NTV Telugu Site icon

జైలు జీవితం తరువాత మళ్లీ కెమెరా ముందుకు రియా! త్వరలో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ ‘సెకండ్’ ఇన్నింగ్స్…

రియా చక్రవర్తి… సుశాంత్ సింగ్ మరణం ముందు వరకూ ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడే కాస్త పేరు, ఆఫర్లు సంపాదించుకుంటోన్న అప్ కమింగ్ యాక్ట్రస్. కానీ, 2020 రియా తలరాత మార్చేసింది. సుశాంత్ అకాల మరణం ఆమెపై ఆరోపణల వర్షం కురిసేలా చేసింది. డ్రగ్స్ కేసులో కూడా ఆమె జైలుకి వెళ్లి వచ్చింది. మొత్తంగా ఒక సంవత్సరం పాటూ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. అయితే, ప్రస్తుతం ఆమె మళ్లీ గాడిన పడ్డట్టు తెలుస్తోంది…

రియా చక్రవర్తి త్వరలో కెమెరా ముందుకు రానుందట. రుమీ జాఫ్రీ తీయబోయే సినిమాలో ఆమె కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు రుమీ జాఫ్రీ రూపొందించిన ‘చెహ్రే’ సినిమాలోనూ రియా చిన్న పాత్ర పోషించింది. కాకపోతే, దాని వల్ల ఆమెకు పెద్దగా ఉపయోగముండదని రుమీనే చెబుతున్నాడు. అమితాబ్, ఇమ్రాన్ హష్మీ లాంటి స్టార్స్ ‘చెహ్రే’లో నటించారు. రియాకు దక్కిన స్క్రీన్ టైం చాలా తక్కువే.

రుమీ జాఫ్రీనే కాకుండా గతంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ రియాకు అవకాశాలు ఇస్తామనీ హల్ చల్ చేశారు. ఆమె పోలీసు కేసుల్లో చిక్కుకున్నప్పుడు చాలా మంది మద్దతు పలికారు. కానీ, ఆమె జైలు నుంచీ తిరిగొచ్చాక దాదాపుగా అందరూ ముఖం చాటేశారు. చూడాలి మరి, రుమీ జాఫ్రీ అందిస్తోన్న అవకాశం రియాకు ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో…