NTV Telugu Site icon

బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్ మాస్టర్

శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో కళ్యాణ సుందరం-కోమల అమల్ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు సుగన్య. ఇద్దరు కుమారుల పేర్లు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 800కు పైగా చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్ మాస్టర్‌కు మగధీర సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అరుంధతి, మహాత్మ, బాహుబలి ది బిగినింగ్ సినిమాలకు కూడా శివశంకర్ మాస్టర్ పనిచేశారు.

Read Also: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

మరోవైపు 2003లో వచ్చి ‘ఆలయ్‌’ మూవీతో నటుడిగా మారిన శివశంకర్‌.. మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో తన నటనతో అభిమానులకు నవ్వులు పంచారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా శివశంకర్ మాస్టర్ తనదైన ముద్ర వేశారు. ఆట, ఢీ జూనియర్స్ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. పలు సీరియల్స్‌లోనూ శివశంకర్ మాస్టర్ నటించారు. జీ తెలుగులో ప్రసారమైన నాగభైరవి, నంబర్‌వన్ కోడలు లాంటి సీరియల్స్‌లో ఆయన కనిపించారు. కాగా శివశంకర్ మాస్టర్ మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడు విజయ్ కూడా కరోనాతో బాధపడుతున్నారు.