సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తాజాగా ఈ లాక్డౌన్ సమయంలో తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్నింగ్ వాక్ చేస్తూ కన్పించారు రజినీ. ఆయన చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రజినీకాంత్ మాస్క్ ధరించి ఉన్నారు. ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించారు. కాగా మే 17న సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .50 లక్షల చెక్కును అందజేశారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. ఇక సినిమాల విషయానికొస్తే… రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్‌లో “అన్నాత్తే” నెల రోజుల షెడ్యూల్ పూర్తి చేశారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.