NTV Telugu Site icon

శ్రీనివాసరెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

కమెడియన్ శ్రీనివాసరెడ్డి గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ వంటి సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. వాటిలో ‘గీతాంజలి’ తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్ళు’లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ అయింది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విడుదలైన పోస్టర్ లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఉన్నారు. కనపడదు, వినపడదు, మాట్లాడలేడుకు సంకేతంగా ఈ పోస్టర్ ఉంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నామని, షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నామని త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటున్నారు నిర్మాత.