బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం జైలుకే..!
ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్ర పరిస్థితి, లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన.. వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.. అయినా, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ఇక, వైఎస్ జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినడం తప్పదని వ్యాఖ్యానించారు ఆదినారాయణరెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి రాక మానదని జోస్యం చెప్పారు.. లిక్కర్ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జైలు కెళ్లడం ఖాయం.. జైలుకెళ్లడం తప్పదని తెలిసే జగన్ నిత్యం మీడియా ద్వారా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కాగా, లిక్కర్ స్కాం కేసుపై తాజాగా స్పందించిన వైఎస్ జగన్.. లిక్కర్ స్కాం అంటూ బేతాళ కథలు చెబుతూ.. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలకు దిగారని మండిపడ్డిన విషయం విదితమే.. విద్యుత్ దగ్గరి నుంచి ఇసుక దాకా ప్రతీ దాంట్లోనూ స్కాం జరుగుతోందని, ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్..
వైసీపీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికల్లో ఆరు సీట్లు కూడా రావని వాళ్ల భయం..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నైజమని దుయ్యబట్టారు.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మండిపడ్డారు. ఇరిగేషన్ వ్యవస్థ ను బ్రష్టు పట్టించిన చరిత్ర వైసీపీదే అన్నారు.. త్వరలో గోదావరి జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థను ఆధునికరిస్తామని వెల్లడించారు.. రేడార్ తో సర్వే చేసి డీపీఆర్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నాం.. కూటమి ప్రభుత్వం రైతుల పక్ష పాత ప్రభుత్వం ధాన్యం కొని 48 గంటల్లో రైతులు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం అన్నారు.. నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో డ్రైన్ తవ్వక పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వెల్లడిస్తూ.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు..
ప్రాణాలు తీస్తున్న పిడుగులు.. ఏపీలో ఐదేళ్లలో 570 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో పిడుగుపాటు వలన 570 మంది మృతిచెందినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.. ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 570 మంది పిడుగుపాటుతో మృతిచెందగా.. అత్యధికంగా విజయనగరంలో 56 మంది.. శ్రీకాకుళంలో 45, పల్నాడులో 44, నెల్లూరులో 41 మంది చొప్పున పిడుగుపాటు వలన ప్రాణాలు కోల్పోయారు.. ఇక, అత్యల్పంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.. ఇక, 2018లో 137 మంది, 2019లో 80 మంది, 2019లో 75 మంది, 2020లో 80 మంది, 2021లో 52 మంది, 2022 మరియు 2023లో 52 మంది చొప్పున, 2024లో 41 మంది, 2025లో ఇప్పటి వరకు 41 మంది వివిధ జిల్లాల్లో పిడుగు పాటుకు మృత్యువాతపడ్డారు.. పిడుగు పాటుతో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది రైతులు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలే ఉన్నారని వివరాలు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ..
కాళేశ్వరంలో బాంబులు పెట్టారన్న కేటీఆర్.. సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి డిమాండ్!
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ఏంటని సొంత కూతురు కవితనే కేసీఆర్ ను అడుగుతున్నారన్నారు. అధికారంలో ఉన్న వారు ప్రాజెక్ట్ లు నిర్మించడంలో విఫలం అయితే ఆ చెడ్డపేరు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని.. ప్రాజెక్ట్ లు కూలగొట్టదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిగరెట్ కంటే బెట్టింగ్స్ యాప్స్ డేంజర్.. కే.ఏ పాల్ ఆవేదన
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. సిగరెట్ తాగితే హానికరం అని ఉంటుందని.. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ బెట్టింగ్ యాప్స్ డేంజర్ అని కే.ఏ పాల్ అన్నారు. 1100లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారని.. బెట్టింగ్ యాప్స్‌ను కోట్ల రూపాయలు తీసుకుని ప్రమోషన్ చేస్తున్నట్లు కే.ఏ పాల్ తెలిపారు. వీటి వల్ల విష్యత్తులో ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. మానిలాండరింగ్ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని కోరారు. ఈ యాప్స్ ప్రమేట్ చేసిన వారిపై తెలంగాణలో కేసులు పెట్టారని.. కానీ ఏం చర్యలు తీసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు రేపు జరగబోయే శాంతి సదస్సు గురించి కే.ఏ పాల్ మాట్లాడారు. జింఖానా గ్రౌండ్ లో రేపు సాయంత్రం శాంతి సదస్సు ఉందని.. రేపు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
“ప్రసూతి సెలవులు” మహిళల హక్కుల్లో అంతర్భాగం: సుప్రీంకోర్టు..
ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తన రెండో వివాహం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసూతి సెలవు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ని విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఆమెకు మొదటి వివాహం నుంచి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారనే కారణంతో ఆమెకు సెలవు నిరాకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే మెటర్నిటీ బెన్‌ఫిట్స్ ఉండాలనే నియమం ఉంది. అయితే, తాను తన మొదటి ఇద్దరు పిల్లల సమయంలో ఉద్యోగం చేయలేదని, ఎలాంటి ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు పొందలేదని మహిళ పేర్కొంది. ఆమె తన రెండో వివాహం తర్వాతే ఉద్యోగం ప్రారంభించానని, ఇప్పుడు మూడోవ బిడ్డకు ప్రయోజనాలను పొందాలనుకుంటున్నానని ఆమె కోర్టుకు చెప్పింది. తమిళనాడులో గతంలో ప్రసూతి ప్రయోజనాల నిబంధనలు ఆమెకు లభించకపోవడంతో ఆమెకు ప్రసూతి సెలవులు మంజూరు చేయకూడదనే రాష్ట్రం నిర్ణయం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది కె.వి. ముత్తుకుమార్ అన్నారు. ఆమె పిటిషన్‌కి సుప్రీంకోర్టు మద్దతు లభించింది. ప్రసూతి సెలవులను ఇప్పుడు ప్రాథమిక పునరుత్పత్తి హక్కులలో భాగంగా గుర్తిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
‘‘పాక్’’ ఉందని ‘‘మైసూర్ పాక్’’ పేరు మార్చేశారు.. కొత్త పేరు ఏంటంటే..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల్ని, ముఖ్యంగా హిందువుల్ని మతం ఆధారంగా ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ దాడి తర్వాత దేశంలో ఒక్కసారిగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా భారత్, పాకిస్తాన్ భూభాగాలతో పాటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. 100కి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదిలా ఉంటే, పాక్ పేరంటేనే ఇప్పుడు భారత ప్రజలు సహించడం లేదు. ప్రముఖ స్వీట్ ‘‘మైసూర్ పాక్’’లో పాక్ ఉందని ఏకంగా దాని పేరు మార్చేస్తూ కొత్త పేర్లను పెడుతున్నారు. తాజాగా, జైపూర్‌లోని ఓ స్వీట్ షాప్ మైసూర్ పాక్‌ని ‘‘మైసూర్ శ్రీ’’గా మార్చారు. ‘‘మా స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించాము. ‘మోతీ పాక్’ పేరును ‘మోతీ శ్రీ’గా, ‘గోండ్ పాక్’ పేరును ‘గోండ్ శ్రీ’గా, ‘మైసూర్ పాక్’ పేరును ‘మైసూర్ శ్రీ’గా మార్చాము’’ అని దుకాణం యజమాని చెప్పారు. అయితే, నిజానికి మైసూర్ పాక్‌లో పాక్ అంటే ‘‘తీపి’’ అని కన్నడ భాషలో అర్థం.
ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!
కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్‌లు మే 9 నుండి అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, iMT, DCT మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 6, 7 సీటర్ సెటప్‌లలో వస్తుంది. కారెన్స్ క్లావిస్ 20 అటానమస్ సేఫ్టీ ఫంక్షన్లను కలిగి ఉన్న ADAS లెవల్ 2 తో అమర్చబడి ఉంది. అలాగే స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో పార్కింగ్ సెన్సార్లు, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ లాంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కియా ఇండియా తన కొత్త 2025 కారెన్స్ క్లావిస్ మోడల్‌కు సంబంధించి వేరియంట్ వారీగా ధరలను అధికారికంగా ప్రకటించింది.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!
టెస్ట్ లవర్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మరో సార్ క్రికెటర్ 17 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. అతడెవరో కాదు.. శ్రీలంక అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాథ్యూస్ జూన్ 17న గాలెలో బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ ఆడనున్నాడు. మాథ్యూస్ ఇప్పటికే వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2023 లో న్యూజిలాండ్ తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకోవడంతో.. ఇకపై టి20లో మాత్రమే కొనసాగనున్నాడు. 2009 లో ఆస్ట్రేలియాపై టీ20 డెబ్యూట్ చేసిన మాథ్యూస్ 2024లో నెదర్లాండ్స్ తో తన చివరి టీ20 ఆడాడు. మాథ్యూస్ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ భావిద్వేగానికి గురయ్యాడు. సమయం ఆసన్నమైందని, తన 17 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. మోస్ట్ వైలెన్స్ కూడా మనకు ఫోన్ లో దొరుకుతోంది. అలాంటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం తీసే సినిమాలో ఇది ఉండొద్దు.. అది మాట్లాడొద్దు.. ఇది చూపించొద్దు అంటే ఎలా. ఫోన్ లో చూస్తే తప్పు లేనప్పుడు సినిమాలో బిగ్ స్క్రీన్ పై బూతులు చూస్తే తప్పేంటి. అలా వద్దనడం నిజంగా అర్థం లేని పని. సెన్సార్ బోర్డ్ అనేది ఎప్పుడో ఎక్స్ పైర్ అయిపోయింది. అదొక్ స్టుపిడ్ థింగ్’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్జీవీ. ఆర్జీవీ ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తూనే ఉంటారు. ఎన్నో విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడేయడం ఆయనకు అలవాటే. వివాదాలు రేపే ఇలాంటి కామెంట్లు చేయడం ఆర్జీవీకి ఇదేం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఏకంగా సెన్సార్ బోర్డునే తప్పుబట్టేశారు. మరి ఆయన కామెంట్లపై సెన్సార్ బోర్డు ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
సైలెంటుగా మొదలెట్టేశారు!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజు (మే 23, 2025) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా, చిరంజీవి 157వ చిత్రంగా (మెగా 157) ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి అంటే 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ – గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి, తనదైన హాస్యం, యాక్షన్, ఎమోషన్స్ తో ఈ సినిమాను ఒక బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో చిరంజీవి కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒక పాత్ర కోసం నయనతారను అనౌన్స్ చేయగా కేథరిన్ తెరిసా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
