NTV Telugu Site icon

ఆయన ఆత్మకు శాంతి కలగాలి : విక్టరీ వెంకటేశ్

ఎన్నో తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సిరివెన్నెల మృతిపై ప్రముఖ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్‌ స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త విని నిరుత్సాహానికి గురయ్యాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.