యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఏక్ మినీ కథ’ టీంకు విషెస్ తెలిపారు. అడల్ట్ కంటెంట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ “నా కెరీర్ లో ‘వర్షం’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుర్తుండిపోయే అలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 27న విడుదల కాబోతోంది. నా ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్, మొత్తం టీంకు నా విషెస్” అంటూ పోస్ట్ చేశారు. కాగా ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ‘ఏక్ మినీ కథ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ దాదాపు 240 టెర్రటరీస్ లో విడుదల చేయబోతోంది.