NTV Telugu Site icon

మ్యూజిక్ ‘ఎన్’ ప్లే సాకేత్ కొమాండూరి విత్ గీతామాధురి, పర్ణిక!

యంగ్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ తో మొదలైన మ్యూజిక్ ‘ఎన్’ ప్లే ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రెండో ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ సింగర్స్ గీతామాధురి, పర్ణిక మాన్య పాల్గొనడం విశేషం. చిత్రం ఏమంటే… వీళ్ళిద్దరితోనూ ప్రోగ్రామ్ హోస్ట్ సాకేత్ కొమాండూరికి స్పెషల్ ర్యాపో ఉండటంతో ఈ ఎపిసోడ్ కు మరింత ఊపొచ్చింది. అసలు షో ప్రారంభం కావడమే… ముగ్గురూ కలిసి ఉన్న ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను వ్యూవర్స్ తో పంచుకోవడంతో మొదలైంది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన తండ్రి రామాచారికి అడ్డంగా బుక్ అయిన సాకేత్ గురించి గీతామాధురి చెప్పడం నవ్వు తెప్పించింది. అలా హాయిగా మొదలైన ఈ ఎపిసోడ్ ఆ తర్వాత గీతా మాధురి, పర్ణిక పెళ్ళి మీదుగా సాగింది. 23 సంవత్సరాల వయసులో నటుడు నందును పెళ్ళి చేసుకున్న గీతా మాధురి, అప్పుడు కాకపోతే ఇంకా ఎప్పటికీ పెళ్ళి కాదేమోనని చెప్పి వ్యూవర్స్ ను తెగ నవ్వించింది. తన భర్త నిఖిల్ మెరైన్ ఇంజనీర్ కావడంతో మూడు నెలలు ఇంట్లో, మూడు నెలలు సముద్రం మీద ఉండక తప్పదని, బట్ అతని ప్రొఫెషన్ ను తాను గౌరవిస్తానని పర్ణిక చెప్పడం బాగుంది.

మంగ్లీని ఇమిటేట్ చేసిన గీతామాధురి!


స్టార్ సింగర్ గీతామాధురిలో ఇమిటేషన్ క్వీన్ ఉంది. తన సర్కిల్ లోని ఎవరినైనా అత్యద్భుతంగా గీతా మాధురి ఇమిటేట్ చేస్తుంది. బహుశా ఆ లక్షణం ఆమెకు మరో సింగర్ ఉషా నుండి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఉషా… గీతా మాధురిని సూపర్ గా ఇమిటేట్ చేసింది. ఇప్పుడీ ఎపిసోడ్ లో సాకేత్ కొంతమంది ఫోటోలు చూపించి, ఎవరో ఒకరిని ఇమిటేట్ చేయమనగానే గీతా మాధురి మంగ్లీవైపు మొగ్గు చూపించింది. ఆమె ఎలా మాట్లాడుతుందో అద్భుతంగా ఇమిటేట్ చేసింది. ఇక సీనియర్ సింగర్ శ్రీకృష్ణ ఫోన్ చేసి ఎలా మాట్లాడతాడో పర్ణిక అభినయించి చూపింది. ఆ తర్వాత స్క్రీన్ మీద వరుసగా పెట్టిన నాలుగు ఫోటోస్ ను చూసి… దానితో మిళితమైన పాటను గుర్తుపట్టమని సాకేత్ కోరాడు. ఈ పోటీలో గీతామాధురి విజేతగా నిలిచింది. ఇక ఒకరి గురించి ఒకరికి ఏమేరకు తెలుసు? అనే ఆసక్తికరమైన పోటీని గీతామాధురి, పర్ణిక మధ్య పెట్టాడు సాకేత్. ఇందులోనూ దాదాపు ఒకరి మనసును ఒకరు గ్రహించే జవాబులు ఇచ్చారు. ఆ తర్వాత హీలియం బెలూన్ లోని గ్యాస్ ను పీల్చి పాటపాడే ఎపిసోడ్ ఫన్నీగా సాగింది. పర్ణిక ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా మావా, సారంగదరియా…’ పాటలు పాడి మెప్పించగా, గీతా మాధురి ‘డియ్యో డియ్యో డిసక డిసక, దిగు దిగు దిగు నాగా’ పాటలు పాడి ఆకట్టుకుంది.

అదిరిర లైవ్ పెర్ఫార్మెన్స్!


గీతా మాధురి, పర్ణిక మాన్య ఇద్దరూ ఈ కార్యక్రమంలో లైవ్‌ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. గీతామాధురి ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమాలోని జై బాలయ్య పాటను, ‘బాద్ షా’ టైటిల్ సాంగ్ ను పాడి నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. పర్ణిక ‘బండెనక బండి కట్టి, ఫుల్ వాల్యూమ్ పెట్టి, నా పాట పెట్ర తమ్మీ, ఊపేద్దాం తెలంగాణ’ అంటూ పాడిన పాట నిజంగా కేక! ఇక చివరగా ర్యాపిడ్‌ ఫైర్ లో జర్నల్ నాలెడ్జ్ ప్రశ్నలకు మన బ్యూటిఫుల్ సింగర్స్ చేతులెత్తేశారు. అంతేకాదు పౌరాణిక ప్రశ్నలకూ సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఏదేమైనా… వినోదం విషయంలో మాత్రం తగ్గేదే లే అనిపించారు గీతామాధురి, పర్ణిక! ఈ ఇద్దరూ సింగర్స్ నుండి వ్యూవర్స్ ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకుంటారో… దాన్ని సాకేత్ కొమాండూరి నూరు శాతం రాబట్టాడు. అన్నట్టు సాకేత్ వీరిని చివరగా ఓ ప్రశ్న అడిగాడు. ‘డబుల్ చిన్ తో పుట్టిన ఓ పిల్లాడికి తల్లిదండ్రులూ ఏం పేరు పెట్టారు?’ అని. జవాబు మీరు గెస్ చేయగలరా!? లేదా!? సరే అయితే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ సెకండ్ ఎపిసోడ్ లింక్ క్లిక్ చేయండి… కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోండి!!