లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’

Prema Pageelu

Prema Pageelu

టాలీవుడ్‌లో హృదయానికి హత్తుకునే క్లాసిక్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా అదే కోవలో ప్రేక్షకుల గుండెలను మెలిపెట్టే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’. పి.వి. అర్జున్ యాదవ్, అదితి జంటగా శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మిస్తున్న ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’కి హరికృష్ణ పామంజి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిగా ముగించుకుని, ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ‘మ్యాంగో మ్యూజిక్’ ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆడియోకు వస్తున్న ఈ రేంజ్ రెస్పాన్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు. అర్జున్ యాదవ్ సరసన అదితి హీరోయిన్‌గా నటించగా, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు.

×
×
Ad