CMRF స్కాంపై 6 కేసులు నమోదు చేసిన సిఐడి..
తాజాగా CMRF స్కాం పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని ఆరోపణలు వచ్చాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా చేశారని నిర్ధారణ జరిగింది. ఆస్పత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని విచారణలో వెలుగు చూసారు అధికారులు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసింది సిఐడి. దింతో 30 ఆసుపత్రులపై విచారణ ముమ్మరం చేసారు సిఐడి అధికారులు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్..
తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాను కొందరు హాకింగ్ గురి చేశారు. ఈ హ్యాకింగ్ జరిగిన సమయంలో హ్యాకింగ్ చేసినవారు కొన్ని వీడియోలను, పోస్టులను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే అందుకు సంబంధించిన తగిన చర్యలను తీసుకోంది. దాంతో పరిస్థితిని టెక్నికల్ టీం అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ” సూచన అంటూ.. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు. నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైడ్రా పని తీరు పై కూకట్‌పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెరువుల సంరక్షణకు నాళాల ఆక్రమణలు కూడా తొలగించి, చెరువులను అభివృద్ది చేయాలని., కూకట్‌పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు, 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటిసులు ఇవ్వటం శోచనీయం అంటూ తెలిపారు. చెరువుల ఆక్రమణలు తెలియక., అన్ని అనుమతులున్నాయని ఇళ్ళను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు. కూకట్‌పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.. అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని ఆయన ప్రశ్నించారు. చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద,మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారని., చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు.
మా ఫోన్లపై నిఘా పెట్టారు..
సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు.. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపణలు చేశారు. అది మేము చేయించినట్లు ఆరోపించగా.. నగదు చేతులు మారాయని అందువల్లే విమర్శలు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.. మాకు ఆయనకు సంబంధం లేదు అని కాకాణి చెప్పుకొచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.. మా ఫోన్లపై నిఘా పెట్టారు.. నేను పెంచలయ్యతో మాట్లాడానేమో చూసుకోండి అని కాకాణీ గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలి అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై A2గా కేసు పెట్టారు.. పోలీసు కేసులకు భయపడం.. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా.. సోమిరెడ్డిపై ఇతరులు చేసిన ఆరోపణలను ఫార్వర్డ్ చేయడం తప్పా అంటూ ఆయన మండిపడ్డారు.
పరవాడ సినర్జిన్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికే ముగ్గురు మృతి..!
అనకాపల్లి జిల్లా పరవాడపరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున మృతి చెందారు. విశాఖలోని ఇండస్ హస్పటల్ లో చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. కాగా, సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇక, ఈ నెల 22వ తేదీన పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్-3లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23వ తేదీన, రొయా అంగిరియా 24వ తేదీన మృతి చెందారు. అలాగే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. లడఖ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని షా అన్నారు. లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని షా ట్వీట్ చేశారు. లడఖ్‌ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ ఉన్నాయి. 2019 సంవత్సరంలో లడఖ్‌ను జమ్మూ కాశ్మీర్ నుండి వేరు చేసి, కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఆ సమయంలో కేంద్రపాలిత ప్రాంతంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి – లేహ్, కార్గిల్. ఇప్పుడు లడఖ్‌లో మరో ఐదు కొత్త జిల్లాలు (జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్) ఏర్పడ్డాయి. లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు మెరుగైన పాలన, శ్రేయస్సు కోసం ఒక అడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు సేవలు , అవకాశాలను మరింత చేరువ చేసేందుకు జంస్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్‌లపై ఇప్పుడు మరింత దృష్టి కేంద్రీకరించవచ్చు. అక్కడి ప్రజలకు అభినందనలు అంటూ షా ట్విటర్లో రాసుకొచ్చారు.
రష్యాలో 9/11 తరహా దాడి.. సరతోవ్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్
2024 ఆగస్టు 26న రష్యాపై ఉక్రెయిన్ పెద్ద దాడి చేసింది. ఈసారి ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని సరాటోవ్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని లక్ష్యంగా చేసుకుని 20 డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిలో ఉక్రేనియన్ సైన్యానికి చెందిన డ్రోన్ సరాటోవ్‌లోని నివాస భవనాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో సగం భవనం దెబ్బతిన్నదని, ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడిందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రాంతీయ గవర్నర్ వివరాలు వెల్లడించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో సరతోవ్ గవర్నర్ రోమన్ బుసర్గిన్ మాట్లాడుతూ.. రష్యాలోని సరతోవ్ నగరంలో ఒక ఇల్లు కూడా డ్రోన్ శిధిలాల వల్ల దెబ్బతిన్నదని, అందులో ఒక మహిళ తీవ్రంగా గాయపడిందని చెప్పారు. మహిళను ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు, రాజధాని మాస్కోకు ఆగ్నేయంగా అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన సరాటోవ్, ఎంగెల్స్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలను మూసివేసినట్లు గవర్నర్ తెలిపారు.
పాకిస్తాన్‌లో దారుణం..23మందిని బస్సుల నుండి దించి కాల్చి చంపారు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే మృత్యువు ఆట ఆడింది. కొంతమంది సాయుధ వ్యక్తులు ట్రక్కులు మరియు బస్సుల నుండి ప్రయాణీకులను తీసివేసి, వారిని గుర్తించిన తర్వాత, వారిపై కాల్పులు జరిపారు. ఇందులో కనీసం 23 మంది మరణించారు. ఇప్పుడు ఈ దాడిపై పంజాబ్ ప్రభుత్వం స్పందించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పంజాబ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఈ ముసాఖేల్ దాడి జరిగిందని పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి అజ్మా బుఖారీ తెలిపారు. అంతకుముందు ఏప్రిల్‌లో, నోష్కి సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుండి దింపారు. వారి ఐడీ కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు. సాయుధులు వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించే పనిలో పడ్డారని తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
రోహిత్ శర్మ చాలా కాస్ట్‌లీ గురూ.. అతడిని కొనడం మా వల్ల కాదు!
ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను ఐపీఎల్ 2024 సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అసంతృప్తిగా ఉన్న రోహిత్.. ఐపీఎల్ 2025 ముందు వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రోహిత్ శర్మ తన పేరును నమోదు చేసుకుంటాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్‌ను పంజాబ్ దక్కించుకుంటుందా? అని ఓ పాడ్‌కాస్టర్ అడగగా.. రోహిత్ చాలా కాస్ట్‌లీ గురూ, అతడిని కొనడం తమ వల్ల కాదని చెప్పకనే చెప్పారు. రోహిత్ మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడని, అత్యధిక ధరను సొంతం చేసుకుంటాడన్నారు.
సింహంలా గర్జించిన మహేశ్ బాబు ‘ముఫాసా’ ట్రైలర్ రిలీజ్..
2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. మరియు అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తాజగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ముఫాసా తెలుగు పాత్రకు మహేష్‌బాబు డబ్బింగ్ చెప్పారు. తెలుగు ట్రైలర్‌లో మహేష్ వాయిస్ అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ముఖ్యంగా ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి’’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్స్ కు గూస్‌బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది. మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ‘ముఫాసా’కు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉందని ముఫాసా’కు వాయిస్ ఓవర్ అందించడంపై సూపర్ స్టార్ మహేశ్ ట్వీట్ చేసారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్ ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం వాయిస్ ఓవర్ అందించారు.
