యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కు అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అనారో సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే… మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ విందు ఏర్పాటు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మటన్ బిర్యానీని వండి ఎన్టీఆర్ కోసం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఏ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ నెట్టింట్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా సోకి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే.