మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు.. ఆయన భావజాలం శాశ్వతం..
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. కానీ, ఆయన భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.. మన్మోహన్ లేని లోటు ఎవరూ పూడ్చలేరన్న ఆయన.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, యూజీసీ చైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించారు.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారని గుర్తుచేశారు.. ఇక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దశ దిశను రూపొందించారు మన్మోహన్ అని కొనియాడారు చంద్రబాబు నాయుడు.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్టీఐ చట్టం, నరేగా, ఆధార్ లాంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు.. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్.. ఆయన మంచి రాజకీయ నాయకుడన్న చంద్రబాబు.. మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటు.. బాధాకరం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. హాట్ టాపిక్..!
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడైనా తగ్గేదేలే అనే తరహాలో వ్యవహరిస్తుంటారు.. కానీ, ఉన్నట్టుండి ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. తన సహజశైలికి భిన్నంగా క్షమాపణలు కోరారు.. నమ్మశక్యంగా లేదు.. కానీ, ఇది నిజం.. ఆర్టీపీపీ వద్ద గత నెల 27 వ తేదీన ఫ్లై యాష్ వివాదం కొనసాగుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి కారణమైన ఇరువురు నాయకులను హెచ్చరించిన మార్పు రాలేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య మొదల్తెన ఫ్లై యాష్ వివాదంతో గత నెల రోజులుగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.. ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోవడంతో నెల రోజులుగా జేసీ వర్గీయులకు చెందిన ఉన్న లారీలు అక్కడే ఆగిపోయాయి. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు పంపినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న వివాదంలో వాస్తవాలను అధికారులు ఎందుకు పట్టించుకోవలేదన్నారు. ఇక, ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నాని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.. తన వాళ్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. గత ఐదేళ్లు చాలా నష్టపోయానని.. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు.. నియోజకవర్గ ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వచ్చిన సమయంలో.. ఒకటి సరెండర్ కావాలి.. లేదా ఊరు విడిచి వెళ్తారని అనుకున్నారు.. కానీ, అలాంటి సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచడంతో పోరాటం చేశానని తెలిపారు.
ఇచ్చిన హామీ ఏమైంది..? పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం..?
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు.. ఇలా పలు రకాలుగా ఆందోళన నిర్వహించారు.. ఇక, తిరుపతి జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని దుయ్యబట్టారు.. ఇక, విద్యుత్ ఛార్జీలపై పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఏమైంది? అని అంటూ నిలదీశారు.. అసలు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ పోతుంటూ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ అసలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.. ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు ఆర్కే రోజా.. విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తాం.. అంతేకాదు.. ప్రజల దగ్గర నుంచే విద్యుత్ కొనుగోలు చేస్తామని చంద్రబాబు మాట్లాడారు.. కానీ, నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిన భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విద్యుత్ ఛార్జీలు పెంచం.. పెంచితే ఒప్పుకోమన్న పవన్ కల్యాణ్.. ఈ రోజు ఎందుకు ఆపలేకపోతున్నారు.. ఎందుకు సీఎంను నిలదీయలేకపోతున్నారని మండిపడ్డారు రోజా..
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్.. నిన్న ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటించింది. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలందించారు.. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా పేరుగాంచారు.. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఛైర్మన్ వంటి బాధ్యతలు నిర్వర్తించారు.
మన్మోహన్ సింగ్ అంతిమయాత్రపై కాంగ్రెస్ కీలక ప్రకటన
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉంటే మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. మన్మోహన్ అంత్యక్రియలు శనివారం ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఉదయం 9:30కి ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్‌ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని అభివర్ణించారు. నిజాయితీ, సరళత, పార్లమెంటేరియన్‌గా విశిష్టమైన సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. మన్మోహన్‌కు నివాళులర్పించేందుకు కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మన్మోహన్ గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. ఈ సంతాప దినాలు జనవరి 1, 2025 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భారతదేశం అంతటా జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు. విదేశాలలో ఉన్న అన్ని భారతీయ మిషన్లు మరియు హైకమిషన్లలో అదే వ్యవధిలో జెండా సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు.
బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని సూసైడ్
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నివాసి అయిన మృతుడు విధుల్లో ఉన్నప్పుడు తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఇండో-పాకిస్థాన్ సరిహద్దులో డ్యూటీ నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. షాఘర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బాబు రామ్ మాట్లాడుతూ.. సిబ్బంది అంతా విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడన్నారు. తుపాకీ శబ్దం విని సంఘటనా స్థలానికి వచ్చిన సహచరులు అతను స్పందించకపోవడాన్ని గుర్తించారని చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవల్సిన ఇబ్బంది ఏమొచ్చిందని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
యాసిన్ మాలిక్‌తో ఫోటో.. మన్మోహన్ సింగ్ జీవితంలో ఓ మచ్చ..
భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్‌ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా పనిచేసిన సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినప్పటికీ ఏనాడు కుంగిపోలేదు. మౌనముని అని, కీలుబొమ్మ అని రాజకీయ పార్టీలు విమర్శించినప్పటికీ, ప్రజలు మాత్రం తమ మనిషిగానే భావించారు. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ అంటే మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, ఒక్క విషయంలో మాత్రం మన్మోహన్ సింగ్‌పై మాయని మచ్చగా మారింది. ఉగ్రవాది, జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ని పీఎం కార్యాలయంలో కలవడం, యువనేత అని మన్మోహన్ సింగ్ ప్రశంసించడం దేశంలో చాలా మందికి నచ్చలేదు. కాశ్మీర్‌లో హిందువుల ఊచకోతతో పాటు భారత జవాన్లను హతమార్చిన నేరాల్లో ప్రమేయం ఉన్న యాసిన్ మాలిక్‌ని కలవడం వివాదాస్పదంగా మారింది. యాసిన్ మాలిక్, ఏనాడు భారతదేశానికి విధేయత చూపించలేదు. పాకిస్తాన్‌కి గట్టి మద్దతుదారు.
విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..
విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని తీసుకువచ్చింది. ఇప్పుడు విమానాల్లో హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితుల్ని విధించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో ప్రయాణికులు విమానంలో ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను నిర్వహించడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని పంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ని తగ్గించడం ద్వారా కొత్త నిబంధనలు ప్రయాణికుల ప్రయాణాన్ని, ఎయిర్‌పోర్టు ఆపరేషనల్స్‌ని సులభతరం చేయనున్నాయి. BCAS,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ప్యాసింజర్స్ ఫ్లోని సులభతరం చేయడానికి కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించాయి.
దీప్తి శర్మ ఆల్‌రౌండర్ షో.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. దాంతో ఆమెను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మలు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి, జట్టు మొత్తాన్ని 162 పరుగులకే పరిమితం చేశారు. మొదటి బంతికే వెస్టిండీస్‌కు రేణుకా షాక్ ఇచ్చింది. 9 పరుగుల వద్ద మూడో వికెట్ పడగొట్టిన రేణుకా ఆ తర్వాత కరీబియన్ జట్టును కంట్రోల్ చేయడం కొనసాగించింది. ఆ తర్వాత దీప్తి శర్మ మిగిలిన వికెట్లను వరుసబెట్టి 10 ఓవర్లలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది.
బాలయ్య క్యారవాన్ దరిదాపుల్లో కూడా నేను ఉండను
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక టైటిల్ సాంగ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు తమన్. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంన్నాడు దర్శకుడు బాబీ. అందులో భాగంగా బాలయ్యపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. బాలయ్యతో వర్క్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ బాలయ్య అంటే ఏంటో తెలిసింది. ఆయన చాల ఎమోషనల్, సెన్సాఫ్ హ్యూమర్ తెలిసింది. అసలు డైరెక్టర్ అనే వాడికి ఎంత గౌరవం ఇస్తారు అంటే మాటల్లో చెప్పలేను. ఆయనకి ఎంత స్ట్రెస్ ఉన్న, యాక్షన్స్ లో ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా కుడా డైరెక్టర్ వస్తే రెడీ గురువుగారు షూట్ చేసేద్దాం అంటారు. అయన షూట్ లో ఉంటే నా అసిస్టెంట్స్ బాలయ్య ఎక్కడ ఉన్నారో అడుగుతాను. ఎందుకంటే అయన ఖాళీ టైమ్ లో స్మోక్ చేస్తూ, బుక్స్ చదువుతూ ఉంటారు. ఒకవేళ ఆ టైమ్ లో డైరెక్టర్ అటు వెళ్తే వెంటనే అన్ని పక్కన పెట్టేస్తారు. ఆయన టీమ్ ను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక నా క్యారవాన్ ను బాలయ్య కు దూరంగా పెట్టమని చెప్తాను’ అని అన్నారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై చిరంజీవి సంతాపం
భారత మాజీ ప్రధాని,కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఈ గురువారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, మృదుస్వభావి మరియు వినయపూర్వకమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. ఆర్థిక మంత్రిగా ఆయన విజన్ దేశ ఆర్థికస్థితిని మార్చివేసింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా అత్యంత విజయవంతమైన పదవీకాలం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన లాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంటు సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నుండి ఎంతో ప్రేరణ పొందాను అలాగే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన మృతి మన దేశానికి తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు మరియు ఆయన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.ఓం శాంతి
డాకు మహారాజ్ రన్ టైమ్ ఎన్ని గంటలో తెలుసా..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక చిన్ని అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ ఎమోషనల్ టచ్‌తో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అసలు బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ బాక్సులు బద్దలు చేయడం గ్యారెంటీ అని నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అయితే తమన్ బాదుడుకి థియేటర్లలో బాక్సులు ఎన్నిగంటలు మోత మోగుతాయనే విషయంలో ఇప్పుడో క్లారిటీ వచ్చింది. లేటెస్ట్‌గా డాకు మహారాజ్ రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ వచ్చేసి 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేసినట్లుగా సమాచారం. మొత్తంగా టైటిల్ క్రెడిట్స్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు కలుపుకుని 2 గంటల 32 నిమిషాల రన్ టైంతో డాకు మహారాజ్ రిలీజ్ కానుందని సమాచారం. అంటే.. దాదాపు రెండున్నర గంటలు బాలయ్య మాస్ జాతరకు, తమన్ తాండవానికి థియేటర్ టాపులు లేచిపోవడం గ్యారెంటీ అనే చెప్పాలి. త్వరలోనే ఈ రన్ టైం పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.