాం పని ఐపోయింది అనుకున్నారు.. అమ్మ ఒడి, విద్యా దీవెన ఇచ్చారు వదిలేశారు.. ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.. రైతు భరోసా ఇచ్చాం అని రైతులను మోసం చేస్తారా? అని మండిపడ్డారు.. హెచ్ఎన్ఎస్ఎస్ రాయలసీమకు జీవనాధారం.. ఎందుకు పూర్తి చేయలేకపోయారు.. సాగునీరు, వ్యవసాయ పరికరాలు రైతులకు ఇవ్వలేదు.. రైతులకూ 1600 కోట్లు ఎగ్గొట్టారు.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చెరువులు నింపలేకపోయారు.. పులివెందులలో గృహ నిర్మాణం దారుణంగా ఉంది.. కనీసం పర్యవేక్షణ చేయలేదు అంటూ విమర్శలు గుప్పించారు.

శ్రీశైలం డ్యామ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌..!
శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు.. ట్రాఫిక్‌పై సున్నిపెంట సీఐ చంద్రబాబు, పోలీసులు సిబ్బంది డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు.. ఇటీవల కాలంలో హైదరాబాద్‌ – శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు అధికం కావడంతో సీఐ చంద్రబాబు డ్రోన్‌ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షించారు.. అసలు, ఈ ట్రాఫిక్‌కు ఎలా నియంత్రించాలి అనేదానిపై అధ్యయనం చేస్తున్నారు.. నంద్యాల జిల్లా ఎస్పీ, ఆత్మకూరు డీఎస్పీ ఆదేశాలతో డ్రోన్‌ సహాయంతో ట్రాఫిక్ క్లియర్‌ చేసేందుకు చర్యలకు పూనుకుంటున్నారు.. ముఖ్యంగా శని, ఆదివారాలలో శ్రీశైలం – హైదరాబాద్‌ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.. దీంతో, ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి పెట్టారు.. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.. ట్రాఫిక్‌కు నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.. దీంతో, శ్రీశైలం డ్యామ్‌ వద్ద, ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. శ్రీశైలం టూటౌన్‌ సీఐ చంద్రబాబు.. డ్రోన్‌ కెమెరాలతో వినూత్నంగా ట్రాఫిక్‌ కంట్రోల్ చేస్తూ.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తున్నారు.. దీంతో, భక్తులు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా సులభంగా శ్రీశైలం రాకపోకలు సాగిస్తున్నారు పోలీసులు చెబుతున్నారు..

రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్
రాఖీ పౌర్ణమి పండగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఫలితంగా, కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది.

ఇలా చేస్తే గోవాకు ఎవడు రాడు.. హైదరాబాద్ జంటపై దాడి
గోవాలో మరోసారి పర్యాటకుల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదుకు చెందిన ఓ దంపతులు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లగా, పనాజీ బస్‌స్టాండ్ సమీపంలో బైక్ అద్దె వివాదం ఘర్షణకు దారితీసింది. సెలవులు రావడంతో గోవా పర్యటనకు వెళ్లిన ఈ జంట, స్థానికంగా బైక్ అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం సమయానికి తిరిగి అప్పగించినప్పటికీ, అద్దెదారులు అదనంగా ₹200 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించగా, మాటల తూటాలు ఘర్షణకు మారాయి.

ఆపరేషన్ సింధూర్‌పై బిగ్ అప్డేట్.. ఎన్ని పాక్ ఫైటర్ జెట్లు కూల్చేశామంటే..!
ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ మే 7 ఉదయం, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ సింధూర్‌ ప్రారంభంతో ఇరుదేశాల మధ్య ప్రారంభమైన వివాదం దాదాపు 4 రోజుల పాటు కొనసాగి మే 10 సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ప్రకటించడంతో ఆగింది. తాగా ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు.

334 పార్టీలు ఔట్.. నిబంధనలు వర్తిస్తాయన్న ఈసీ..!
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A నిబంధనల ప్రకారం ECIలో నమోదు చేయబడ్డాయి. అన్ని రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కోసం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని, ఒక పార్టీ వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోతే, దానిని నమోదైన పార్టీల జాబితా నుంచి తొలగిస్తారని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పుడు దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు, 2854 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది. 334 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను (RUPP)లను శనివారం ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. నిబంధనల మేరకే గుర్తింపు లేని పార్టీలను రిజిస్టర్డ్ జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది.

కియారా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్,నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలోని ‘ఆవన్ జావన్’ పాటలో కియారా అద్వానీ బికినీ సీన్‌కు సెన్సార్ బోర్డ్ కత్తెర విధించింది. ఒక రకంగా ఆమె అభిమానులకు ఇది షాక్ అనే చెప్పాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఆదేశాల మేరకు 9 సెకన్ల ‘సెన్సువల్ విజువల్స్’ను 50% తగ్గించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ సీన్‌లు కియారా బికినీ సన్నివేశానికి సంబంధించినవని భావిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లో కియారా బికినీ లుక్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సవరణలతో చిత్రానికి హిందీ వెర్షన్ కి సంబందించి ఆగస్టు 6న U/A 16+ సర్టిఫికేట్ జారీ అయినట్టు సమాచారం. ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం స్పై యూనివర్స్‌లో ఆరో భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాస్ జాతర టీజర్ అప్డేట్.. డేట్, టైమ్ ఫిక్స్
మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న మూవీ మాస్ జాతర. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11న ఉదయం 11 గంటల ఎనిమిది నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని కూడా యాక్షన్ కమ్ ఎంటర్ టైన్ మెంట్ కేటగిరీలోనే తీసుకొస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన పాటలు మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ మూవీలో ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని హీరో రవితేజ చూస్తున్నాడు.

’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్‌
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ స్పీడ్ గా షూటింగ్ అవుతోంది. రంగస్థలాన్ని మించి దీన్ని తీస్తున్నామని ఇప్పటికే రామ్ చరణ్‌ చెప్పడంతో ఓ రేంజ్ లో హైప్ పెరిగింది. బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా కోసం ఓ కీలక వ్యక్తిని రామ్ చరణ్‌ తీసుకొచ్చాడు. తమిళ హీరో విక్రమ్ చేసిన తంగలాన్ భారీ హిట్ అయింది. ఈ సినిమాలో కాస్ట్యూమ్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఆ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన ‘ఎకమ్’ ను ఇప్పుడు పెద్ది సినిమా కోసం రామ్ చరణ్‌ తీసుకొచ్చారు.

Exit mobile version