NTV Telugu Site icon

Sebastian P.C. 524: చాలా ఆనందంగా వుంది:సాయికుమార్

యంగ్ హీరోస్ శకం నడుస్తోంది. ఎంతోమంది తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గర్యయ్యాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సెబాస్టియన్ పీసీ 524 . ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాయికుమార్ నటిస్తున్నారు. సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో సాయికుమార్ మాట్లాడారు.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా వుంది. ఎస్ ఆర్ కళ్యాణ మంటపంలో కిరణ్ తో పరిచయం ఒకవరం అన్నారు సాయికుమార్. సెబాస్టియన్ P.C. 524 ప్రి రిలీజ్ వేడుకలో సాయికుమార్ మాట్లాడారు. రాజాధిరాజ పాట చూస్తుంటే మా అమ్మ నాతోనే వుంది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ సెంటిమెంట్ వుందని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను. 4వ తేదీ సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎస్ ఆర్ కళ్యాణ మంటపంలో నన్ను మీసం తిప్పేలా చేశాడు.

సెబాస్టియన్ ద్వారా తనే మీసం తిప్పుతున్నాడు. ఈ సెబాస్టియన్ సినిమా ఈ అగ్ని ఐపీఎస్ తలెత్తుకునేలా చేశాడన్నారు సాయికుమార్. మదనపల్లి పేరు వినగానే మా అమ్మ గుర్తుకువచ్చేది. నాకు ఆది ఎంతో మవ్వూ అంతే. హీరోలందరూ సక్సెస్ అవ్వాలి. నీ ప్రస్థానం చాలా బాగుంది. సెబాస్టియన్ తో హ్యాట్రిక్ కొట్టాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా వుండాలి. అంతా సినిమా చూసి సెబాస్టియన్ ని ఆశీర్వదించాలని సాయికుమార్ ఆకాంక్షించారు.