తమన్నా భాటియా… మరోమారు బాలీవుడ్ కి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద హీరోలతో రొమాన్స్ చేసింది. కాకపోతే, ఇంత వరకూ ‘సైరా’ సుందరికి ముంబైలో భారీ క్రేజ్ ఎప్పుడూ రాలేదు. అలాగని పూర్తిగా ఆఫర్లు ఆగిపోలేదు కూడా. నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఆమె చేసిన ‘బోలే చూడియా’ సినిమా బాక్సాఫీస్ వద్దకి రావాల్సి ఉంది.
బాలీవుడ్ సినిమాల్లో తమన్నా పరిస్థితి ఎలా ఉన్నా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో ఆమెకు ఛాన్స్ దక్కింది. మిల్కీ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దినేశ్ విజన్ రూపొందించబోయే బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేయనుంది. మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ పతాకంపై ఈ షో తెరకెక్కనుంది. ఈ నెలలోనే ట్యామీ సెట్స్ మీద కాలుమోపుతుందట. ఇంకా వెబ్ సిరీస్ టైటిల్, డైరెక్టర్ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్స్ స్టోరీ’ సిరీస్ లు చేసిన తమన్నా భాటియా డెబ్యూ హిందీ వెబ్ సిరీస్ తో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి మరి…
Also Read
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!