రాఘవ లారెన్స్ పాన్ ఇండియా మూవీ ‘అధికారం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాఘవ లారెన్స్ తన అభిమానులకు ఓ శుభవార్త తెలిపాడు. ‘అధికారం’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సమకూర్చుతున్నాడు. అంతేకాదు… ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఫైవ్ స్టార్ కదిరేశన్ సంస్థలో ‘రుద్రన్’ తర్వాత మరోసారి నటించడం ఆనందంగా ఉందన్నాడు రాఘవ లారెన్స్. ఇంతవరకూ తెలుగు, తమిళ భాషలలో మాత్రమే దర్శకత్వం వహించిన లారెన్స్ గత యేడాది ‘కాంచన’ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ ‘లక్ష్మీ’ పేరుతో తెరకెక్కించాడు. అయితే… దీనికి మిశ్రమ స్పందనే వచ్చింది. దాంతో ఇప్పుడీ డైరెక్టర్ కమ్ యాక్టర్… నటన మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడు. అలా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అధికారం’ పాన్ ఇండియా మూవీగా ఈ యేడాది చివరిలో పట్టాలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!