పోలవరంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు… ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించామన్న ఆయన.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని వెల్లడించారు.. గొల్లపల్లి, బనకచర్ల కు మూడు దశల్లో అనుసంధానం చేయవచ్చు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదు.. చైనాలో ఉండే త్రీ జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తయిన ప్రాజెక్టు అన్నారు.. 2014లో తెలంగాణలోని ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానంటే, కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని గుర్తు చేసుకున్నారు.. అప్పట్లో డయాఫ్రం వాల్ ను 460 కోట్లతో బావర్ సంస్థ నిర్మించింది. మొత్తం మీద 72 శాతం పనులు చేశాం.. 30 సార్లు పోలవరం వచ్చాను.. 80 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశా.. కానీ, అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఇక, రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం బయటకు పంపిందని మండిపడ్డారు చంద్రబాబు.. అప్పటి కాంట్రాక్టర్ ను మార్చి రాటిఫికేషన్ కు పంపించారు దుర్మార్గులు.. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారు.. 2020లో కాపర్ డ్యాం గ్యాప్‌ను కట్టకపోవడంతో వరద వలన డయాఫ్రం వాల్ దెబ్బతింది.. ఇప్పుడు డీ వాల్ కట్టాలంటే 2400 కోట్లు అదనంగా అవుతుందన్నారు..
రేపు ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో ఆమె గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు అనగా.. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్న సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేశారు కలెక్టర్ నాగలక్ష్మి.. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. తగిన ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో ఎయిమ్స్‌ను సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.. రేపు గుంటూరు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో.. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రాంగం… మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఎంబీబీఎస్ తొలి (2018) బ్యాచ్ విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.. ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఏపీ మంత్రి నారా లోకేష్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.. స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు రాష్ట్రపతి.. మొత్తం 49 మంది MBBS విద్యార్థులు, 04 మంది పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ అధికారులు, AIIMS మంగళగిరి ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పట్టభద్రుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఇక, అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు రాష్ట్రపతి..
సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!
పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి కూటమి సర్కార్.. వైసీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో.. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు… ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ ఫైర్ అయ్యారు.. స్పిల్ వే గేట్లు కూడా అమర్చామని అబద్ధం చెపుతున్నారు.. ఈ అబద్ధాలు వింటే ప్రజలు నవ్విపోతారు.. స్పిల్ వే పూర్తి చేసింది వైసీపీ, స్పిల్ వే గేట్లు పెట్టింది వైసీపీ.. ఒక రేకు తీసుకువచ్చి అక్కడ పెడితే, స్పిల్ వే గేట్లు అమర్చినట్లు కాదు అని హితవు చెప్పారు అంబటి రాంబాబు.. వైసీపీ చేసిన పనిని, మీరు చేసినట్లుగా చెబుతున్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వచ్చింది.. 2014 – 19 మధ్య పోలవరం కట్టడంలో తప్పులు జరిగాయని, అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. అసలు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలేంటి..? కాపర్ డ్యామ్‌లు కట్టకుండా, డయాఫ్రంవాల్ కట్టడం చారిత్రాత్మక తప్పిదం అన్నారు. మీరు చేసిన తప్పిదం వల్లే మళ్లీ 900 కోట్లతో డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుంది.. దీనికి బాధ్యుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.. అయితే, పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చంద్రబాబు చేశారని దుయ్యబట్టారు.. టీడీపీ, చంద్రబాబు అసమర్థత, అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందన్న ఆయన.. నదిని డైవర్ట్ చేయకుండా ఏ దేశంలో నైనా ప్రాజెక్టులు కడతారా..? అని నిలదీశారు.. వేరే దేశాల్లో అయితే ఇలాంటి తప్పులకు ఉరి శిక్షలు వేస్తారు అని హెచ్చరించారు అంబటి రాంబాబు.
అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్‌కు లేదని.. అందుకే అసెంబ్లీ వస్తలేరు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. కొడుకు , అల్లుడు , బిడ్డలను తాము పట్టించుకోమన్నారు. డీలిమిటేషన్‌లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందన్నారు. మా సీఎం , మంత్రులు పబ్లిక్‌కి అందుబాటులో ఉంటున్నాము ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి పార్లమెంట్‌కి వెళ్లారన్నారు.
శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతాం..
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. పురుషులను జైల్లో పెట్టి.. ఆడవారిని ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. కొడంగల్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతామన్నారు. దుర్మార్గమైన, నికృష్టమైన పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. తమ భూమి తమకు కావాలని అడ్డు పడితే రైతులను లాఠీలతో కొట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల మీద చర్చ పెడదాం అంటే.. పర్యాటక శాఖ మీద చర్చ పెట్టారన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెండే పర్యాటకాలు అని.. ఒకటి ఢిల్లీకి ఎక్కే పర్యాటకం, రెండూ దిగే పర్యాటకం అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి పోయారన్నారు. కొడంగల్ రైతుల మీద చర్చ పెడదాం అంటే అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ కేసీఆర్ పోరాటం చేస్తారని కేటీఆర్ చెప్పారు. పరారీలో ఉన్న వారిని ఇంకా వేధిస్తున్నారని ఆయన అన్నారు. 14 వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరిస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తాం అన్నది మీరు అంటూ.. రైతులకు న్యాయం చేసి ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లగచర్ల రైతులు 40 రోజులుగా జైల్లో ఉన్నారన్నారు. రైతు వీర్య నాయక్‌కు గుండె పోటు వస్తే బేడీలు వేసి ట్రీట్మెంట్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వమంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ – బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. హైడ్రా భయం ప్రజల్లో మాత్రం లేదన్న ఆయన.. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసిందన్నారు. అప్పులపై కేటీఆర్, బీఆర్‌ఎస్ నిజాలు తెలుసుకోవాలన్నారు. కార్పొరేషన్ లోన్స్‌తో కలిపి మొత్తం లెక్కలను బీఆర్‌ఎస్ వాళ్లు బయటపెట్టాలన్నారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయి అనేది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. 7లక్షల 20వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయన్నారు. శాసన సభలో ఎవరి పాత్ర వారిదే.. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన సభలో కూర్చొని ఉండగా.. మాట్లాడాలనే కోరిక తనకు ఉందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఆదాయం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదని… వైఎస్ఆర్ సమయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందన్నారు. రెండు మూడు ఏళ్లలో అన్ని సర్దుకున్నాయని.. వర్షాలు బాగా పడ్డాయన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.
లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గడ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆవు లేదా గేదెను, పాడి సహకార సంఘాలు నిర్మించడానికి సహాయం చేస్తామన్నారు. అంతే కాకుండా ప్రతినెల రూ.15,000 ఆదాయం కల్పిస్తామని అమిత్ షా స్పష్టంచేశారు. ఆదివారం బస్తర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని మావోలకు గట్టి సందేశం ఇచ్చారు. హింసను విడనాడి పునరావాసం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసను విడనాడితే పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. హింసను విడనాడకపోతే భద్రత దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని వార్నింగ్ ఇచ్చారు.
అసద్ మామూలోడు కాదు.. రష్యాకు పారిపోతూ ఏం చేశాడంటే..!
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల తిరుగుబాటుదారుల చేతిలో సిరియా అధ్యక్షుడు అసద్ పదవీచ్యుతుడయ్యాడు. సిరియా నుంచి రష్యాకు పారిపోయాడు. అయితే ముందుగానే అసద్ భారీగా నగదు తరలించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. విమానాల్లో కట్టల కట్టల డబ్బు మాస్కోకు తరలించినట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనం పేర్కొంది. దాదాపు పారిపోయే ముందు రూ.2,122 కోట్ల నగదును విమానంలో తీసుకెళ్లినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. బషర్ అల్-అసద్.. మాస్కోకు $250 మిలియన్లు (రూ.2,122 కోట్లకు పైగా) నగదును విమానంలో తీసుకెళ్లారని ఎఫ్‌టీ నివేదించింది. 2018, 2019లో దాదాపు రెండు టన్నుల $100 మరియు €500 కరెన్సీ నోట్లతో 21 విమానాలను పంపినట్లు వెల్లడించింది. మాస్కోకు నగదు చేరాక.. అస్సాద్ బంధువులు రష్యాలో రహస్యంగా విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఎఫ్‌టీ స్పష్టం చేసింది.
ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 36 లక్షల ఈవీలు సేల్.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అమ్ముడయ్యాయంటే..?
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అందులో.. టాప్-5లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి..? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. దీంతో పాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందించింది. సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 3639617 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈవీలు అమ్మకాల పరంగా అత్యధిక నమోదు అయిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 665247 యూనిట్ల ఈవీలు అమ్మకం జరిగాయి. ఆ తర్వాత 439358 యూనిట్ల ఈవీలు అమ్మకాలు జరిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో కర్ణాటకలో 350810 యూనిట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 228850 యూనిట్లు నమోదయ్యాయి. 233503 యూనిట్ల నమోదుతో రాజస్థాన్ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అలాగే.. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో మొత్తం 216084 యూనిట్లు నమోదయ్యాయి.
రిలీజ్ డేట్ ప్రకటించిన ‘లైలా’ మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికె గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి సినిమాలను రిలీజ్ చేసాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా ప్రకటించాడు విశ్వక్. ఈ సినిమా విశ్వక్ మొదటిసారి లేడీ గెట్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందట అనౌన్స్ చేసాడు. మెకానిక్ రాకి రిలీజ్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టిన విశ్వక్ ఇటీవల సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసారు మేకర్స్.తాజగా నేడు ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లైలా సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.అలాగే లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలోని లైలా లుక్ ఆడియెన్స్ కు సరికొత్త ట్రీట్ ఇస్తుందని యూనిట్ భావిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళుతోంది. పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా విడుదల నాటి నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుండే ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసులు చేసింది. కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు స్టార్ట్ అందుకుంది. ఇక అదే జోష్ లో కొనసాగుతు రెండవ వారంలో అడుగుపెట్టింది పుష్ప -2. ఇక సెకండ్ వీకెండ్ ఆదివారం నాడు నార్త్ లో మెజారిటీ స్టేట్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది. ఇక హిందీలో ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్స్ చూసుకుంటే 11 రోజులకుగాను రూ. 561.50 కోట్ల గ్రాస్ రాబట్టి హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ డబ్బింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది.దాంతో పాటు రెండవ వారంలో హిందీ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే రెండవ వారంలో రూ. 100 కోట్లు రాబట్టిన మొట్ట మొదటి సినిమాగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసాడు పుష్ప రాజ్. ఇకవరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇప్పటికే రూ. 1292 కోట్ల కు పైగా రాబడు దూసుకెళుతోంది పుష్ప