అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు చకచకా అడుగులు వేస్తోంది.. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత నిపుణుల సలహాలు.. సూచనలు.. భవనాల పటిష్టత ఇలా.. ఒక్కో అడుగు ముందుకు పడుతో వచ్చింది.. ఇక, అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్‌స్ట్రక్షన్ మేజర్‌లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్‌ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న సంస్థలకు వర్క్ ఆర్డర్‌లు జారీ చేయనున్నారు.. ఎమ్మెల్యేలు, ఏఐఎస్ అధికారుల హౌసింగ్ ప్రాజెక్ట్ చేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకే మరలా కాంట్రాక్ట్ పనులు అప్పగించనున్నారు.. హ్యాపీ నెస్ట్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ పనులను చేయడానికి ఎన్‌సీసీని ఎంపిక చేశారు.. ఇంజినీరింగ్ మేజర్ L&T కే మళ్లీ NGOల హౌసింగ్ ప్రాజెక్ట్ అప్పగించగా.. ఇప్పుడు రెండు భాగాలుగా NGOల హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిబంధనల ప్రకారం “హై రిస్క్ ప్రాజెక్ట్”గా NGOల హౌసింగ్ మొత్తం ఖర్చు 1872.74 కోట్లుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్\ADB నుండి నిధులు కోరింది ఏపీ సీఆర్‌డీఏ.. మరో నిర్మాణ ప్రధానమైన KMV ప్రాజెక్ట్స్‌కు IAS అధికారుల బంగ్లాల నిర్మాణాలకు తిరిగి అప్పగించనున్నారు.. BSR ఇన్‌ఫ్రా నే న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనికి మళ్లీ ఎంపిక చేసింది ప్రభుత్వం.. ఏపీ సీఆర్‌డీఏ డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రాజెక్ట్‌ల కోసం టైమ్‌లైన్‌లను రూపొందించింది..
పీజీ వరకు.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..
కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారా లోకేష్.. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను.. ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రులు ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం.. విద్యార్థుల తల్లిదండ్రులతో.. ఉపాద్యాయులతో కలిపి సమావేశం పెట్టాం అన్నారు.. పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్న ఆయన.. గడిచిన ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.. గాడి తప్పింది, అలా గాడి తప్పిన, విద్యాశాఖను గాడిలో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు అప్పగించారు.. ఇక పై విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తామన్నారు.. రాజకీయ నాయకుల ఫొటోలు స్కూల్ లో ఉండకూడదు, స్కూల్ బుక్స్ లో కూడా ఉండకూడదన్న ఆయన.. కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు.. ఇక, పాఠ్య పుస్తకాలలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని సూచించారు మంత్రి లోకేష్.. నేను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని, కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని గుర్తుచేసుకున్నారు.. పరీక్షా కేంద్రాల్లో.. టీచర్లు గానీ.. ఇన్విజిలేటర్లు గానీ అక్కడ ఉండరని తెలిపారు.. అయినా.. ఎవరూ పక్క వాళ్ల పేపర్ కోసం, కాపీయింగ్ కోసం చూడరన్నారు.. అలాంటి విద్య వ్యవస్థ ఇక్కడ కూడా రావాలని ఆకాక్షించారు.. ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగుపడాలంటే.. మనం అంతా కలిసి పనిచేయాలన్నారు.. అందుకోసమే.. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా.. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు.. విద్యా వ్యవస్థకు టెక్నాలజీని జోడిస్తాం.. త్వరలోనే డిజిటల్ క్లాస్‌ను ప్రారంభిస్తామని తెలిపారు..
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్య.. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు..
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. విద్యా ప్రమాణాల మెరుగుకు శ్రీకారం చుడతామన్నారు. తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు మెరుగు పరచాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడిగా సాగేవని, ఐదేళ్ల కాలంలో విద్యావ్యవస్ధలను బ్రష్టు పట్టించారని వివమర్శించారు.. టెక్కలి నియోజక వర్గం కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం) కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా శాఖలో ఒక్కొక్కటిగా సంస్కరణలు తీసుకువస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేవిధంగా అవరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఉపాధ్యాయులు బోధిస్తే మంచి ఫలితాలు రావని భావించిన కూటమి ప్రభుత్వం తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)కు శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాల నిర్వ హిస్తున్నామని మంత్రి తెలిపారు.
గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో భూమి కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచుతామన్నారు. తెలంగాణలో 80శాతం 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. ఈ విషయాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటోందన్నారు. గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచామన్నారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వరికి క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచుతామని చెప్పారు.బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో 3,500 ఇళ్లు కేటాయిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
రాజన్న కోడెల వివాదంపై స్పందించిన మంత్రి సురేఖ
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు.గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో కోడెల నిర్వహణ భారంగా మారి చాలా కోడెలు మరణించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మేలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు. మూగజీవాలపై తమ ప్రభుత్వానికున్న శ్రద్ధ అటువంటిది అని మంత్రి అన్నారు. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్న పరిస్థితుల్లో కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన వార్తలు వట్టి పుకార్లను మంత్రి సురేఖ కొట్టి పారేశారు.
గాంధీభవన్ వెలవెలబోతుండగా.. తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషం
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 ఏళ్లు పూర్తవుతాయని, గత ఏడాది పార్టీకి అత్యంత కఠినమైన సమయమని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని ఆశ్చర్యకరంగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఐదు నెలలు ఉండడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం , పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో విజయాలు సాధించలేకపోవడం వంటి విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత పెరుగుతోందని, రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లిన విషయాన్ని వెల్లడించారు. అలాగే, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు, ఆశా వర్కర్లు తమ డిమాండ్లు ఉంచుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ పోరాట తత్వం కోల్పోలేదని, ప్రజల మద్దతు ఇంకా తమ పార్టీకి ఉందని నమ్మకం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణం.. ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం..
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్‌ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగమైందని చెప్పారు. కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగిస్తోందని మాయావతి మండిపడ్డారు. సంభాల్ మసీదు సమస్యని లేవనెత్తడాన్ని ఆమె ప్రస్తావించారు. పొరుగుదేశంలో హిందువులపై పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు జరిగి బలవుతున్నారని, వారిలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి, ఇప్పుడు సంభాల్, సంభాల్ అంటూ ముస్లిం ఓట్ల కోసం అరుస్తోందని విమర్శించారు.
విమానంలో దంపతుల లైంగిక చర్య.. వీడియో వైరల్!
దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. నవంబర్‌లో బ్యాంకాక్ నుంచి జూరిచ్‌కు వెళ్తున్న కమర్షియల్ ఫ్లైట్ స్విస్ ఎయిర్ విమానంలో దంపతులు ప్రయాణం చేస్తున్నారు. విమానం గగనతలంలో ఉండగా.. జంట ఓ చోటకు వెళ్లి లైంగిక చర్యలో పాల్గొన్నారు. అయితే దీన్ని గమనించిన విమాన సిబ్బంది.. రహస్యంగా మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం కాక్‌పిట్ సిబ్బంది.. గ్రూప్ చాట్‌లో వీడియోను ఫార్వడ్ చేశారు. అది కాస్త ఆయా సోషల్ మీడియా గ్రూప్‌లకు చేరుకుని వైరల్‌గా మారింది. దీన్ని గమనించిన ఎయిర్‌లైన్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బంది తీరును తీవ్రంగా ఖండించింది. ప్రయాణికుల గోప్యతను ఉల్లంఘించినందుకు స్విస్ ఎయిర్ సంస్థ విచారణకు ఆదేశించింది. ప్రయాణికుల భద్రతకు ఆటంకం కలిగించిన సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది.
ఆ హీరో మా ఫోన్లు ఎత్తడం లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ !
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ – మా “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి మొదటి నుంచి ఎంతోమంది పెద్దలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ రోజు మీ అందరి సమక్షంలో “ఎర్రచీర – ది బిగినింగ్” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది.
సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్లలో దూసుకుపోతోంది. పుష్ప రాజ్‌తో పాటు రష్మిక, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో రెచ్చిపోయి నటించాడు ఓ నటుడు. అయితే శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ బుగ్గారెడ్డి కారణంగా మరింత శక్తివంతంగా మారింది. అయితే ఈ ఈ బుగ్గ ఎవరు? ఇంతకీ ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా? . ‘పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప. ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా మారుతున్నాడు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప కనిపించారు. ఇందులో సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో కనిపించాడు. రాకీ భాయ్‌తో తారక్ పొన్నప్పకు కూడా సంబంధం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి తారక్ పొన్నప్ప KGF: చాప్టర్ 1, KGF 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తారక్ పొన్నప్ప వయసు 33 ఏళ్లు. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేవారు. ఇక మొత్తం నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.