‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’.. కొత్త సినిమా విడుదలైంది అంటూ శ్యామల సెటైర్లు..
ఆంధ్రప్రదేశ్‌లో ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’ అనే కొత్త సినిమా విడుదలైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సెటైర్లు వేశారు.. ఎన్నికల ముందు బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే చాలా అర్థాలు ఉంటాయి.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.. మద్యం మాఫియాతో అనాగరిక పాలన సాగుతోంది.. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు అనేకం పుట్టుకొస్తున్నాయి.. రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది.. మద్యం అసలుదా.. నకిలీదా కూడా అర్ధం కావటం లేదు.. ఆర్గనైజ్డ్ గా ప్రజలను మోసం చేస్తున్నారు.. మద్యాన్ని కట్టడి చేసి ఉంటే కర్నూలు బస్సు ఘటన జరిగి ఉండేది కాదు.. అర్ధరాత్రి మద్యం దొరక్కపోతే అసలు ఘటన జరిగేది కాదు కదా.. అని వ్యాఖ్యానించారు..
మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. రైల్వేశాఖ హైఅలర్ట్.. భారీగా రైళ్ల రద్దు..
మెంథా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. దీంతో, ప్రభుత్వం వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది.. మరోవైపు.. తుఫాన్ ప్రభావంతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఓవైపు తూర్పు కోస్టల్ రైల్వే.. మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రమత్తమై పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. మెంథా తుఫాన్ కదలికలపై నిరంతర పర్యవేక్షిస్తోన్న రైల్వేశాఖ.. తూర్పు కోస్టల్ రైల్వే జోన్ పరిధిలో హై అలెర్ట్ ప్రకటించింది.. విశాఖ మీదగా ప్రయాణించే 43 రైళ్లను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.. 27, 28, 29 తేదీలలో పలు రైళ్లు రద్దు చేసింది.. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు మరియు సిగ్నలింగ్ వ్యవస్థపై నిరంతర నిఘా పెట్టాలని.. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేయాలని.. ట్రాక్‌ల, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని.. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకోమోటివ్ లు రెడీ చేసుకోవాలని ఆదేశించింది.. మరోవైపు.. మొంథా తుఫాను దృష్ట్యా అప్రమత్తమైంది సౌత్ సెంట్రల్ రైల్వే.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం… రాష్ట్రంలో పర్యటిస్తోన్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. విజయవాడ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు.. తుఫాన్ దృష్ట్యా ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. అయితే, డివిజన్ లో తీసుకున్న చర్యలను జీఎంకు వివరించారు విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా.. తగు చర్యలు తీసుకోవాలని ఆపరేషన్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ అధికారులకు జీఎం ఆదేశాలు జారీ చేశారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. నిరంతరం అధికారులు అందుబాటులో ఉండి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని.. రైలు వంతెనల స్ధితి , నీటి ప్రవాహాలను ఎప్పటి కప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.. ట్రాక్ లు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ టీంలు పర్యవేక్షణ చేయాలని.. అత్యవసర పరిస్దితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వం సిద్దం చేయాలని.. డీజిల్ లోకో మోటివ్ లు, మొబైల్ రెస్క్యూ టీంలు నిరంతరం అందుబాటులో ఉంచాలని.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎప్పటి కప్పుడు రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ..
ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.. కేడర్ సహాయక చర్యల్లో పాల్గొనాలి..
తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడండి. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని.. ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలి.. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు లోకేష్.. తుఫాన్ ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి.. శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలి.. భారీవర్షాల కారణంగా ఎటువంటి అంటురోగాలు ప్రభల కుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు మంత్రి లోకేష్.. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్ లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి.. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలి.. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.. పంటపొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మొంథా తుఫాన్ పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ బాధితులకు ఎటువంటి సాయం అవసరమైన వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24×7 సిద్ధంగా ఉంటుందని తెలిపారు మంత్రి నారా లోకేష్..
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కీలక ఆదేశాలు జారీ చే శారు.. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్‌లను నియమించాలి.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలి.. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి.. తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి.. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి.. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు..
3 వేల కోట్లలలో ఢిల్లీకి వాటా.. ప్రభుత్వంపై మాజీమంత్రి ఫైర్..!
