20 ఏళ్ల వరకు అధికారంలో కూటమి ప్రభుత్వం..! చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు
ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా పిండి వంటలు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పండుగకు దూరంగా ఉన్నవారిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా పిండి వంటలు అందించినట్లు తెలిపారు. ఇక, కొత్త సంవత్సరం సందర్భంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఎవరికి సంబంధించిన బొమ్మలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని వెల్లడించారు చింతమనేని.. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చామని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల కొందరు ఇబ్బంది పడ్డారని, వారికి కూడా త్వరలో లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు.
రైలు పట్టాలపైనే ప్రసవించిన మహిళ..
రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళ రైలు పట్టాలపైనే ప్రసవించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం బరంపుర్‌కు చెందిన ప్రియాపాత్ర అనే మహిళ బరంపుర్ నుంచి సూరత్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తోంది.. అయితే, రైలు ప్రయాణంలో ప్రియాపాత్రకు తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి దించారు. ఇక, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే, రైల్వే పట్టాలపైనే ఆమె ప్రసవించింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆటో ద్వారా ప్రియాపాత్రను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, స్థానికులు సమయానికి సహకరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.
తిరుమల-తిరుపతి, చంద్రగిరి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం.. శంకుస్థాపన చేసిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల – తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.. రూ.126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్ల మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇక, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డీఐఎంసీ, ఇండోర్ సబ్‌స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా రంగంపేట, బీమావరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వరాలయానికి వెళ్లే బీటీ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అయితే, తిరుమల–తిరుపతి ప్రాంతం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే ప్రాంతమని, ఇక్కడ తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపడతామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
పతంగుల పండుగకు హైదరాబాద్ రెడీ.. రేపటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. రేపటి (జనవరి 13) నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరవాసులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్‌కు రానున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిలవనుంది. జనవరి 16, 17, 18 తేదీలలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ నిర్వహించనుండగా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆకాశంలో ఎగిరే బెలూన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. మరోవైపు ఆధునిక టెక్నాలజీకి వేదికగా డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. జనవరి 16, 17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్ట్ జరగనుంది. వినూత్న డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్‌ను పూర్తిగా ఉచితంగా నగరవాసులు, పర్యాటకులు ఆస్వాదించవచ్చు. రంగులు, రుచులు, టెక్నాలజీ మేళవించిన ఈ హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి వేడుకలకు మరింత అబ్బురపరచనుంది.
ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబైతో పాటు 28 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం చేశాయి. ఇక బీహార్ ఎమ్మెల్యే, జనపద గాయని మైథిలి ఠాకూర్‌ను కూడా మహాయతి కూటమి రంగంలోకి దింపింది. ముంబైలో పలుచోట్ల ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మహాయతి కూటమిని గెలిపించాలని కోరారు. అయితే ప్రచారంలో భాగంగా ఆమె తన గానంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రచారంలో ఎక్కువగా పాటలుతోనే ముందుకు సాగారు. హిందీ పాటలతో పాటు మరాఠీ పాటలను ఆలపించారు. దీంతో ఉత్తర ప్రదేశ్, బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు! రంగంలోకి రెస్క్యూ టీమ్
పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) నిర్వహిస్తున్న బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బోర్డిలా ప్రాంతంలో పెద్ద బొగ్గు గని అకస్మాత్తుగా కూలిపోవడంతో అనేక మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే సహాయక బృందాలు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే బొగ్గు గనిలో ఎంత మంది చిక్కుకున్నారన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇది అక్రమ మైనింగ్ గని సమాచారం. అక్రమ తవ్వకాల కారణంగా ఒక్కసారి కూలిపోయిట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఇరాన్‌పై దాడికి అమెరికా ప్లాన్.. దాడి చేసేది ఇక్కడి నుంచే!
ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ప్లాన్ చేస్తుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అగ్రదేశం ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ వైమానిక స్థావరంలో తాజాగా అమెరికా యుద్ధ విమానాల కదలిక పెరిగింది. అంతే కాకుండా, ఇరాన్‌లో నివసిస్తున్న తన పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, ప్రాంతీయ అస్థిరత మధ్య అమెరికా తాజా హెచ్చరిక సంచలనంగా మారింది. ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం.. అల్ ఉదీద్ వైమానిక స్థావరం. ఇది మధ్యప్రాచ్యంలో అతిపెద్ద US సైనిక స్థావరం. ఇందులో10 వేల కంటే ఎక్కువ మంది US సైనికులకు నివాసంగా ఉంది. ఈ స్థావరంలో B-52 వ్యూహాత్మక బాంబర్లు, KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, రవాణా విమానాలు వంటి పెద్ద విమానాలను నిర్వహించగల 4,500 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. ఇది US సెంట్రల్ కమాండ్ (CENTCOM) యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 200-300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!
