NTV Telugu Site icon

సాహిత్యానికి, చిత్రసీమకు తీరని లోటు : పవన్‌ కళ్యాణ్‌

ఎన్నో తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతి పట్ల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ స్పందిస్తూ.. అక్షర త‌ప‌స్వీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హ‌నీయుడు. సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు సాహిత్యానికి తీర‌ని లోటు. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.