మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం..!
మామిడి ఈసారి రైతులను నట్టేట ముంచేసింది.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60-రూ.70 పలికి.. వినియోదారుడి జేబు చిల్లు పెట్టినా.. హోల్‌సెల్ మార్కెట్‌లో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. కనీసం పెట్టుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ తరుణంలో మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి ఉత్పత్తి జరుగుతుండగా.. గత నెల 23న మామిడి రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మామిడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.. మామిడి రైతులను రోడ్డున పడేస్తున్న వైసీపీ మాఫీయాకు అండగా నిలబడేందుకే వైఎస్ జగన్.. బంగారుపాళ్యం పర్యటన అంటూ ప్రభుత్వం వర్గాలు దుయ్యబడుతున్నాయి..
భూముల రీ సర్వే.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్..
గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూశాఖ పని తీరు.. భూ పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భూమి సెంటిమెంట్ అర్ధం చేసుకుంటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.. గ్రామాల్లో చాలా భూములు వివాదాల్లో ఉంటాయి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువ గల భూమిని… గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. పేదల ఇల్లు… జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు అవుతుందన్నారు.
రొట్టెల పండుగకు సర్వం సిద్ధం.. కోర్కెలు తీర్చే ఆ రొట్టెల చరిత్ర ఏంటి..?
కులమతాలకు అతీతంగా.. మతసామరస్యాలకు ప్రతీకగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుంది. మొహరం సందర్భంగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. 6 నుంచి జరిగే రొట్టెల పండుగని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు అనడానికి ఒక స్టోరీ ప్రాచుర్యంలో ఉంది. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మతప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు. కాగా, సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరి కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేస్తారు. అలా ఆ దర్గాకు బారాషహీద్ దర్గా అని పేరు వచ్చింది.
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. త్వరలో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై విధివిధానాలను రూపొందించనుంది.. వాటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత.. ఇళ్ల స్థలాలపై ఓ నిర్ణయం తీసుకోనుంది కూటమి ప్రభుత్వం..
ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్.. గ్రూపులు కడితే భయపడేది లేదు..
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు. నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతారు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ.. నేను పట్టించుకోమని తేల్చి చెప్పారు.
తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్..
తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ. సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఈ ఆర్‌యూపీపీలు గత ఆరు సంవత్సరాలలో సాధారణ, శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు.. దీంతో ఈ పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పని చేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ 13 పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని ఈసీఐ ప్రతిపాదించింది.
బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయి
కాంగ్రెస్ సభ సామాజిక అన్యాయ సభ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. జైభీం, జైబాపు, జైసంవిధాన స్ఫూర్తినీ హత్య చేసింది కాంగ్రెస్.. గాంధీ పేరును కూడా కబ్జా చేసి నెహ్రూ వంశం డూప్లికేట్ గాంధీలు అయ్యారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను జీవితాంతం క్షోభ పెట్టింది కాంగ్రెస్.. వారి అకాల మరణానికి కారణం కాంగ్రెస్, రాజకీయంగా ఆయన్ను హత్య చేసింది అన్నారు. అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్.. సంవిధాన్ పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను మార్చిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. ఇప్పుడున్నది ఇందిరా గాంధీది కాంగ్రెస్.. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్.. సిగ్గు శరం లేకుండా పుస్తకాన్ని పట్టుకుని ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నది అని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.
అప్పుల కుప్పగా అగ్రరాజ్యం అమెరికా.. కారణం ఇదేనా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అమెరికా అప్పు $40 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 2020 ప్రారంభంలో ఈ అప్పు $23.2 ట్రిలియన్లు ఉండేది. అంటే, గత 5 సంవత్సరాలలో సుమారు $17 ట్రిలియన్ల అప్పు పెరిగింది. అమెరికా చరిత్రలో ఇదే గరిష్ట అప్పుగా చెబుతున్నారు. ఆ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం దాని వడ్డీని చెల్లించడానికే ఖర్చు అవుతోంది.
పాకిస్తాన్‌లో మరో ఉగ్రవాది ఖతం.. గుర్తుతెలియని వ్యక్తుల ధమాకా..
పాకిస్తాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు. పాక్‌లోని దిర్‌లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ హబీబుల్లా హక్కానీని అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. గురువారం, గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదిని కాల్చిచంపినట్లు సమాచారం.
మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నీల్లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) కూడా ఒకటిగా చేరిపోయింది. దీనికి కారణం మనకు ఎంతో ఇష్టమైన రిటైర్డ్ క్రికెట్ లెజెండ్స్ మరోసారి మైదానంలో కనిపించడమే. ఈ టోర్నీ రెండవ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్ లోని నాలుగు ప్రధాన వేదికలపై జరగనుంది. మొదటి సీజన్‌లో ట్రోఫీ గెలుచుకున్న ఇండియా ఛాంపియన్స్ జట్టు, మరోసారి యువరాజ్ సింగ్ నాయకత్వంలో టైటిల్‌ను నిలుపుకోవడానికి సిద్ధమైంది. యువరాజ్‌తో పాటు జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 16 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించబడింది.
ట్రైలర్ తో వాటికి సమాధానం చెప్పిన వీరమల్లు..
హరిహర వీరమల్లు సినిమాపై చాలా రకాల అనుమానాలు మొన్నటి దాకా వినిపించాయి. మూవీ మొదలై ఐదేళ్లు అయింది.. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లు బాగా రాలేదని పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరకొరగా షూటింగ్ జరిగిందని టాక్. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా మైనస్ పాయింట్. పైగా పవన్ కూడా ఈ సినిమా గురించి ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అటు ఫ్యాన్స్ లో ఇటు సాధారణ ప్రేక్షకుల్లో దీనిపై రకరకాల అనుమానాలు పెరిగిపోయాయి.
‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ అవుతోంది. చాలా వాయిదాల తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డు వ్యూస్ తో దుమ్ము లేపింది ఈ ట్రైలర్. 24 గంటల్లో ఈ నడుమ వస్తున్న వ్యూస్ ను బట్టి రికార్డుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరమల్లు అందరికంటే టాప్ లో నిలిచింది. 24 గంటల్లోనే ఏకంగా 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇది తెలుగు లాంగ్వేజ్ లో వచ్చిన వ్యూస్. ఇక అన్ని భాషల్లో కలిపి ఏకంగా 62 మిలియన్ల వ్యూస్ సాధించింది ఈ ట్రైలర్.
