తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ నుంచి మరో రైలుకు అంటుకున్న మంటలు..
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.. దీంతో, ఆ ప్రాంతంలో రైల్వే సేవలను నిలిపివేశారు.. మంటలు వేగంగా వ్యాపించాయి, రైల్వే అధికారులు అత్యవసరంగా స్పందించారు. సమాంతర ట్రాక్‌పై వెళుతున్న వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. ఆయన ప్రస్థానం ఇదే..
మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నిమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా.. గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్‌ను నియమించారు.. అయితే, సీనియర్ రాజకీయ నేత, ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ సేవలు అందించిన విజయనగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. దీంతో, ఉత్తరాంధ్రకు రెండో కీలక పదవి దక్కినట్టు అయ్యింది.. ఇప్పటికే ఒడిశా గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు ఉండగా.. ఇప్పుడు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులు అయ్యారు.. అయితే, తన 36 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు.. అశోక్‌గజపతిరాజు తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేశారు.. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.. మొత్తం 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసారు. ఇక, 2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. దీంతో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా.. పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫైనాన్స్, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్న ఆయన్ను.. గోవా గవర్నర్‌గా పంపించింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్..
చంద్రబాబు ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే..! కేతిరెడ్డి హాట్ కామెంట్స్
సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేతిరెడ్డి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ” నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే విచిత్రమైన వాతావరణం ఉంటుందన్నారు.. ఆయన వళ్లే.. ఎండకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని ఎద్దేవా చేశారు.. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా.. ఒక్క పంట రైతులు వేయలేకపోతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇక, చంద్రబాబు హయాంలో ప్రతిదీ గిన్నీస్ బుక్కు రికార్డులే ఉంటాయి అని విమర్శించారు కేతిరెడ్డి.. మేం చేసింది చెప్పుకోలేకపోయాం.. చంద్రబాబు మోసాలు చెప్పలేకపోయాం అన్నారు. అయితే, వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని తెలిపారు.. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జనం భారీగా తరలివస్తున్నారని గుర్తుచేశారు.. అయితే, జగన్‌ని ఆపేందుకు 2వేల మంది పోలీసులు ఎందుకు..? అని ప్రశ్నించారు.. మరోవైపు, ఆగష్టు నుంచి ఫ్రీ బస్సు ఉంటుందని మహిళలు సంబరపడిపోతున్నారు.. అలా అని బస్సు ఎక్కితే మధ్యలోనే దింపేసి పోతారు అంటూ ఆరోపణలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.
పేర్ని నాని వ్యాఖ్యలపై సోమిరెడ్డి కౌంటర్ ఎటాక్.. అందుకేగా మొన్న పోటీ చేయలేదు..!
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు 76 ఏళ్ల ముసలివాడు అంటూ.. పేర్నినాని చేసిన కామెంట్‌పై ఫైర్ అయిన సోమిరెడ్డి.. మాజీ మంత్రి పేర్ని నానికి కొవ్వు ఎక్కువైంది. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని విరుచుకుపడ్డారు.. చంద్రబాబుతో పాటు పేర్ని నాని రామతీర్థం, అలిపిరి మెట్లు ఎక్కగలరా..? అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు నడవగలరా..? అని నిలదీశారు.. అయితే, నీ వయసు అయిపోయిందనే కదా? మొన్న పోటీ చేయలేదు.. అంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు, తన కుమారిడి రాజకీయ భవిష్యత్తు కోసం కొడాలి నాని, వంశీలను పేర్ని నాని ఇరికిస్తున్నాడని విమర్శించారు సోమిరెడ్డి… బతుకు జీవుడా అంటూ వల్లభనేని వంశీ ఇప్పుడే జైలునుండి బయటికి వచ్చారు.. కానీ, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. రప్పా రప్పా అని రాం గోపాల్ వర్మ తో వైసీపీ వాళ్ళు ఒక సినిమా తీయించుకోవచ్చు అని సలహా ఇచ్చారు.. పేర్ని నానితో పాటు జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.. కాకాణి గోవర్ధన్ రెడడ్ఇ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. ఇలా పనికిమాలిన వాళ్లు వైసీపీలో ఉన్నారు అని విరుచుకుపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
భార్య ఫోన్ రికార్డ్ చేయడం తప్పేం కాదు, సాక్ష్యంగా పరిగణించవచ్చు.
వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. అలాంటి సంభాషణల్ని సాక్ష్యంగా అనుమతించడం వల్ల గృహ సామరస్యాన్ని, వైవాహిక సంబంధాలను హాని కలిగిస్తుందని, జీవిత భాగస్వాములపై నిఘా పెట్టడాన్ని ప్రోత్సహిస్తుందని కోన్ని వాదనలు ఉన్నాయని అననారు. అయితే, అలాంటి వాదనలు సమర్థనీయమని మేము భావించడం లేదని, వివఆమం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకునే దశకు చేరుకుంటే, ఆ సంబంధం విచ్ఛిన్నమైన సంబంధానికి లక్షణమని, వారి మధ్య నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర వర్మతో కూడిన ధర్మాసనం తన తీర్పులో చెప్పింది.
