NTV Telugu Site icon

తమన్నా భాటియా… మరోమారు బాలీవుడ్ కి!

ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్‌, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద హీరోలతో రొమాన్స్ చేసింది. కాకపోతే, ఇంత వరకూ ‘సైరా’ సుందరికి ముంబైలో భారీ క్రేజ్ ఎప్పుడూ రాలేదు. అలాగని పూర్తిగా ఆఫర్లు ఆగిపోలేదు కూడా. నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఆమె చేసిన ‘బోలే చూడియా’ సినిమా బాక్సాఫీస్ వద్దకి రావాల్సి ఉంది.

బాలీవుడ్ సినిమాల్లో తమన్నా పరిస్థితి ఎలా ఉన్నా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో ఆమెకు ఛాన్స్ దక్కింది. మిల్కీ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దినేశ్ విజన్ రూపొందించబోయే బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేయనుంది. మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ పతాకంపై ఈ షో తెరకెక్కనుంది. ఈ నెలలోనే ట్యామీ సెట్స్ మీద కాలుమోపుతుందట. ఇంకా వెబ్ సిరీస్ టైటిల్, డైరెక్టర్ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్స్ స్టోరీ’ సిరీస్ లు చేసిన తమన్నా భాటియా డెబ్యూ హిందీ వెబ్ సిరీస్ తో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి మరి…