తెలంగాణ భవన్‌లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ ఎవరు పంపారో, ఆ వెనుక ఉన్నది ఎవరో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదని ప్రశ్నించారు. దీనితో ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇక గత బీఆర్‌ఎస్ పాలనను గుర్తు చేస్తూ… కేసీఆర్ చెప్పకపోయినా ఎన్నో పనులు చేశారని.. కానీ, ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు గొప్పలు చెప్పి, ఇప్పుడు చేతల్లో చూపించడం లేదని వ్యాఖ్యానించారు.
ఆటోలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారు..దిగి ఆటోలో ప్రయాణించారు. ఆటోలోనే.. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్… వెంగళ్ రావు నగర్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆటోలో ప్రయాణించి.. వారి సమస్యలు విన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు దిగారు. సోమవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్తున్నపుడు ఆయన ప్రయాణిస్తున్న కారు దిగి ఆటో ఎక్కారు. ఆటోలోనే తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. తెలంగాణలోని ఆరు లక్షలకుపైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
పగలు టెక్ జాబ్.. రాత్రిపూట క్యాబ్ డ్రైవర్ గా.. బెంగళూరు ఇంజనీర్లు ఇలా చేయడానికి కారణం ఏంటంటే?
ప్రస్తుత రోజుల్లో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొందరు ఈ ఖర్చులను అధిగమించేందుకు పార్ట్ టైమ్ జాబ్ చూస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. డెలివరీ పార్ట్ నర్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా బెంగళూరులో చాలా మంది లక్షల ప్యాకేజీలతో ఐటీ జాబ్స్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం క్యాబ్ డ్రైవర్స్ గా చేస్తున్నారు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే? ఒంటరితనం నుంచి బయటపడడానికి, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి అంటున్నారు. 27 ఏళ్ల అభినవ్ రవీంద్రన్ రెండేళ్ల క్రితం విజయవాడ నుండి బెంగళూరుకు మకాం మార్చాడు. అతను సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎక్స్ పర్ట్. మొదట్లో బాగానే సాగింది. కానీ సుద్దగుంటెపాల్య ప్రాంతంలో ఒంటరిగా నివసించడం వల్ల అతనికి ఇంటి మీద బెంగ, ఒంటరితనం కలిగింది. పని ఒత్తిడి క్రమంగా పెరిగింది. 18 నెలల తర్వాత, అతను కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని నిర్ణయించుకుని క్యాబ్ నడపడం ప్రారంభించాడు.
బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు.. ఇది కండకావరమే!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను అందజేశారు. ఈ మ్యాప్‌లో భారతదేశంలోని అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ జనరల్‌తో తన సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మొహమ్మద్ యూనస్ ఢాకా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను కలిశారు. ఈ సమయంలో యూనస్ పాక్ జనరల్‌కు “ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్” అనే పుస్తకాన్ని బహుకరించారు. దీని ముఖచిత్రంలో బంగ్లాదేశ్ వక్రీకరించిన మ్యాప్ ఉంది. ఈ మ్యాప్‌లో భారతదేశం ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంగా చిత్రీకరించి ఉన్నాయి. దీంతో కొత్త వివాదం తలెత్తింది. ఎందుకంటే ఈ చర్యలు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఓకు రానున్న కళ్లద్దాల కంపెనీ.. ఎన్ని వేల కోట్ల టార్గెట్ అంటే?
ప్రముఖ కళ్లజోడు సంస్థ లెన్స్‌కార్ట్ కంపెనీ తాజాగా వార్తల్లో నిలిచింది. లెన్స్‌కార్ట్ కంపెనీ తర్వలో IPO కు రాబోతుంది. లెన్స్‌కార్ట్ IPO అక్టోబర్ 31, 2025న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. పియూష్ బన్సాల్ యాజమాన్యంలోని లెన్స్‌కార్ట్ కంపెనీకి రాధాకిషన్ దమాని మద్దతు ఉంది. ఈ సంస్థ అక్టోబర్ 31న తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. టాటా క్యాపిటల్, HDB ఫైనాన్షియల్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తర్వాత ఇది 2025లో నాల్గవ అతిపెద్ద IPO అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లెన్స్‌కార్ట్ IPO ద్వారా సంస్థ రూ.7,278 కోట్లు (సుమారు $1.2 బిలియన్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇష్యూ ధర పరిధి ఒక్కో షేరుకు ₹382-₹402 మధ్య నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. లెన్స్‌కార్ట్ IPO అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 మధ్య బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో పెట్టుబడిదారులు IPO కు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మొత్తం ₹7,278 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ₹2,150 కోట్లు తాజా ఇష్యూ ద్వారా సేకరించనున్నారు. అమ్మకానికి ఆఫర్ 127.6 మిలియన్ షేర్లను కలిగి ఉంది. ఇది మొదట అనుకున్న 132 మిలియన్ షేర్ల కంటే 04.7 మిలియన్ షేర్లు తక్కువ. లెన్స్‌కార్ట్ IPO ధరల బ్యాండ్‌ను ఒక్కో షేరుకు ₹382-₹402 మధ్య నిర్ణయించింది. ఇది నేహా బన్సాల్, DMart వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని భార్య మధ్య జరిగిన ప్రీ-IPO లావాదేవీ ఆధారంగా రూపొందించినట్లు సమాచారం. దీనిలో సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ 0.13% వాటాను ₹90 కోట్లకు విక్రయించారు.
