NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..
రక్షా బంధన్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన మనవడికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కి రాఖీలు కట్టారు. ‘సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాడు చంద్రుడిలా చల్లగా ఉంటుంది. ఈ పండగ సందర్భంగా రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పండు, తేనె లాంటి సుఖ సంతోషాలతో ఉండాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా..రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ రాఖీ కట్టారు. సీఎంకు రాఖీ కట్టిన సీతక్క మాట్లాడుతూ.. మహిళల అందరిలో మన అక్క.. చెల్లెళ్ళ నీ చూసుకోవాలన్నారు. అందరికీ రక్షా బందన్ శుభాకాంక్షలు తెలిపారు. పురుష సమాజంకి విజ్ఞప్తి చేస్తున్నా.. మన ఇంట్లో ఆడ బిడ్డ లాగ..బయట మహిళను చూడండి అన్నారు. అప్పుడే సమాజం లో శాంతి అన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీతక్క రాఖి కట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఈ రక్షణ రక్షాబంధన సందర్భంగా కూడా నేను ఓ సారి గుర్తు చేస్తన్న అన్నారు. మహిళల రక్షణ విషయంలో మేము చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. సింఘ్వీ తో తెలంగాణకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్న అన్నారు. అన్ని పార్టీలుగా సహకరించాలన్నారు.

నేడు రాఖీ పౌర్ణమి.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈరోజు తన సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, అయితే ఆమె ఏ కష్టాలు వచ్చినా తనకు అండగా ఉంటానని కేటీఆర్ అన్నారు. ఎక్స్ లో కేటీఆర్ ఏమన్నారంటే.. ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నువ్వు కష్టపడినా నేను నీకు అండగా ఉంటాను’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి లవ్ సింబల్ ను జోడించారు. అంతకుముందు, సోదరి కవిత కేటీఆర్ కు కట్టిన రాఖీ చిత్రాన్ని పంచుకున్నారు.అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారానికి ఒకటి రెండు సార్లు కేటీఆర్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అవుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ఆసక్తికర ట్వీట్ వైరల్‌గా మారింది.

చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్‌ డిమాండ్‌..
చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతి పార్టీని మేము చేర్చుకోమన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి .. కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అప్పట్లో కాంగ్రేస్ లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడన్నారు. కేటీఆర్ బతుకు ఎటుగాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు.. పైరవీలు చేస్తే కఠిన చర్యలు: సర్కార్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ఆఫీస్ బేరర్ల లెటర్లపై స్క్రూటినీ తర్వాతే బదిలీలకు వెసలుబాటు కల్పించారు. ఒకే దగ్గర ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి బదిలీలు చేయనున్నారు. ఈనెల 31లోగా పూర్తి కానున్న బదిలీల ప్రక్రియ.. దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, భార్యభర్తలకు వెసలుబాటు కల్పించారు. అలాగే, వచ్చే నెల 5 నుంచి 15 వరకు ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బదిలీలు వర్తింప చేయకపోవటంపై ఆక్షేపణలు వస్తున్నాయి. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, ఏపీ జీఎల్ఐ, పీఏఓ, ట్రెజరీస్ విభాగంలో బదిలీలు వర్తించవు.. ఈ విభాగాల్లో గడచిన 10-15 ఏళ్లుగా ఉద్యోగులు ఒకే చోట పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బదిలీల జీవోలను ఈ విభాగాలకు కూడా వర్తింప చేయాలని ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తుంది.

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్..
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు. ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి.. హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. ఇక, ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్ర ప్రధేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ యోచిస్తుంది.

సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ..
దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది. ఇక RG కార్ మెడికల్ కాలేజి మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ ను వరుసగా నాలుగో రోజు సీబిఐ విచారిస్తోంది. అలాగే.. నిందితుడు సంజయ్ రాయ్ కి సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ టెస్ట్ ముగిసింది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కొన్ని కధనాల ద్వారా తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు తర్వాత ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. నివేదికల ప్రకారం, ఈ కేసులో సీబీఐకి షాకింగ్ సమాచారం అందింది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో.. ఆస్పత్రిలో అక్రమంగా మానవ అవయవాల వ్యాపారం జరుగుతోందని, మృతుడికి మద్దతిస్తున్న వైద్యుల వాంగ్మూలాలను బట్టి సీబీఐకి తెలిసింది. విచారణలో 23 సంవత్సరాల క్రితం 2001లో జరిగిన కాలేజీ విద్యార్థి మరణానికి లింకులు కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాలేజీలో సెక్స్, డ్రగ్స్ రాకెట్ కూడా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీబీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

