పవన్ కల్యాణ్ వర్సెస్ బోండా ఉమా..! సీఎం సీరియస్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేకపో యినా.. కూటమి పార్టీల మధ్యే హీట్ పుడుతోంది.. స్టిక్ కాలుష్యం పై అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో చర్చ జరిగింది.. సాధారణంగా క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటారు.. ఒక్కోసారి సభ్యులు అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉంటుంది.. ఈ మధ్య కాలంలో ఇదే సెషన్ లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది.. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఇదే రకమైన చర్చ అసెంబ్లీలో జరిగింది.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారానికి సంబంధించి చైర్మన్ పనితీరు బాలేదని ఎమ్మెల్యే బొండా ఉమా కామెంట్ చేశారు.. దాంతోపాటు పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పనులు కావట్లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ చెప్తున్నారు అన్నారు.. బొండా ఉమ… ఈ వ్యాఖ్యలని తప్పు పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాను అందుబాటులో ఉండడం లేదనే మాట వాస్తవం కాదు అన్నారు… అయితే పొల్యూషన్ కంట్రోల్ విషయంలో తగిన చర్యలు తీస్కుంటాము అన్నారు పవన్.. బహుశా టీడీపీ అధిష్టానం నుంచి కూడా బోండా ఉమాకి పిలుపు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.. గత కొన్ని రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఉమా అనుచరులు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పూర్తిస్థాయి నివేదిక సీఎం దగ్గర ఉందట.. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ జరగడంతో బోండా ఉమా వైఖరి మీద మరింత సీరియస్ గా ఉన్నట్టు సమాచారం… సీఎం బోండా ఉమాని.. పిలిపించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. మరోవైపు జనసేన కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.. శాఖ పరమైన విచారణ జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.. కూడా హాట్ టాపిక్ గా మారింది.. ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమా ఇలా మాట్లాడారా లేకపోతే నిజంగా పొల్యూషన్ ఎక్కువైపోతుందా.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… ప్రశ్నించారా.. అనే అంశం పై కూడా విచారణలో తేలనుంది.
నా లక్ష్యం ఒక్కటే… అందరి ఆదాయం పెరగాలి..
నా లక్ష్యం ఒక్కటే.. అది, అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేశాం.. తల్లికి వందనం అందరు పిల్లలకు ఇచ్చాం.. ప్రజలే ఆస్థి.. మన పిల్లలే మన ఆస్థి.. అని పేర్కొన్నారు.. ఒకేసారి పదివేలకోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. ఆడబిడ్డల సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం.. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 20వేలు ఇస్తున్నాం.. మొదటి విడత ఏడువేలు ఇచ్చాం… ఏడాదిలో పదహారు వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.. అయితే, పది లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నా.. ఏడాదికి 34 వేల కోట్లు ఫించన్ల రూపంలో ఇస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయన్నారు.. ఇక, జీఎస్టీ తగ్గింపుతో నిజమైన దసరా, దీపావళి వచ్చింది.. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయి.. నా లక్ష్యం ఒక్కటే… అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ పనులు వెంటనే పూర్తవుతాయి.. పనిలో రాజీలేదని స్పష్టం చేశారు.. 730 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.. అక్టోబర్2 గాంధీ జయంతి కల్లా లెగసీ వేస్ట్ తొలగిస్తాం. స్వచ్ఛ వాహనాలు మీ ఇంటికి వస్తాయి… పాత వస్తువులు ఇస్తే మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తాం. ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో సెంటర్‌పై నెపం వేస్తోంది. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్ వన్ సమస్యతో సెలెక్ట్ అయినవారూ, కాలేని వారూ బాధపడుతున్నారు” అని అన్నారు. “శ్యామ్ పిట్రోడా ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా రాహుల్ గాంధీ ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ ఏదీ లేదు. బోగస్ ఓట్లు మాత్రం ఉన్నాయి. బోగస్ ఓట్లు వేరు, ఓట్ల చోరీ వేరు. ఈ తేడా కూడా తెలియని రాహుల్ గాంధీ ఒకసారి ఓట్ల చోరీ అంటారు, ఇంకోసారి హైడ్రోజన్ బాంబ్ అంటారు” అని ఎద్దేవా చేశారు.
రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ముఖ్యమంత్రి యొక్క ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, వాటిని అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారి భద్రత ప్రమాణాలను పెంచకుండా, అమాయక ప్రజలపై రూ.270 కోట్ల అదనపు భారం మోపాలని చూడటం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. హైడ్రా వంటి విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనంపై రూ.2 నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు. కష్టపడి కూడబెట్టుకుని లేదా అప్పు చేసి వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.
హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో తబారక్ లాడ్జ్, హోటల్ పేరుతో నడుస్తోంది. అయితే, ఈ లాడ్జ్ గదుల్లో ఓ యువకుడు మాత్రం నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు బాంబులు అందించేందుకు, గదినే బాంబుల తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు, ఎస్ఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకుంటున్న అషర్ డానిష్ అనే వ్యక్తి, ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తున్నాడు. గత వారం ఢిల్లీ పోలీసుల మరో ఉగ్రవాది అఫ్తాబ్ ఖురేషిని అరెస్ట్ చేసి, విచారణ చేయగా డానిష్ గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం మేరకు, డానిష్, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. డానిష్ గది నుంచి గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకునున్నారు. ఈ గదిలో బాంబుల్ని తయారు చేసి, సువర్ణ రేఖ నదిలో వీటిని పేల్చి పరీక్షించినట్లు తేలింది. గదిలో వివిధ మొత్తాల్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భారతీయులకు అమెరికా అంటే ఎందుకంత ఇష్టం.. ప్రధాన కారణాలు ఇవేనా..?
H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు భారీ ముల్యంగా దీన్ని భావిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై తాజాగా స్పందించిన ట్రంప్.. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఇప్పుడు భారతీయులు అమెరికాను ఇష్టపడటానికి ప్రధాన కారణాలు గురించి తెలుసుకుందాం.. futurense నివేదిక ప్రకారం.. భారతీయులు అమెరికాను ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికాలో లభించే ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య, మెరుగైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ, సాంకేతిక ఆవిష్కరణలలో అగ్రస్థానం, మంచి జీతం వచ్చే ఉద్యోగాలు లభిస్తాయట. ఇంటర్న్‌షిప్‌లు అవకాశాలు సైతం అధికమట. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందట. అమెరికాలో ఉన్న సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో అవకాశాలు భారతీయులను ఆకర్షిస్తాయట. యూఎస్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో మంచి ఉద్యోగాలు లభిస్తాయట. ఇక్కడ లభించే జీతాలు భారత్‌తో పోలిస్తే చాలా రెట్లు అధికంగా ఉండటం వల్ల అందరూ యూఎస్‌కి పరుగులు తీస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్‌లో పెట్టుబడి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నాయి. ఇంకా అనేక కారణాలు సైతం ఉండొచ్చు.
ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం నుంచి అమెరికా లోకి ప్రవేశం నిరాకరించబడుతుందని ట్రంప్ కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం 12.01EDT( భారత కాలమానం ప్రకారం, ఉదయం 9.30) తర్వాత యూఎస్ లోకి ప్రవేశించే ఏ H-1B హోల్డర్‌కైనా ప్రయాణ నిషేధం, రుసుము నిబంధన వర్తిస్తుంది. కొత్తగా H-1B వీసాలు, వీసాల పొడగింపు ప్రక్రియను కొనసాగించడానికి 1,00,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది, ఈ మొత్తాన్ని చెల్లించాలని ట్రంప్ ఉత్తర్వులు చెబుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ నిషేధంపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. H-1B వీసా కలిగిన వారు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడితే, వారి వల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండకపోతే, అమెరికా ప్రజల సంక్షేమానికి హాని కలగకుంటే వీరు నిషేధం నుంచి మినహాయించబడుతారు. వీటిని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే నిర్ణయిస్తారు. అమెరికాకు ఉపయోగపడే విదేశీయులకు మినహాయింపులు ఇవ్వవచ్చు.