చేతికి పని చెప్పకుండా ఇంటిని మెరిపించేయండి.. Mecturing MopX2 రోబోట్ వాక్యూమ్ లాంచ్..!
ఇంటి పనులను సులభతరం చేసేందుకు మెక్చరింగ్ (Mecturing) సంస్థ భారతదేశంలో సరికొత్త MopX2 రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక AI ఫీచర్లతో పాటు.. శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఇది సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. మరి దీని పూర్తి ఫీచర్లను చూసేద్దామా.. అత్యాధునిక AI సాంకేతికతతో పాటు శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఈ MopX2 రోబోట్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో ఉన్న డ్యూయల్ రోటేటింగ్ మాప్స్ నేలపై గట్టిగా రుద్దుతూ 20 న్యూటన్ల స్క్రబ్బింగ్ ఫోర్స్‌ను అందిస్తాయి. దీనితో మొండి మరకలను సులభంగా తొలగిస్తుంది. అలాగే 15,000 Pa వరకు శక్తివంతమైన సక్షన్ పవర్‌తో దుమ్ము, ధూళిని సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. ఆటోమేటిక్ డస్ట్ కలెక్టర్ సిస్టమ్‌తో MopX2 క్లీనింగ్ పూర్తయిన వెంటనే డస్ట్‌బిన్‌ను దానంతట అదే ఖాళీ చేసుకుంటుంది, తద్వారా చేతితో శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదంటే నమ్మండి.
ఐరన్ లెగ్ అన్నారు.. రమ్యకృష్ణ ఎమోషనల్
ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. అలాంటి రమ్యకృష్ణను ఐరన్ లెగ్ అన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ తెలిపింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. భలే మిత్రులు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత ఏడేళ్ల నాకు ఒక్క హిట్ కూడా రాలేదు. ఆ టైమ్ అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటూ పిలిచారు. అది చూసి చాలా బాధగా అనిపించింది. మా ఇంట్లో వాళ్లు కూడా సినిమాలు ఆపేసి చదువుకోమన్నారు. కానీ నేను వినలేదు. ఎందుకో నాకు సినిమాలను వదలబుద్ధి కాలేదు. ఆ టైమ్ లోనే విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సూత్రధారులు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా నా కెరీర్ ను నిలబెట్టింది. అందులో నాకు నటించే స్కోప్ దక్కింది. ఆ మూవీతోనే నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. ఇక అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం రాలేదు అంటూ ఎమోషనల్ అయింది రమ్యకృష్ణ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన బాహుబలి రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే సినిమాగా వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగానే నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రమ్యకృష్ణ జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు వెళ్లింది.
ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా ఫోక్ సెన్సేషన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ తన రెండో సినిమాను తాజాగా ప్రారంభించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (తమిళ డబ్బింగ్) చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో పవీష్ సరసన కథానాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తుండటం విశేషం. తన జానపద పాటల ద్వారా యూట్యూబ్‌లో విశేష ప్రజాదరణ పొందిన నాగదుర్గ, ఈ సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. తెలుగులో ఆమె ఇప్పటికే కలివి వనం అనే సినిమాలో నటించారు కానీ ఆ సినిమా వచ్చినట్టు కూడా పెద్దగా జనానికి తెలియదు. ఇక పవీష్ సినిమాతో మగేష్ రాజేంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన గతంలో తమిళంలో లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన ‘బోగన్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. ‘బోగన్’ వంటి హిట్ చిత్రానికి పనిచేసిన అనుభవంతో, మగేష్ రాజేంద్రన్ ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.
