కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఎనిమిదేళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..
సాధారణంగా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తుంటారు.. కలెక్టర్ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే.. కొన్ని టైం తీసుకునే సమస్యలు కూడా ఉంటాయి.. అయితే, ఈ రోజు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యారు.. స్కూల్ బ్యాగ్ వేసుకునని.. చేతిలో ఓ ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్‌లో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌కు వచ్చాడు.. అయితే, ఆ బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు.. ఆ బుడతడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు అనే రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి.. అయితే, ఆ బాలుడు వచ్చింది.. తన సమస్యపై కాదు.. తన తల్లి సమస్యపై.. రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం వచ్చింది.. ఇది ఆ బాలుడిని ఎంతో కలచివేసింది.. దీంతో, ఏకంగా కలెక్టర్ దృష్టికి ఆ సమస్యను తీసుకొచ్చాడు.. విషయం ఏంటంటే..? గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీచ్) వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహించింది.. అయితే, అధికారులు.. ఆ టిఫిన్ బండిని మూయించారు.. దీంతో మనస్థాపానికి గురైంది ఆ తల్లి.. పొట్ట నింపే టిఫిన్ బండి మూతపడడంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.. అయితే, తల్లి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ బాలుడు.. తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ కలిసేందుకు వచ్చాడు.. నాలుగో క్లాస్ చదువుతోన్న బాలుడు యశ్వంత్… ఇక, యశ్వంత్ సమస్యను విన్న కలెక్టర్ నాగలక్ష్మి.. వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.. కలెక్టర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.. తల్లి ఆవేదన చూసి.. కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఆ బాలుడి ధైర్యాన్ని చూసి.. అంతా ఔరా! అంటున్నారు..
ఆ సంస్థకు షాక్.. జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నంద్యాల జిల్లాలో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేసింది.. 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన ప్రాజెక్టు కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. అయితే, డీపీఆర్ పూర్తిలో అసాధారణ జాప్యం, పేవలమైన పురోగతి కనపరచినందున ఈ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. తదుపరి చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ & ఎండీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP)కు ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..
రేపు కొవ్వూరు పర్యటనకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనలో.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో.. శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. కాపవరం హైవే పక్కన హెలీప్యాడ్ సిద్ధం చేశారు.. కాపవరం నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లి చేరుకుని అక్కడ దళితవాడలో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ఈ పర్యటనలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత కాపవరంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. అనంతరం బయలుదేరి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు పోలీసు అధికారులు..
16 ఎకరాలు అమ్మి ఎన్నికలకు పోయినా.. 70 కోట్లు ఖర్చుపెట్టిన..!
వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. సంఘంలో డబ్బుల అవకతవకలపై విచారణ జరిపి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ట్రస్టు ద్వారా పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కమిటీ ద్వారా చర్చించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యాపారులను ఇబ్బంది పెట్టలేదని, కన్యకా పరమేశ్వరి మీద ఒట్టు వేసి చెబుతున్నానని స్పష్టం చేశారు. నాకు ఇంకా 500 ఎకరాల భూమి ఉంది. ఇటీవలే 16 ఎకరాలు అమ్మాను. ఎన్నికలకు పోయినా.. 70 కోట్లు ఖర్చు చేశాను. డబ్బు శాశ్వతం కాదు.. మన తర్వాత తరాలు మన గురించి మంచి చెప్పుకునేలా బ్రతకాలి అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
“ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)
పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులు సోమవారం సమాచారం ఇచ్చారు. వారి సమాచారం ప్రకారం.. మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి జైష్-ఎ-మొహమ్మద్ (JEM) కు చెందిన నలుగురు ఉగ్రవాదుల బృందంతో భారత సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నాడు.
“అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..
కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. “ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు. బాధితురాలిపై దాడికి ఒడిగట్టడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ప్రధాన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు మేము కనుగొన్నాం” అని ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ అధికారి వెల్లడించారు.
అలా ఇంగ్లండ్‌కు రావొద్దు.. కుల్దీప్ యాదవ్‌కు పీటర్సన్ సూచనలు!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్స్ తీయలేకపోయాడు. సిరాజ్, ప్రసిద్, జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండవ టెస్ట్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి.
అందుకే లక్కీ భాస్కర్ ఆయనతో చేశా
వెంకీ అట్లూరి చివరిగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాలు పూర్తి చేసిన ఆయన, తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన కెరీర్ మరియు సినీ జర్నీ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అయితే, వెంకీ అట్లూరి విషయంలో ‘సార్’ సినిమా చేసినప్పుడు లేదా ‘లక్కీ భాస్కర్’ సినిమా చేసినప్పుడు, “తెలుగు హీరోలు ఎవరూ దొరకలేదా? తమిళ హీరోలను తీసుకొచ్చి సినిమాలు చేశారు” అంటూ కామెంట్స్ వినిపించాయి.
దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!
తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్‌గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీలోనే ఉండాలని నిర్ణయించుకొని దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.
వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..
పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.
