మున్సిపాలిటీ అనుమతి ఇస్తే చాలు.. ఇక, ఏ పర్మిషన్ అవసరం లేదు..
రాజధాని అభివృద్ధి కోసం 62,000 కోట్ల ప్రాజెక్టు చూపట్టాం.. అందులో రాష్ట్ర కేబినెట్ రూ.45 వేల కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇక, 2014-19లో మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతం అని అభివర్ణించిన ఆయన.. ప్రస్తుతం ఖాజానా ఖాళీగా ఉందని విమర్శించారు.. ప్రస్తుతం కాంట్రాక్టర్‌లు వర్క్స్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు.. అయితే, ఏప్రిల్ మొదటి వారం నుండి అభివృద్ధి నిధులు మున్సిపాలిటీలకే కేటాయిస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో ఉన్న 163 మున్సిపాలిటీలకు రోజుకు 135 లీటర్స్ మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైంత త్వరగా డీపీఆర్, టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది మెప్మా సభ్యులు ఉన్నారు. ఇక, టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ.. ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్న ఆయన.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు, విశాఖ పట్టణంలో 1200 టన్నుల వ్యర్ధాలతో నూతన ప్లాంట్ ఏర్పాటు చేసి విజయం సాధించాం. టిడ్కో గృహ నిర్మాణంలో ఆధునిక టెక్నాలాజీ వినియోగించి గృహ నిర్మాణాలు చేపట్టాం. దేశంలోని పలు రాష్ట్రాలు మన నిర్మాణ శాంకేతికతను అమలు చేస్తున్నాయి. అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా తాగునీరు, మురు గునీరు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.. అయితే, గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారాయణ..
మరోసారి కుండబద్దలు కొట్టిన స్పీకర్.. అది కుదరని పని..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నాను గనుక మాట్లాడకూడదు అంటే కుదరదంటున్నారు. గత ఐదేళ్లు కార్య కర్తలను ఇబ్బంది పెట్టినవాళ్లను కూటమి పార్టీలు చేర్చుకోవద్దని హితవు పలికారు.. ఇక, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, యువత ఎదుర్కోంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా వున్నాయని అన్నారు. గంజాయి కేసుల కోసం అయితే తన ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దని స్పష్టం చేశారు.. ఇక, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ పర్యటన.. రోడ్డు తవ్వి మరీ నాణ్యత పరిశీలన..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు బిజీ బిజీగా గడిపారు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.. పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం, కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు పవన్ కల్యాణ్.. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్ళే రహదారిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు. ఇక, గుడివాడ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రూరల్ మండలం మల్లాయపాలెం వాటర్ వర్క్స్ వద్ద పవన్ కు స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమినేతలు… మల్లాయపాలెం త్రాగునీటి చెరువు.. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేయు విధానాన్ని.. పవన్ కు వివరించారు కలెక్టర్ బాలాజీ.. గ్రామీణ ప్రాంతాల్లో నిటి సరఫరా వ్యవస్థ ఫోటో ప్రదర్శన తిలకించారు.. నీటి శుద్ధి పరీక్షలను వీక్షించారు.. ఇటీవల పవన్ కల్యాణ్ చొరవతో విడుదలైన రూ.2.27 కోట్లతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మరమ్మత్తులు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ప్రజలు.. అభిమానులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.. అభిమానులకు అభివాదాలు చేస్తూ.. మంగళగిరి తిరుగు ప్రయాణమయ్యారు పవన్ కల్యాణ్..
న్యూ ఇయర్‌కు కొత్త బ్రాండ్లతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైన బెజవాడ
కొత్త సంవత్సరం వేడుకలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు బెజవాడ సిద్ధమైంది. మొన్నటివరకు బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో నానా రచ్చ చేసిన మందుబాబులు.. ఇప్పుడు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రావడం ఫుల్ కిక్కే కిక్కు అని అంటున్నారు. మరోవైపు పండుగ సీజన్ మొదలుకావడంతో విజయవాడలోని లిక్కర్ మార్ట్‌లు ఫుల్ స్టాక్‌తో నిండిపోయాయి. గతంలో బ్రాండ్ మద్యం కోసం మందుబాబు ఇతర ప్రాంతాల్లోకి తరలి వెళ్లేవారు. కానీ అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో పాటు కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఫుల్ కిక్కు అని మందుబాబులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందరూ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సారి న్యూఇయర్ వేడుకల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ పెరగనున్నట్లు సమాచారం.