ఫస్ట్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం.. మరి రేపు ఏం జరగనుంది..?
భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. కానీ ఏం లాభం లేకుండా పోయింది. కాగా.. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మ్యాచ్‌నే ఆడొద్దని డిమాండ్లు వచ్చినా సరే.. పాక్‌ను ఢీకొట్టి విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన పని భారత అభిమానులను ఆకట్టుకుంది. కనీసం పాక్ క్రికెటర్లతో కరచాలనం కూడా చేయకుండా.. ఈ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమ్‌ఇండియా ప్రకటించింది. అక్కడ నుంచి పాక్ ఆక్రోశం మొదలైంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కీలకమైన యూఏఈతో మ్యాచ్‌నూ బాయ్‌కాట్ చేస్తామని, టోర్నీ నుంచి వెళ్లిపోతామనే బెట్టు చేసింది. వెళ్లిపోతే ఆర్థికంగా నష్టమని గ్రహించారేమో.. పైకి మాత్రం రిఫరీ పైక్రాఫ్ట్ ‘క్షమాపణలు’ చెప్పాడని, తాము ఆడతామని స్వయంప్రకటన జారీ చేసింది. యూఏఈపై గెలిచి సూపర్-4లో అడుగు పెట్టింది.
నాగార్జునను కలిసిన బండారు దత్తాత్రేయ..
హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ. ఇక నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే కుబేర, కూలీ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో మెప్పించారు. కూలీ సినిమాలో నాగ్ చేసిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తాను మెయిన్ హీరోగా వస్తున్న సినిమాలపై నాగ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తన వందో సినిమా ప్రాజెక్టు గురించి కూడా కీలక చర్చలు మొదలైనట్టు ప్రచారం అయితే నడుస్తోంది. మరి దీనికి నాగ్ ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతున్నాడనేది మాత్రం తెలియాల్సి ఉంది. చూడాలి మరి నాగ్ అలై బలై ప్రోగ్రామ్ కు వస్తాడా లేదా అనేది.
ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
ఓజీ సినిమా హంగామా మొదలైంది. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా భారీ అప్డేట్ ఇచ్చింది టీమ్. రేపు అనగా సెప్టెంబర్ 21న సాయంత్రం ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా మూవీ టీమ్ అప్డేట్ చేశారు. అయితే ఇది కేవలం పాటలకు సంబంధించిన కాన్సర్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నదానిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎల్బీస్టేడియంలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ కు మూవీ టీమ్ మొత్తం హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క పవన్ రాక మీదనే క్లారిటీ రావాల్సి ఉంది. సెప్టెంబర్ 25న సినిమా రావాల్సి ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఓషీ అనే పాట పాడాడు. దాన్ని నిన్న రిలీజ్ చేశారు. ఇక మిగతా సినిమా అప్డేట్లు త్వరలోనే వస్తాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే 22న ఉంటుందనే ప్రచారం అయితే నడుస్తోంది. కానీ ఎంత వరకు నిజం అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కల్యాన్ ప్రమోషన్లకు దూరంగానే ఉంటున్నారు. ఈ సినిమాపై ఇంతకంటే అంచనాలు పెంచడం ఇష్టం లేక సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆస్కార్ రేసులో ఆ ఐదు తెలుగు చిత్రాలు..
ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగం, కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరిక ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతీ ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి. కానీ అది అంత సులభం కాదు. అయితే.. ఆస్కార్ రేసులో తెలుగు చిత్రాలు పోటీపడనున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర సినిమాలు ఆస్కార్‌కి ఎంపికయ్యాయి. 2025 ఆస్కార్ అవార్డులకు భారత్ తరపున అధికారిక నామినేషన్ పొందాయి. ఇప్పటికే ఈ చిత్రాలు భారీ రికార్డులు సాధించాయి.
