ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. సాస్కి 2024-25 తొలి విడత నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. “సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)”ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన “సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)”ద్వారా తొలి విడతగా 113.751 కోట్లు (66 శాతం) విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.. తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడత నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు. ఇక, సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్) సమర్పించామని పేర్కొన్నారు.. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి కందుల.. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు నిజం చేస్తూ త్వరితగతిన నిధుల విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు..
బూడిద వివాదంలో ఆది వర్సెస్ జేసీ.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
బూడిద లోడింగ్, తరలింపు వ్యవహారం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది.. బూడిద లోడింగ్ చేసే వరకు మా వాహనాలు కదిలే ప్రసక్తే లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తేల్చిచెప్పారు.. ఇక, జేసీ, దేవగుడి కుటుంబాల మధ్య బూడిద వివాదం ముదరడంతో ఎల్ అండ్ టీ కంపెనీతో పాటు అనేక సిమెంట్ కంపెనీలకు బూడిద సరఫరా నిలిచిపోయింది.. తమ లారీలకు ఫ్లైయాష్ లోడింగ్ చేయకపోతే తామే జేసీబీలతో లోడింగ్ చేసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పట్టు పట్టడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. తమకు రావాల్సిన పాత బకాయిలతో పాటు ఎల్ అండ్ టీ కంపెనీ ట్రాన్స్‌పోర్ట్‌లో 50 శాతం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఫ్లైయాష్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారింది. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది కడప జిల్లా ఆర్టీపీసీ ఫ్లైయాస్ వివాదం.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై ఆరా తీస్తున్నారు.. ఘటనపై సీఎంవో అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని మండిపడ్డారు.. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర ప్రమాదం.. సీఎం, హోం మంత్రి ఆరా.. జగన్ దిగ్భ్రాంతి
అనకపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో నిన్న అర్థరాత్రి విషవాయులు లీకయ్యాయి.. కంపెనీలో పనిచేస్తున్న 9 మంది కార్మికులు అస్వస్థకు గురైయ్యారు.. ప్రమాదం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు కంపెనీ యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా షీలనగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పటల్ కి క్షతగాత్రులను తరలించింది యాజమాన్యం.. వీరిలో ఇద్దరు పరిస్థితి విసమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నరు ఠాగూర్ కంపెనీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.. మరోవైపు. విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు.. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్యవైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి, విష వాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు..జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నరు హోంమంత్రి అనిత.. ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు అనంతరం కఠిన చర్యలుంటాయన్నారు హోంమంత్రి..
సీఎంపై బీజేపీ నిర్ణయమే ఫైనల్.. బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే మీ మనసులో ఎలాంటి సందేహం రాకుడదని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం ఆమోదయోగ్యమేనని ప్రధానికి చెప్పాను మీరు మా కుటుంబానికి అధిపతి, మీ నిర్ణయాన్ని మేము కూడా అంగీకరిస్తాము. ప్రభుత్వ ఏర్పాటులో ఏ సమస్య లేదు’’ అని షిండే చెప్పారు. ‘‘నేను ఎల్లప్పుడు కార్యకర్తగానే పనిచేశాను, నేను ఎప్పుడూ సీఎం అవుతానని భావించలేదు. సీఎం అంటే కామన్ మ్యాన్. నేను దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేశాను. మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల బాధల్ని చూశాను.’’ అని షిండే అన్నారు. మహాయుతి కూటమి గెలుపుకోసం కార్యకర్తల పనిచేశానని అన్నారు. అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన థాంక్స్ చెప్పారు. ప్రజలు మహావికాస్ అఘాడీని తిరస్కరించారని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆలస్యం..
కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. అవసరమైన పరీక్షలు పూర్తి చేసి రాష్ట్ర సర్కారు వివరాలు అందించకపోవడం వల్లే కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యం అవుతోందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు. “కాళేశ్వరం కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాను. నా దగ్గర ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశాను. NDSA రిపోర్ట్ అంశాన్ని కమిషన్ చీఫ్ నాతో మాట్లాడారు. ప్రాజెక్టులో గుంతలను స్టేట్ ఇంజనీర్లు పూడ్చడంతో జియోటెక్నికల్, జియోగిజికల్ డేటా కోల్పోయాం. జియోఫీజికల్ టెస్టుల కోసం NDSA రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలను అడిగితే అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. NDSA అడిగిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే NDSA నివేదిక ఆలస్యం అవుతుంది.” అని కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు.
మాగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది. మాగనూరు ఘటనలో పిల్లలు కుర్‌కురేలు తిని అస్వస్థతకు గురయ్యారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మాగనూరు , కరీంనగర్ బురుగు పల్లి ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ ఫాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్ సేకరించి ల్యాబ్‌కి పంపాలని న్యాయ స్థానం ఆదేశించింది. సోమవారం లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాక ముందే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఎమ్మెల్యే పదవికి కైలాష్ గహ్లోత్ రాజీనామా.. ఇటీవలే బీజేపీలో చేరిన ఆప్ నేత
ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఇటీవలే కైలాష్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అతిషి కేబినెట్‌లో కైలాష్ గహ్లోత్ మంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా ఉన్నట్టుండి మంత్రి పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే హఠాత్తుగా ఆప్‌ను వీడడంపై విమర్శలు రావడంతో.. తన నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన విలువలకు, నైతికతకు దూరమైందని ఆరోపించారు. నవంబర్ 17న మంత్రి పదవికి రాజీనామా చేశానని.. అదే రోజు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతకు దూరమైందని గుర్తుచేశారు. బుధవారం తన శాసనసభా సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు రిజైన్ లెటర్‌లో కైలాస్ గహ్లాత్ పేర్కొన్నారు.
బుకింగ్స్ ప్రారంభం.. డిసెంబర్ 4న అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
2024 డిసెంబర్ 4న అమేజ్ 2024ని హోండా విడుదల చేయనుంది. అయితే.. ఈ కారు లాంచ్ కాకముందే.. బుకింగ్ అనధికారికంగా ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ కార్ బుకింగ్‌లను కొంతమంది డీలర్లు తీసుకుంటున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ కారుకు సంబంధించి ఫీచర్లు, ధర, డిజైన్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. హోండా అమేజ్ 2024లో డబుల్ బీమ్ ఎల్ఈడీ లైట్లతో ముందుకొస్తుంది. అంతేకాకుండా.. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్ కూడా మారాయి. ఈ వాహనం యొక్క సైడ్ వ్యూ మిర్రర్ డిజైన్ కూడా చాలా షార్ప్‌గా డిజైన్ చేశారు. అంతేకాకుండా.. కొత్త డ్యాష్‌బోర్డ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఈ కారులో డిజిటల్ ఏసీ ప్యానెల్ అందిస్తున్నారు. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్‌తో సహా అనేక ఇతర ఫీచర్‌లను నియంత్రించడానికి స్టీరింగ్‌లో స్విచ్‌లు ఉంటాయి. లోపలి భాగంలో నలుపు, లేత గోధుమరంగు రంగులను ఉపయోగించారు. ఈ కారు మాన్యువల్‌తో పాటు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. విశేషమేమిటంటే.. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి వస్తోంది.
గద్దర్ నటించిన చివరి చిత్రం ఈనెల 29న రిలీజ్ ఫిక్స్
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ “ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పిరింగ్ గా ఉంది. గద్దర్ గారు కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయం. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. అయన స్వయంగా నటించిన సినిమా ఇది. అయన స్ఫూర్తి ని ఈ సినిమా లో నింపారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, అందరూ సినిమాని ఆదరిస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమా లో నటించిన అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డి గారికి కూడా నా అభినందనలు.” అని తెలిపారు.
దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద క్రెడిట్ అయినా సరే అని అన్నాడు. అదే స్టేజ్ పై మైత్రీ నిర్మాత రవినుద్దేశిస్తూ తనను లేట్ అని అనవద్దని, వర్క్ లేట్, మ్యూజిక్ లేట్ ఇలా ప్రతిదీ లేట్ అని అనొద్దు అని అన్నాడు. ఈ స్పీచ్ ఒకింత దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలంగా మారాయి. దేవి శ్రీ ప్రసాద్ అలా అడగడం కరెక్ట్ కాదని మైత్రీ నిర్మాతల ఆగ్రహానికి దేవి గురయ్యాడు ఇక ఆ బ్యానర్ సినిమాలు ఏవి దేవికి రావు అని పుకార్లు వినిపించాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ తో నిర్మించిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిని ఈ వివాదం పై ప్రశ్నించగా ‘ దేవి మాటల్లో తప్పేముంది, నిర్మాతలకు నా మీద లవ్వు ఉంటుంది. అలాగే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కాకుంటే ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువ చెబుతున్నారు అనే కదా అన్నాడు, అందులో మాకు తప్పేమీ కనిపించలేదు, మేము దేవి తో రాబోయే రోజుల్లో సినిమాలు చేస్తాం అని చెప్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు.