ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డికి సన్నిహితులు.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది.. ఇక, ఆర్థర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.. డిస్టలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. అయితే, లిక్కర్ స్కాంలో ఏ1, ఏ1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి.. చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందన్నారు. ఇక, సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు.. కేసులో ఏ1 రాజ్‌కేసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి, ఏ3 సత్య ప్రసాద్‌లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు.. ఏ1 రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారు.. ముడుపుల వసూలుకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారు.. అంతేకాదు.. ఆ ముడుపులు ఎక్కడ..? ఎలా..? పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ పేర్కొంది.. ముడుపులు డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారు.. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందన్నారు.
తాడిపత్రి పోలీసులకు జేసీ వార్నింగ్.. బుధవారం వరకు టైం ఇస్తున్నా..!
అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దవడుగూరు మండలంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ఫైర్ అయ్యారు.. తాడిపత్రి నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.. పెద్దవడూగురు మండలంలో రెండు నెలలుగా ఇండియన్ గ్యాస్ పంపిణీ జరగడంలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆయన.. గ్యాస్ పంపిణీలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, తాడిపత్రి సీవీఆర్‌టీ ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని దుయ్యబట్టారు.. వచ్చే బుధవారంలోపు వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఒక వేళ బుధవారం లోపు వారిపై కేసు నమోదు చేయకపోతే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతాం అంటూ పోలీసులకు డెడ్‌లైన్ పెట్టారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
అరెస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర కోణం.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం..!
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది.. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదు అని దుయ్యబట్టారు.. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారన్న ఆయన.. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి జగన్ ను అక్రమ కేసులతో జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం అన్నారు.. ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైసీపీ నేతలను, వైసీపీ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు.. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు.. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుందని వ్యాఖ్యానించారు.. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.. అందుకే ఈ అక్రమ అరెస్ట్‌లు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురూ.. ఇప్పుడు నలుగురే..
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందని చీప్ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారుల కమిటీలు సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నాయి.. ఉద్యోగుల ప్రమోషన్ ఇవ్వనప్పుడు.. డీఏలు ఇవ్వని పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు.. హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే, హరీష్ రావును పక్కన పెట్టారు ఫోటో లేకుండా చేశారని ప్రభుత్వ చీప్ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సయోధ్య కోసం బావ బామ్మర్దులు కలిసి ఉంటారు.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మూసివేయం అన్నారు. దేవాలయ పూజలు కొనసాగుతాయి.. 150 కోట్ల రూపాయలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.. శృంగేరి పీఠంకి అనుబంధంగా ఉంటుంది వేములవాడ ఆలయం.. శృంగేరి పీఠం అనుమతి లేకుండా ఇటుక కూడా తీయం అన్నారు. ఆలయాన్ని మూసేయ వద్దు.. దర్శనాలు కొనసాగాలని చెప్పారు.. ఆలయ విస్తరణ పనులు చేస్తున్నాం.. 30 గుంటలది.. నాలుగు ఎకరాలు విస్తరణ చేస్తున్నాం.. ఇంద్రుడు, సూర్యుడు, రాముడు, పంచ పాండవులు దర్శనం చేసుకున్న దేవాలయం.. శృంగేరి పీఠం చెప్పినట్టే చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చినా.. కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పీసీసీఎఫ్ డాక్టర్ జి సువర్ణ, ములుగు, మహబూబాబాద్ డీఎఫ్ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అటవీ చట్టాలు, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ROFR చట్టం అడ్డు కాదని గుర్తు చేశారు. ఇక, అందుకే అటవీ, అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించింది. దుబ్బగూడం, కొండపర్తి లాంటి గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అందుకే నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌కు సన్మానం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఢిల్లీ లలిత్ హోటల్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం జరిగింది. గజమాలతో గవాయ్‌ను సన్మానించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానం పట్ల గవాయ్ ఉద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్కిటెక్ట్ అవుదామని అనుకున్నా.. కానీ తండ్రి గారి కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం న్యాయవాద వృత్తి ఎంచుకున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గర్వంగా ఉందని చెప్పారు. 16 ఏళ్ల పాటు మహారాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా.. ఆరేళ్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించగలిగాను అంటే దానికి అంబేద్కర్ భావజాలమే కారణం అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన తొలి రోజుల్లో భయం భయంగా గడిపేవాడినని.. ఆ భయాన్ని తోటి న్యాయమూర్తులు పోగొట్టారన్నారు. తీర్పుల విషయంలో సహచర న్యాయమూర్తులు చేదోడు వాదుడుగా ఉండటం సంతృప్తి కలిగించిందన్నారు. దేశంలో ఉన్న నాలుగు వ్యవస్థల్లో న్యాయవ్యవస్థ చాలా కీలకమైందని తెలిపారు. కోర్టులకు న్యాయం కోసం వచ్చే వారి విషయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు రూల్ ఆఫ్ లా పాటిస్తూ వారికి న్యాయం చేయాలని పేర్కొ్న్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు క్రమ శిక్షణతో ఉండాలని కోరారు.
600కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. భారత్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. భారత వాయు రక్షణ వ్యవస్థలు 600 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ని భారత్ మోహరించింది. వీటి ద్వారా పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. పెద్ద వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు సర్ఫేజ్ టూ ఎయిర్ (SAM) క్షిపణి వ్యవస్థల్ని రంగంలోకి దించింది. ఇలా పలు అంచెలుగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివ్ చేయడంతో పాకిస్తాన్‌కి పరాభవం తప్పలేదు. స్వదేశీ టెక్నాలజీ తయారు చేయబడిని ‘‘ఆకాష్ తిర్’’ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. L-70 ఎయిర్ డిఫెన్స్ గన్: 1970లో స్వీడన్ నుంచి కొనుగోలు చేసిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్‌కి భారత్ అప్‌గ్రేడ్ చేసి, అధునాతన హైరిజల్యూషన్ సెన్సార్లు, కెమెరాలు, రాడార్ వ్యవస్థను మర్చింది. ఇది 3-4 కి.మీ పరిధిలోని వైమానిక ముప్పును పసిగట్టి నిమిషానికి 300 రౌండ్లు కాల్పులు జరుపుతుంది. పగలు, రాత్రి వేళల్లో ఇది పనిచేస్తుంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 146 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 146 మంది పాలస్తీనియున్లు మృతిచెందారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చెడింది. దీంతో ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజా దాడుల్లో 146 మంది చనిపోతే.. 459 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇది అత్యంత శక్తివంతమైన దాడిగా తెలుస్తోంది. మే 5న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ మంత్రివర్గం.. గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవాలని.. సహాయాన్ని నియంత్రించాలని తీర్మానించినట్లు చెప్పారు. హమాస్‌పై తీవ్రమైన దాడిని ప్లాన్ చేస్తోందన్నారు. అన్నట్టుగానే తాజాగా భారీగా దాడులు చేపట్టింది.
రాజమౌళి అడగలేదు.. అమీర్ ఖాన్ కు ఓకే చెప్పా : ఫాల్కే మనవడు
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. అదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఈ మూవీని రాజమౌళి సమర్పణలో కార్తికేయ, వరుణ్‌గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ఇదే దాదాసాహెబ్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటిస్తాడని.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరు ఇందులో నటిస్తారో అనే అనుమానాలు పెరుగుతున్న టైమ్ లో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ తాజాగా స్పందించారు. ‘రాజమౌళి సమర్పణలో ఈ మూవీ వస్తుందని నేను కూడా వార్తల్లో విన్నాను. కానీ ఇప్పటి వరకు రాజమౌళి గానీ వాళ్ల టీమ్ గానీ మమ్మల్ని సంప్రదించలేదు. ఫాల్కే బయోపిక్ తీయాలంటే కనీసం మమ్మల్ని సంప్రదించాలి కదా. ఎందుకంటే మా తాత గారి గురించి మాకే బాగా తెలుస్తుంది. కానీ రాజమౌళి నుంచి ఎవరూ మా దగ్గరకు రాలేదు. కానీ అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ టీమ్ మమ్మల్ని ఎన్నోసార్లు సంప్రదించింది. వాళ్లు మూడేళ్లుగా మాత్ టచ్ లో ఉన్నారు.
ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్‌లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్‌లో పాల్గొనలేదు. ఈ నెల 18, అంటే రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిజానికి జీకే విష్ణు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించాల్సి ఉంది, అయితే పలు కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇటీవల “అమరన్” అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
