స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా చంద్రబాబు నేతృత్వంలోని పోలీసులు ముందు నిర్వహిస్తే ఒకే రకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం.. ఒక్కో మెడికల్ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశాం.. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు.
గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. దసరా కానుకగా మరో పథకం..
సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందిస్తాం అన్నారు.. ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ శుభవార్త చెప్పారు.. ఈ దసరా నుంచి పథకం అమలు అవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు.. ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నారు.. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక, సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం.. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది.. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? అని ప్రశ్నించారు..
సూపర్ సిక్స్ లే కాదు.. ఇప్పటికే చాలా సిక్స్‌లు కొట్టాం.. టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుంది..
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక సమానత్వం సాధించడానికి పెట్టిన పథకాలివి.. కేవలం సూపర్ సిక్స్ లే కాదు, చాలా సిక్స్ లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొట్టిందన్నారు.. పోలవరం, అమరావతికి నిధులను కేంద్రం విడుదల చేసింది.. వేగంగా ఈ ప్రాజెక్టులు నిర్మితం అవుతున్నాయన్నారు.. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తై కృష్ణా బేసిన్ కు, రాయలసీమకు 215 టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు.. త్వరలోనే ప్రజా రాజధాని అమరావతి పూర్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ కూడా మరింత ప్రగతి సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు హయాంలో ఏడాదిలో 9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు మాధవ్.. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తోంది, అలాగే సెమీ కండక్టర్ యూనిట్ ను కూడా ఇటీవలే కేంద్రం కేటాయించింది.. లక్ష 30 వేల కోట్ల విలువైన 59 జాతీయ రహదారి ప్రాజెక్టులు ఏపీలో నిర్మితం అవుతాయి.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి.. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపే వివిధ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.. ఇక, జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయదారులకు, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు లబ్ధి కలగబోతోంది.. వెయ్యికి పైగా వస్తువుల ధరలు తగ్గి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని వెల్లడించారు..
ఇక ఆ బాధలు ఉండవు.. హామీ ఇస్తున్నాం..
ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. శివతాండవాన్ని వినిపించిన నేల ఇది.. ఎందరో కవులు, కళాకారులు పుట్టిన నేల ఇది.. సీమకు ఎప్పుడూ కరువు కాలం, ఎండా కాలమే.. దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్ అన్న ఆయన.. పార్టీలు వేరైనా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అన్నారు.. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.. ఇక, 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. 1,005 కోట్ల రూపాయలతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం.. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం.. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశాం అన్నారు.. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయి అని స్పష్టం చేశారు.. రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తాం.. ఏపీని నంబర్ వన్‌గా తీర్చిదిదుత్తాం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. నాకు కేంద్ర పెద్దల ఆశీర్వదం ఉంది..
ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై మాట్లాడారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి ప్లానింగ్ అంత కిషన్ రెడ్డి చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు.. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, యోగి ఆధిత్యానాథ్ ఆశీర్వాదం తనకు ఉందన్నారు. గోషామహాల్‌లో ఎవరికి పార్టీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కూడా నా బీజేపీనే రేపు కూడా నా బీజేపీ నే అన్నారు.. పెద్దలు పిలిస్తే అన్ని వెళ్తా.. ఇక్కడ ఉన్న అన్ని విషయాలు చెబుతా అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ తప్పు చేసినప్పుడల్లా తాను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. రబ్బర్ స్టాంప్ గా మారొద్దని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు సూచించారు. చివరగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయనని ఏమీ పీక్కుంటారు పిక్కోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రాజాసింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీలో చర్చ కొనసాగుతోంది. పార్టీ పెద్దలు ఈ వ్యాఖ్యలును తప్పుపడుతున్నారు.
మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ఏ విధంగానైనా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును నిర్వచించింది. ‘‘మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము’’ అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
నేపాల్‌లో “రాచరికం” ఎలా ముగిసింది, ప్రజాస్వామ్యంగా ఎలా మారింది..?
నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది. ఇవే తాజాగా, హిమాలయ దేశంలో జరుగుతున్న హింసాత్మక ఆందోళనకు కారణమయ్యాయి. సోషల్ మీడియా బ్యాన్ అనేది ఇందుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. 2008లో నేపాల్‌ను 240 ఏళ్లు పాలించిన షా రాజవంశం రద్దు చేయబడింది. రెండేళ్ల నిరసన తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడింది. ఇప్పుడు, మళ్లీ నేపాల్‌లో రాచరికం పునరుద్ధరించబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి 1559లో ద్రవ్య షా అనే రాజ్‌పుత్ వంశానికి చెందిన వ్యక్తి గూర్ఖా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా ఇది నేపాల్ మొత్తాన్ని పాలించడం మొదలుపెట్టారు. 1743లో పృథ్వీ నారాయణ షా దేశంలో ఐక్యత తీసుకువచ్చారు. చిన్నచిన్న సంస్థానాలు అంతా ఒకే రాజ్యంగా మారి, ఆధునిక నేపాల్ గా ఆవిర్భవించింది. 19వ శతాబ్ధంలో బ్రిటీష్ వారి ఒత్తిడి, అంతపురం కుట్రలు, ఎన్నో పోరాటాలు వచ్చిన షాల రాచరికం చెక్కుచెదరలేదు.
యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్!
ఆసియా కప్ 2025 నిన్న ఆరంభమైంది. టోర్నీని అఫ్గానిస్థాన్ ఘన విజయంతో మొదలు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. నేడు భారత్ తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు యూఏఈని ఢీకొట్టనుంది. కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సన్నాహకంగా ఈ పోరును వాడుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చాడు. ‘దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడాం. అనంతరం ఇక్కడ చాలా మ్యాచులు జరిగాయి. ఇప్పుడు పిచ్ స్పందించే తీరు మారిపోయే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూసి ఓ అంచనాకు వస్తాం. ప్రస్తుతం పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉంది. యూఏఈ మ్యాచ్‌లో ఎలా బరిలోకి దిగాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అత్యుత్తమ జట్టును బరిలోకి దించుతాం. అదనపు పేసర్ లేదా స్పిన్నర్ అనేది మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తాం’ అని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
హీరోయిన్ గొప్ప మనసు.. వ్యాధి సోకిన బాబుకు సాయం..
సినీ సెలబ్రిటీలు చాలా మందికి సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి సాయమే ప్రకటించి అందరి మనసులు దోచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. గతంలో కాంట్రవర్సీల్లో చిక్కుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా ఐటెం సాంగ్స్, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో తన గొప్ప మనసు చాటుకుంది. ఓ పిల్లాడికి అరుదైన వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే అతని ఇంటికి వెళ్లింది. ఆ బాబు తల భారీగా ఉబ్బిపోయింది ఉంది. ఈ వ్యాధిని హైడ్రోసెఫాలస్ అంటారు. ఈ వ్యాధి సోకిన వారి బెలూన్ లాగా పెద్దగా ఉంటుంది. దీనికి కచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. తాజాగా బాలుడి వద్దకు వెళ్లిన జాక్వెలిన్.. తాను సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది. పైగా బాబుతో కాసేపు ఆడుకుంటూ కనిపించింది. బాబుకు పాల డబ్బాతో పాలు పట్టింది. దీంతో ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాక్వెలిన్ ను అందరూ అభనందిస్తున్నారు. జాక్వెలిన్ కు ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని ద్వారా ఇలాంటి వారికి సాయం చేస్తోంది. గతంలోనూ కొందరికి ఆపరేషన్లు చేయించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది.
నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ
లేడీ సూపర్ స్టార్ నయనతార నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఆమెను ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉంటారు. మనకు తెలిసిందే కదా.. నయనతార చాలా మందితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది. గతేడాది ఆమె లైఫ్ స్టోరీ ఆధారంగా నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్ అనే డాక్యమెంటరీ తీశారు. ఇందులో గతంలో నయన తార యాక్ట్ చేసిన సినిమాల క్లిప్స్ వాడటం పెద్ద వివాదంగా మారింది. అప్పట్లోనే హీరో ధనుష్ తన మూవీ క్లిప్స్ ను పర్మిషన్ లేకుండా వాడారంటూ రూ.కోటి నష్టపరిహారం కోరుతో కోర్టులో కేసు వేశాడు. అది ఇప్పటికీ వాదనలు నడుస్తోంది. ఈ క్రమంలోనే మరో నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది.
ముంబై స్కూల్లో బాలయ్య సందడి
ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఆయన ప్రోత్సాహకరమైన సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. విద్యార్థుల ఆనందభరిత వాతావరణం పాఠశాల ప్రాంగణంలో సందడిని నింపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణప్రసాద్ బాలకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్శన విద్యార్థులకు ఒక చిరస్థాయి జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు తెలిపారు. బాలకృష్ణ స్ఫూర్తిదాయక మాటలు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
మనవడిని చూసి మురిసిపోతున్న చిరంజీవి..
మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు ఈ రోజ ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మనవడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపి రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చేశారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మనవడిని ఎత్తుకోగా.. పక్కనే వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఒకే ఫ్రేమ్ లో ఈ ముగ్గురూ ఉండటం ఆకట్టుకుంటోంది. అటు మిగతా మెగా హీరోలు కూడా రెయిన్ బో హాస్పిటల్ కు వస్తున్నారు. రామ్ చరణ్ కూడా హాస్పిటల్ కు బయలు దేరి వస్తున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో పనిచేశారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి లావణ్య సినిమాలు మానేసి ఇంటికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కొడుకు పుట్టడంతో నాగబాబు కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