ఇండియాలో పోకో స్మార్ట్‌ఫోన్ M8 5G అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత వారం రిలీజ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. 8GB + 128GB వేరియంట్ ధర రూ.19,999 కు అందుబాటులో ఉంది. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,999కు వస్తుంది. ఇది ఫ్రాస్ట్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ, కార్బన్ బ్లాక్ రంగులలో దొరుకుతుంది. పోకో పరిమిత కాల లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనితో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15,999కి తగ్గింది. పోకో M8 5G ఇతర రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ.16,999, రూ.18,999గా ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 13వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లో రూ.1,000 లాంచ్ బెనిఫిట్ వస్తుంది. దీనికి అదనంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.
అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!
SA20 2026 లీగ్‌లో MI కేప్‌టౌన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అనుకోకుండా బంతి తగిలి గాయపడిన ఓ మహిళా ప్రేక్షకురాలికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని పంపి ఉదారతను చాటాడు. ఈ ఘటన జోహానెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో MI కేప్‌టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో చోటు చేసుకుంది. MI కేప్‌టౌన్ ఇన్నింగ్స్ ప్రారంభ దశలో రికెల్టన్ లెగ్ సైడ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి ఓ ప్రేక్షకురాలి కిటికీ బలంగా తాకింది. ఆ సమయంలో అక్కడున్న భద్రతా సిబ్బంది, వైద్య బృందం వెంటనే స్పందించి ఆమెకు ప్రాథమిక చికిత్సను అందించారు. కాకపోతే ఆ మహిళకు చెంప ఎముక (చీక్‌బోన్) ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న రికెల్టన్, అభిమానిని గురించి ఆరా తీసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అహాబు చేసిన పనిని MI కేప్‌టౌన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో సంఘటనపై తన విచారం వ్యక్తం చేశాడు. అభిమానిని త్వరగా కోలుకోవాలని కోరుతూ, సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని ఆమెకు గిఫ్ట్ గా పంపించాడు. అలాగే ముక్యముగా తనవల్ల జరిగిన సంఘటనకు ఆమెను క్షమంచాని కోరడం హైలెట్. ఫ్రాంచైజీ కూడా స్పందిస్తూ.. గాయపడిన అభిమానిని ప్రస్తుతం కోలుకుంటున్నారని, రికెల్టన్ చూపిన మానవత్వంకు ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించాయి.
నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ ‘వరం’.. వర్షాన్ని ఆయుధంగా మార్చుకున్న అనిల్ రావిపూడి ది గ్రేట్!
ఈమధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు అనిల్ రావిపూడిదే, ఎందుకంటే కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, నిర్మాత శ్రేయస్సును కోరుకునే క్రమశిక్షణ గల దర్శకుడిగా ఆయన తాజాగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఆయన రూపొందించిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన వేళ, ఈ సినిమా నిర్మాణంలో అనిల్ చూపించిన చాకచక్యం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. 2025 మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, డిసెంబర్ 4 నాటికి పూర్తి అయింది, అయితే వాస్తవానికి మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా దాదాపు 45 రోజులు షూటింగ్ నిలిచిపోయింది. అయినప్పటికీ, పక్కా ప్లానింగ్‌తో అనిల్ కేవలం 78 రోజుల్లోనే మొత్తం షూట్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనిల్ రావిపూడిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఖర్చును తగ్గించి అవుట్‌పుట్‌ను పెంచడం. జూన్‌లో డెహ్రాడూన్‌లోని ఒక స్కూల్‌లో 17 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడకు వెళ్ళారు కానీ, భారీ వర్షాల కారణంగా అకారణంగా అక్కడ ముంగించాల్సి వచ్చింది. అక్కడ తీయాల్సిన ఇండోర్ సీన్స్‌ను హైదరాబాద్‌లోనే సెట్ వేసి చేయొచ్చని గుర్తించిన అనిల్, ఆ షెడ్యూల్‌ను 5 రోజులకు కుదించారు. దీనివల్ల నిర్మాతకు ఏకంగా 75 లక్షల రూపాయలు ఆదా అయ్యాయి.
