యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని స్టార్ హీరోలలో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి రొమాంటిక్ డ్రామా, ఒకటి సైన్స్ ఫిక్షన్, మరొకటి పౌరాణిక చిత్రం కాగా… మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రభాస్ ప్రస్తుతం “రాధే శ్యామ్” అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ ఏడాది చివర్లో ఇది తెరపైకి రానుంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్-కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’, ఓం రౌత్ పౌరాణిక నాటకం ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్‌తో కలిసి సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నారు. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాలని కోరుకుంటున్నారట. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారట ప్రభాస్. ఈ వార్తలు గనుక నిజమైతే ప్రభాస్ తో కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఉన్న దర్శకులు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ స్టోరీలపై దృష్టి పెట్టాల్సిందే.