అంగరంగ వైభవంగా న్యూయార్క్ లో ‘ ఇండియా డే పరేడ్ ‘ వేడుకలు..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ‘ఇండియా డే పరేడ్’ నిర్వహించారు. నగరంలోని తూర్పు 38వ వీధి నుండి తూర్పు 27వ వీధి వరకు మాడిసన్ అవెన్యూలో కవాతు సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకారం, కవాతులో 40కి పైగా ఫ్లోట్‌లు, 50కి పైగా కవాతు బృందాలు, 30కి పైగా కవాతు బ్యాండ్‌ లతో పాటు ప్రముఖులు, ముఖ్య అతిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠి, జహీర్ ఇక్బాల్, భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పాల్గొన్నారు. ఇండియా డే పరేడ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కవాతులో భాగంగా రామ మందిరాన్ని కలిగి ఉన్న కార్నివాల్ పట్టిక కూడా ఉంది. ఇండియా డే పరేడ్ సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలపించారు. కవాతులో పాల్గొన్నప్పుడు ప్రజలు భారత జెండాలను పట్టుకుని డ్రమ్స్ వాయిస్తూ నృత్యాలు చేస్తూ కనిపించారు. కార్నివాల్ సమయంలో, వీధుల్లో టేబుల్‌ లాక్స్‌పై మతపరమైన పాటలు ప్లే చేయబడ్డాయి. చెక్కతో చేసిన టేబుల్‌ లో ప్రధానంగా రామ మందిరాన్ని చిత్రించారు. ఇది అయోధ్య నగరంలో రాముడి కోసం నిర్మించబడింది. ఇది చెక్కతో చేసిన రామ మందిర నిర్మాణాన్ని కలిగి ఉంది. 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లోట్ భారతదేశంలో తయారు చేయబడింది. ఈ కవాతులో పాల్గొనడానికి దానిని ఎయిర్ కార్గో ద్వారా పంపబడింది. ఇకపోతే ఇండియా డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ఉత్సాహంగా కనిపించారు. భారతీయ సంస్కృతి యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుందని రామ మందిరం యొక్క పట్టిక చూపిస్తుంది. భారతీయ అమెరికన్ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సమూహం రామమందిరం టేబులాను చేర్చడంపై వివాదాస్పదమైన నేపథ్యంలో కవాతు నుండి దాని పట్టికను ఉపసంహరించుకుంది. ఇది ముస్లిం వ్యతిరేక పక్షపాతాన్ని చూపుతుందని పేర్కొంది.

అస్వస్థతకు గురైన వినేశ్‌ ఫొగాట్!
పారిస్ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ అస్వస్థతకు గురయ్యారు. పారిస్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన వినేశ్‌కు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి 13 గంటల పాటు ప్రయాణించి చేరుకున్నారు. బలాలి గ్రామస్థులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా అందజేశారు. అంతేకాదు రూ.21 వేలను కూడా గిప్ట్‌గా ఇచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సుదీర్ఘమైన ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేశ్‌ ఫొగాట్‌.. ఆత్మీయ సమావేశం జరుగుతుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు కుర్చీలోనే పడుకుండి పోయారు. దీంతో క్కడ ఉన్న వారు కంగారుపడ్డారు. వినేశ్‌ పక్కనే ఉన్న రెజ్లర్‌ బజరంగ్‌ పునియా వాటర్ బాటిల్ ఇవ్వగా.. నీరు తాగిన కాసేపటికి ఆమె తేరుకున్నారు. ఎక్కువ సమయం ప్రయాణించడంతో వినేశ్‌ కాస్త ఇబ్బంది పడ్డారని బజరంగ్‌ పునియా తెలిపారు. 29 ఏళ్ల వినేశ్‌.. 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ ఆడని విషయం తెలిసిందే.

అన్నా.. మళ్ళీ హిట్టు ఎప్పుడు కొడతావ్ అన్న.. ఫ్యాన్స్ భావోద్వేగం..
సొంత కష్టంతో పైకి ఎదిగాడు మాస్ మహరాజా రవి’తేజ’. కాని ఈయన పేరులో ఉన్న తేజం ఇప్పుడు ఈయన సినిమాలలో లేదు. అభిమానులకు వినడానికి కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. మాస్ మహారాజా లాస్ట్ సుపర్ హిటే ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ధమాకా ఉంది కదా అంటే అందులో సగం కంటే ఎక్కువ క్రెడిట్ డాన్సింగ్ డాల్ శ్రీలీలకు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాల్తేర్ వీరయ్య హిట్ అంటే ఆ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ మాత్రమే. మరి రవితేజ భుజాల మీద సినిమాను నడిపించి సోలో హిట్టు కొట్టిన సినిమా ఏది అంటే 2021లో వచ్చిన క్రాక్. ఆ చిత్రంలో రవితేజ నటన, కామెడీ టైమింగ్ వింటేజ్ రవితేజని గుర్తుకు తెస్తాయి. కాని ఇటీవలి సినిమాలలో ఆ వింటేజ్ రవితేజ కనిపించడం లేదు. అవును రవితేజ గత 10 సినిమాలలో సోలో హిట్ క్రాక్ మాత్రమే. రావణాసుర, రామారావ్ ఆన్ డ్యూటి సినిమాలు వచ్చాయనే సంగతి కూడా చాలా మందికి తెలియదంటే అర్ధం చేసుకోవాలి రవితేజ సినిమాల పరిస్థితి ఎలా ఉందో. ఈ హీరో సినిమాలలో కొత్తదనం ఏదైనా ఉంది అంటే అది కేవలం హీరోయిన్స్ మాత్రమే.  ఆమెకు సినిమాలో సరైన పాత్ర ఏమి ఉండదు. కేవలం నాలుగు స్టెప్పలు, నాలుగు ముద్దులు పెట్టుకోవడం వంటి అతి ముఖ్యమైన పనులకు మాత్రమే పనికొస్తుంది. ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ వరస సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇన్ని ఫ్లాప్ సినిమాలలో రవితేజ నటన బాలేదనో, సరిగా చేయలేదనో  రిమార్క్ ఇప్పటికి లేదు. కేవలం బలం లేని కథలు ఎంచుకుని ఫ్లాప్స్ తెచ్చపకుంటున్నాడు. ఇక నుండైనా కథల విషయంలో కేర్ తీసుకుని, మోహమాటం లేకుండా సినిమాలు చేస్తే హిట్టు కొట్టి వింటేజ్ రవితేజని చూడడం అనేది మ్యాటర్ కాదనేది రవితేజ అభినానుల ఆవేదన. మరి వారి ఆవేదన మాస్ మహారాజ పట్టించుకుంటారో లేదో..