Site icon NTV Telugu

హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్! భారీగా రెమ్యూనరేషన్!!

తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Read More: ‘బాలికా వధూ 2’… మరో బాల్య వివాహం… మరో ‘ఆనంది’!

విశేషం ఏమంటే… ప్రముఖ నటుడు, నిర్మాత నాగార్జున సైతం వైష్ణవ్ తేజ్ తో సినిమా తీయాలని కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటిస్తాడట. ఇందుకోసం వైష్ణవ్ కు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పృధ్వీ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి తన కొడుకులు నాగచైతన్య, అఖిల్ తో కాకుండా నాగార్జున… వైష్ణవ్ తేజ్ తో ఎందుకు సినిమా నిర్మించబోతున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే!

Exit mobile version