సమోసా, జిలేబీలకు కూడా ఇకపై “సిగరేట్-తరహా” వార్నింగ్స్..
ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం కీలక చర్యకు ఉపక్రమించింది. ఎలా అయితే, “సిగరేట్” తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఉంటుందో, అదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్‌కు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది. ఈ వార్నింగ్స్ ఆహార పదార్థాల్లోని అధిక స్థాయిలో ఉండే నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ కూడా జీవనశైలి వ్యాధులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ప్రచారాన్ని మొదటగా నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS నాగ్‌పూర్) ఈ ప్రచారం ప్రారంభం కానుంది. క్యాంపస్‌లోని క్యాంటీన్లు, భోజనశాలల్లో ఈ ఆహారాల్లో ఉండే వాటిని బోర్డుల రూపంలో ప్రదర్శించనున్నారు. కౌంటర్ల పక్కన కస్టమర్లకు సులభంగా కనిపించే విధంగా, పెద్దగా ప్రకాశవంతమైన అక్షరాలతో ఈ వార్నింగ్స్‌ని ప్రదర్శిస్తారు.
భారతదేశంలో తొలి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్..!
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘డెంగిఆల్’ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్‌ల నుంచి రక్షణ కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్‌లో అక్టోబర్ నాటికి దాదాపు 10,500 మంది వాలంటీర్లను నమోదు చేసే లక్ష్యం ఉంది. ఇప్పటికే పూణే, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్ సహా ఇతర నగరాల్లోని కేంద్రాల్లో 8,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. టీకా లేదా ప్లేసిబో ఇవ్వడమూ ఇందులో భాగం.
6500mAh భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసిన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ వివో X200 FE..!
వివో తన X200 సిరీస్‌లో భాగంగా vivo X200 FE పేరుతో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లు, అత్యాధునిక ప్రాసెసింగ్ సామర్థ్యం, అదిరిపోయే డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది. మరి ఈ ప్రీమియం మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా.. ఈ కొత్త Vivo X200 FE మొబైల్ లో 6.31 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్, అలాగే 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కావడంతో స్క్రోలింగ్, వీడియోలు చూడడం చాలా స్మూత్ గా అనిపిస్తాయి.
వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు దగ్గర పడింది. జులై 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. అన్ని పనులను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. U/A సర్టిఫికేట్ పొందింది ఈ మూవీ. మూవీ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. రిలీజ్ కు పది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి కొంత అభిమానుల్లో ఉంది. వాటన్నింటికీ చెక్ పెట్టేస్తూ జులై 20న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మూవీ టీమ్. వైజాగ్ లో ఈవెంట్ ఉండబోతోంది. ఈవెంట్ కు సీఎం చంద్రబాబు కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది.
కె-ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్.. నాటుగా దించేసిన కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ అనేది ట్యాగ్ లైన్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఊరనాటు పాత్రలో కనిపించాడు. గ్లింప్స్ నిండా నాటు బూతు మాటలే కనిపిస్తున్నాయి. క్లాస్ అనే పదం పక్కన పెడితే.. ఊర మాస్ పాత్రలో చేస్తున్నాడు కిరణ్. ఇప్పటి వరకు కిరణ్ మరీ ఇంత బోల్డ్ మాటలు మాట్లాడలేదనే చెప్పుకోవాలి. ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు.. బుడ్డలు జారుతాయ్ అనే డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ చేశారు. ఈ డైలాగ్ తోనే తమ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు.
మన హీరో హీరోయిన్లు ఇలా అయిపోతే.. అమ్మో.. ఆ ఊహే భయంకరం!
గత కొన్ని నెలలుగా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని ద్వారా చాలా పనులను సులభంగా చేసుకుంటున్నారు టెక్కీలు. అయితే, కొంతమంది మాత్రం ఏఐ ద్వారా తమ సరదా తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా, తమకు నచ్చిన హీరోలకు ప్రాంప్టింగ్ ఇచ్చి డైలాగ్‌లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొన్ని సరదాగా ఉంటే, కొన్ని మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు ఏకంగా మన హీరోలు, హీరోయిన్‌లు ఒకవేళ లావుగా ఉండి, సినిమా హీరోలు లేదా హీరోయిన్‌లుగా కాకుండా సాధారణ జీవితం గడుపుతూ ఉంటే వారు ఎలా ఉంటారనే ఉద్దేశంతో ఒక ఔత్సాహికుడు ఏఐ వీడియో తయారు చేశాడు. ఆ ఏఐ వీడియోలో అనుష్క గాజులు అమ్ముతూ ఉంటే, మహేష్ బాబు మామిడి పళ్ళు అమ్ముతూ కనిపిస్తున్నాడు. ప్రభాస్ మామిడి జ్యూస్ అమ్ముతూ ఉండగా, రష్మిక చేపలు అమ్ముతూ, రామ్ చరణ్ వేరే ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వంట చేస్తూ ఉండడం గమనార్హం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిస్మస్ స్టార్స్ అమ్ముతూ ఉండడం విశేషం.
