యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్ లా కనిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు…
కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోన్న ‘గనీ’ చిత్రం ప్రిపరేషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చేస్తోన్న వర్కవుట్ నెట్ లో వైరల్ అవుతోంది. ముఖం చూపించకుండా బ్యాక్ సైడ్ తోనే ‘వావ్’ అనిపించాడు ‘గనీ’భాయ్! ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సింగ్ ఎంటర్టైనర్ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు…