అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారింది.. ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్‌లో చర్చించండి..
అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. అయితే, ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్‌లో చర్చించండి అంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్‌లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరగాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. హర్షకుమార్ తన లేఖలో ”అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారడం రైతుల్ని నిరాశలోకి నెట్టేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అరటికి భారీ డిమాండ్, భారీ ధరలు ఉన్నా… ఇక్కడ రైతులకు మాత్రం అవమానకరంగా యాభై పైసలు మాత్రమే ఇస్తున్నారు. అమెరికాలో డాలర్లు సంపాదిస్తుండగా, మా రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మరియు లోక్‌సభ ఎంపీ మాణికం ఠాగూర్‌కు హర్ష కుమార్ లేఖ రాశారు. అలాగే.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. పార్లమెంటులో ఆంధ్రా అరటి రైతుల సమస్యను తప్పనిసరిగా ప్రస్తావించాలని కోరారు.
పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా మీకు ఇది సబబు కాదు.. వెంటనే వెనక్కి తీసుకోవాలి..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల నష్టానికి “తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది” అని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు బాధాకరమనీ, ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగానేవున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతాయని, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతారాహిత్యాన్ని చూపుతున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపే ప్రయత్నం అంగీకారయోగ్యం కాదు అన్నారు వైఎస్ షర్మిల.. ఉప్పునీటి ముప్పు కారణంగానే చెట్లు కూలిపోతున్నాయి.. కోనసీమలో శంకరగుప్తం డ్రెయిన్‌కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సముద్రం నుంచి పైకివస్తున్న ఉప్పునీటి ప్రవాహం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం, దీర్ఘకాలిక శ్రద్ధ లేకపోవడం వల్ల లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు షర్మిల.. అయితే, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదు అన్నారు.. కొబ్బరి రైతులకు వెంటనే ఉపశమనం కల్పించాలి.. కోనసీమ రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని.. ఉప్పునీటి ముప్పును నివారించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలి.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలి.. రూ.3,500 కోట్లు కేటాయించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. కోనసీమ కొబ్బరి చెట్లపై కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల..
వీడు మామూలోడు కాదు.. ఒక్క పిన్నీసుతో 11 బైక్‌లో చోరీ..!
ప్రకాశం జిల్లా పుల్లలచేరువులో ఓ దొంగతనం వెలుగులోకి వచ్చింది.. చూడడానికి చిత్రవిచిత్రంగా ఉంది.. ఒక్క పిన్నీసుతో 11 బైక్ లను చోరీ చేశాడు.. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది.. వేణు అనే యువకుడు చూడడానికి అమయకుడుగా ఉప్పప్పటికి ఈజీ మణికి అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో దేశముదురుగా.. కన్నింగ్, కంత్రి గా అవతారం ఎత్తాడు.. ఆ 20 సంవత్సరాల యువకుడు.. ఒక్క పిన్నీసుతో 11 బైక్ లను చోరీ చేసి చివరికి కటకటాల్లోకి పోయాడు.. పుల్లలచేరువు పట్టణంలో మోటార్ సైకిళ్లను దొంగలించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.. వీళ్ళు చేసిన దొంగతనాలను చుస్తే అచ్చర్యం వేయక మానదు.. ఒక పిన్నీసుతో 11 బైక్ లను దొంగతనం చేశారంటే వీళ్ళ రేంజ్ ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి దొంగతనం ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు..లైవ్ డెమో లో బైక్ లు ఎలా దొంగతనాలు చేస్తాడో బైక్ గొంగ వేణు చూపించాడు.. కట్ చేస్తే.. పోలీసులే షాక్ అయ్యారు..
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరాను..
మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరాను.. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించారని తెలిపాం.. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీకి పలు వినతులు చేశాం.. హైదరాబాద్- బెంగళూరు- చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. ఇక, ఆర్ఆర్ఆర్ సౌత్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో విభిన్న రకాల మనస్తత్వాలపై చెప్పే ప్రయత్నం చేశాను.. డీసీసీ అధ్యక్షులు వయస్సులో చిన్నవాళ్లైనా, పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు. ఇక, తెలంగాణలో మరో రెండు టర్ములు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. ఇక, డిసెంబర్ 8, 9న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. అలాగే, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించిన ఆహ్వాన పత్రికను వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
‘‘ఒక ఎకరం-ఒక సీజన్’’.. సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం..
