Site icon NTV Telugu

Sai Pallavi: సాయి పల్లవిని సత్కరించిన సరళ కుటుంబీకులు

Sai1

Sai1

సినీనటి సాయిపల్లవి ని సాదరంగా స్వాగతించి చిరు సత్కారం చేశారు సరళ కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో కామంచికల్ గ్రామస్తులు తూము భిక్షమయ్య చిన్న కూతురు సరళ యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా విరాటపర్వం.

ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ గారి చెల్లెలే అమర జీవి సరళ. సరళ పాత్రను అద్భుతంగా నటించిన (జీవించిన) ప్రముఖ నటి సాయి పల్లవిని తమ ఆడబిడ్డ గా ఇంటికి పిలిచి చీరె పెట్టి సత్కరించారు సరళ కుటుంబ సభ్యులు. ఈసందర్భంగా సాయి పల్లవి భావోద్వేగానికి గురయ్యారు. లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా, అందాల భామ సాయి పల్లవి, యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో లీడ్ పాత్రల్లో నటించారు. తాను సరళ పాత్ర చెయ్యడం గర్వంగా ఉందని, ఈరోజు వస్తున్న టాక్ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు సాయి పల్లవి.

Suresh Babu: విరాటపర్వం తప్పక చూడాల్సిన సినిమా

Exit mobile version