బతుకమ్మ సంస్కృతిని వెస్టర్న్ కల్చర్‌తో భ్రస్టుపట్టిస్తున్నారు.. మంత్రి ఆగ్రహం
తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు. తెలంగాణలో కులమత సాంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని కులమతాలకు రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందన్నారు. బతుకమ్మ సంస్కృతిని వెస్టర్న్ కల్చర్‌తో భ్రష్టుపట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాటను ఆలపించారు. “ఊ అంటావా మామా ఊఊ అంటావా” లాంటి పాటలను క్రిస్టియన్ పాటల్లో జోడిస్తున్నారని.. మతాలపైన విశ్వాసాలను కాపాడుకోవాలన్నారు. బతుకుమ్మ పండగను వెస్టర్నైట్ చేశారని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే బతుకమ్మ సాంప్రదాయాన్ని పాడుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికి వారి మతంపై గౌరవ మర్యాదలు ఉండాలన్నారు. అది అవలంభించే బాధ్యత మనదేనని ఆమె సూచించారు. దయచేసి డీజే, సినిమా పాటలు సంస్కృతి, సంప్రదాయాలకు ఇక నుంచి వాడకుండా చూడాలన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. 2024 ఖరీఫ్ సీజన్‌లో రూ.54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు, 81.57 శాతం విడుదల చేశారన్నారు. రబీ రుణాల పంపిణీకి నెలరోజుల సమయం ఉన్నందున వేగం పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు జమ చేశామన్నారు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి వారితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.
పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. శారీరక, మానసిక వైకల్యం ఉందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్లు రుజువు కావడంతో యూపీఎస్పీ ఆమెపై వేటు వేసింది. ట్రైనీ ఐఏఎస్‌గా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ ఎలాంటి ప్రవేశ పరీక్షలు/యూపీఎస్సీ సెలెక్షన్స్‌లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ముందస్తు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె ఉద్దేశాలు, ప్రాథమికంగా అధికారులను మోసగించడమేనని కోర్టు పేర్కొంది. పెద్ద కుట్రలో భాగంగానే ఆమె విధంగా చేసిందని.. ఇది చాలా బలమైన కేసుగా ఉందని జస్టిస్ చంద్ర ధరి సింగ్ పేర్కొన్నారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్‌కు కూడా ఆమె అనర్హులని తెలిపింది. ఆమె దేశం మొత్తాన్ని మోసం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. యూపీఎస్సీని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసినట్లుగా గుర్తించామని తెలిపింది. ముందస్తు బెయిల్‌పై గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేయగా.. తాజాగా సోమవారం ముందస్తు బెయిల్‌ను ధర్మాసనం నిరాకరించింది.
తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!
డిసెంబర్ 20న (శుక్రవారం) గుజరాత్‌లోని సూరత్ నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రారంభమైంది. విమానంలోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. మొత్తం 300 మంది ప్యాసింజర్స్ జర్నీ చేస్తున్నారు. కేవలం సూరత్ నుంచి బ్యాంకాక్‌కు 4 గంటల ప్రయాణం. విమానంలో సహజంగా మద్యం, ఫుడ్ సరఫరా చేస్తుంటారు. అయితే సూరత్ ప్రయాణికులు మాత్రం.. కరవు కాలం అన్నట్టుగా విమానంలో ఉన్న మద్యం, ఫుడ్ మొత్తం ఆరగించేశారు. బ్యాంకాక్‌కు చేరకముందే 15 లీటర్ల విస్కీ, బీరు తాగేశారు. అంతేకాకుండా ఆయా రకాల ఆహారాన్ని కూడా ఆరగించేశారు. మొత్తంగా రూ.1.80 లక్షల ఖరీదైన మద్యం తాగేసినట్లుగా సిబ్బంది తెలిపారు. మరింత కావాలని ప్రయాణికులు కోరగా.. సిబ్బంది చేతులెత్తారు. స్టాక్ అయిపోయినట్లుగా తెలిపారు. 4 గంటల జర్నీలో దాదాపుగా విమానంలో ఉన్న ప్రయాణికులంతా వీటిని ఖాళీ చేసినట్లగా ఎయిరిండియా సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇది ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించింది. గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం కోసం ఆవురావురుగా ఉన్న ప్రయాణికులంతా విమానం ల్యాండ్ కాక ముందే పూర్తిగా ఖాళీ చేసేసినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హోండా, నిస్సాన్ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్?
జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఈ కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా.. నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా(Makoto Uchida) మాట్లాడుతూ.. “ఈ విలీనం విజయవంతమైతే.. వినియోగదారులకు తక్కువ ధరలకు మెరుగైన ఉత్పత్తులను అందించగలమని ఆశిస్తున్నాం. జపాన్‌లోని ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకోవడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.” అని పేర్కొన్నారు.
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. భారతదేశంలో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్ల సంభవిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. భారతదేశం ఏటా రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశానికి పెద్ద ఆర్థిక సవాలు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోంది. దేశంలో విద్యుత్ వినియోగంలో 44 శాతం సౌరశక్తి నుంచి వస్తుంది. దీంతో ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారిస్తోంది. మన జలవిద్యుత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత సౌరశక్తి, గ్రీన్ ఎనర్జీ, ముఖ్యంగా బయోమాస్ నుంచి వచ్చే శక్తిని అభివృద్ధి పరుస్తున్నాం. సౌరశక్తి మనందరికీ ముఖ్యమైన వనరులలో ఒకటి. భారతదేశం ఎలక్ట్రిక్ బస్సుల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్సులు చాలా అవసరం. అయితే మన దేశ కెపాసిటీ ప్రకారం.. 50,000 బస్సులు తయారు చేయగలం. ఈ బస్సులను తయారు చేసేందుకు, ఫ్యాక్టరీలను విస్తరించేందుకు ఇదే సరైన సమయం.” అని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఫ్యాక్టరీలు ప్రారంభించాలని కంపెనీలను ఆయన అభ్యర్థించారు.
శ్రీ తేజ్ కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్థిక సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు..ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికీ వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు..ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.
మాట తప్పిన ఎన్టీఆర్!
అదేంటి ఎన్టీఆర్ మాట తప్పడం ఏమిటీ అని ఆశ్చర్యపోకండి. ఈ మాటలు అంటున్నది మేము కాదు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు అవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా దేవర సినిమా రిలీజ్ ముందు కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కలిసి సినిమా చూద్దామని, ఆర్థిక సాయం చేస్తామని మాట ఇచ్చి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికి ఎలాంటి సాయం చేయాలేదని…కొడుకు కాపాడాలని తల్లి వేడుకుంటూ మీడియా ముందుకు వచ్చింది. గతంలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్‍తో వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు. ఆ సమయంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న కౌశిక్ ను అదుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 11 లక్షల రూపాయలు, టీటీడీ ఇచ్చి ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తి అయ్యిందని, మరో 20 లక్షల రూపాయల ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. కౌశిక్ కుటుంబ సభ్యులకు అంత స్థోమత లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెన్నై అపోలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. మొత్తం 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా చివరికి ఇరవై లక్షలు అందిస్తే డిశ్చార్జ్ చేస్తామని అపోలో యాజమాన్యం చెబుతోంది. సహాయం చేస్తామన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లేదని కౌశిక్ తల్లి వాపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదని బాలుడి తల్లి సరస్వతి చెబుతోంది.
సన్నీ లియోన్, వైఫ్ ఆఫ్ జానీ సిన్స్ కి నెల నెలా రూ.1000 ప్రభుత్వ సాయం
అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో క్రియేట్ అయిన ఖాతాకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు జమ అవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ పథకంలో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సన్నీలియోన్ పేరుతో నిరంతరం డబ్బులు కాజేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించారు. ఆ వ్యక్తిని వీరేంద్ర జోషిగా గుర్తించారు. సన్నీ లియోన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసింది అతనే. అతనిపై కేసు నమోదు చేసి లబ్ధిదారుల వెరిఫికేషన్‌లో ఉన్న అధికారులపై కూడా విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లోని తాలూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, డబ్బు రికవరీ చేసేందుకు వీలుగా ఈ విషయమై విచారణ జరిపి బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ హారిస్ ఎస్ కోరారు. ఈ విషయమై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వరుసగా ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. మహతారీ వందన్ యోజన లబ్ధిదారుల్లో 50 శాతానికి పైగా నకిలీవేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ పేర్కొన్నారు. కాగా, తమ హయాంలో చేయలేనిది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని, మహిళలకు నెలనెలా సాయం అందుతుండడంతో కాంగ్రెస్ మనస్తాపానికి గురైందని బీజేపీ అంటోంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే సన్నీ లియోన్ భర్తగా ఇంటర్నేషనల్ మేల్ పార్న్ స్టార్ జానీ సిన్స్ పేరు ఉండడం.