సహజ వ్యవసాయంపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. లింక్డ్‌ఇన్ పోస్టులో సహజ వ్యవసాయం గొప్పతనాన్ని ఆయన వివరించారు. సహజ వ్యవసాయం అనేది ఆధునిక పర్యావరణ శాస్త్రాలను సమన్వయం చేసుకుని, ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పంటలను పండించే ఒక విధానం. ఇందులో ఒకే క్షేత్రంలో పంటలు, చెట్లు, పశువులు కలిసి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. బయట నుంచి ఎరువులు, మందుల వంటివి వాడకుండా, ఆ వ్యవసాయ క్షేత్రంలో లభించే పేడ, పచ్చిరొట్ట వంటి వాటివి వినియోగించుకుని, మల్చింగ్ వంటి వాటితో నేల సారాన్ని పెంచడం ఈ విధానంలో ముఖ్య లక్షణం. ఇటీవల, ప్రధాని మోడీని ‘‘దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు-2025’’కు ఆహ్వానించారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాది ఆగస్టులో, తమిళనాడుకు చెందిన కొంత మంది రైతులను నేను కలిశాను. వారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ, పర్యావరణ అనుకూలంగా ఉండే కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెప్పారు. కొయంబత్తూర్‌లో జరిగిన సహజ వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని నేను అంగీకరించి, ఆ సదస్సులో పాల్గొంటానని హామీ ఇచ్చాను. నవంబర్ 19న ఈ సదస్సులో పాల్గొన్నాను. సాధారణంగా MSME రంగానికి ప్రసిద్ధి చెందిన కోయంబత్తూర్ నగరం, సహజ వ్యవసాయంపై సదస్సు నిర్వహించడం విశేషం’’ అని చెప్పారు. కోయంబత్తూర్ సదస్సు తనకు ఎప్పటికీ గుర్తుంటుందని ప్రధాని చెప్పారు. భారత రైతులు, వ్యవసాయం పట్ల మక్కువ, ఉత్సాహం ఉన్న వారు వ్యవసాయాన్ని ఎలా కొత్త దృక్పథంతో నడిపిస్తున్నారనే దానికి ఇది గొప్ప ఉదాహరణ అని తన పోస్టులో ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాలా రాష్ట్రాల రైతులతో మాట్లాడినట్లు మోడీ గుర్తు చేసుకున్నారు.
కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు.. బ్యాటింగ్లో దుమ్మురేపిన రుత్రాజ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో కింగ్ అద్భుత ఫామ్ పరంపర కొనసాగుతుంది. తొలి వన్డేలో శతకంతో చెలరేగిన కోహ్లీ.. రెండో వన్డేలో కేవలం 90 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా తన వన్డే కెరీర్లో 53వ శతకాన్ని విరాట్ నమోదు చేసుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (14), యశస్వి జైస్వాల్ ( 22) వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు, సఫారీతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడాడు. తొలి మ్యాచ్ (8 పరుగులు)లో నిరాశపర్చినా ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీతో అదరగొట్టేశాడు. ప్రొటీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. కేవలం 77 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి శతకం బాదేశాడు. కాగా, వన్డేల్లో రుతురాజ్ కి వన్డేల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్!
సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఇతర దర్శకులకు ఇన్‌స్పిరేషన్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో కీలక పాత్రలో నటుడు వెంకటేష్ భాగమవుతున్నారు. వెంకటేష్ సెట్స్‌పైకి రాగానే, చిరంజీవి-వెంకటేష్‌ల కాంబినేషన్ చూపిస్తూ మేకర్స్ వెంటనే ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిరు, వెంకీలపై ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెలలోనే ఆ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే, అంతకుముందే ఆ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషనే.
అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో, తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో, “ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని” హాలీవుడ్ VFX నిపుణులు సైతం ఈ సినిమాను ప్రశంసించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా ₹1000 కోట్లకు చేరుతోందని అంచనా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ ఒక సూపర్‌హీరోగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉన్నా, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. బన్నీకి హ్యాట్రిక్ హిట్స్ (జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో) ఇచ్చిన త్రివిక్రమ్‌ను కూడా బన్నీ పక్కన పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బన్నీ ప్లేస్‌లో త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ, ఆ తర్వాత ఏ దర్శకుడితో పనిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ లిస్ట్‌లో ప్రస్తుతం తెలుగు దర్శకులు ఎవరూ లేరని తెలుస్తోంది. ఆయన ఇతర భాషల దర్శకుల కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
