బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న సుహానా తాజాగా ఆదివారం ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే… ఆమె స్నేహితులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, చిత్రసీమలోని వివిధ శాఖలకు చెందిన వారూ సుహానాను అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు. సుహానా తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ కేవలం ‘ట్వంటీవన్’ అనే పదమే రాసింది. ఇక అంతే అనన్యాపాండేను మొదలు కొని జోయా అక్తర్, సీమా ఖాన్, భావనా పాండే, మహీప్ కపూర్ వరకూ అందరూ లవ్ ఎమోజీలతో సుహానాకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి గౌరీ ఖాన్ సైతం సుహానా చిన్నప్పటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే రంగస్థలంపై సుహానా తన సత్తా చాటుతోంది. అయితే ఆమెకు వెండితెరపైనా నటిగా రాణించాలనే కోరిక ఉంది. ఆ విషయాన్ని స్వయంగా షారూఖ్ ఖానే చెప్పాడు కూడా. సో.. సుహానా అతి త్వరలోనే వెండితెరపై స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
షారుఖ్ ఖాన్ కుమార్తెకు 21 యేళ్ళు!
