మలయాళ రీమేక్ లో… రోబోతో కలసి అనీల్ కపూర్ సైన్స్ ఫిక్షన్ కామెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ జాతర నడుస్తోంది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’ తాజాగా ముంబై బాట పట్టింది. రతీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ హిందీలో అనీల్ కపూర్ లీడ్ రోల్ లో రీమేక్ కానుంది. సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో రూపొందిన ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’ తెలుగు, తమిళ భాషల్లోకి కూడా తీసుకొచ్చే రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి…
‘ఫెయిత్ ఫిల్మ్స్’ అధినేత వికీ రజనీ హిందీ రీమేక్ రైట్స్ స్వంతం చేసుకోగా ఆయనతో బాటూ ‘సోనీ పిక్చర్స్’ సంస్థ కూడా అనీల్ కపూర్ స్టారర్ కు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ‘అండ్రాయిడ్ కుంజుప్పన్’ హిందీ వర్షన్ ఓ గ్రామీణ ప్రాంతంలోని వృద్ధుడి కథ. మలయాళంలో సూరజ్ వెంజరమూడు పోషించిన పాత్రలో అనీల్ కపూర్ కనిపించనున్నాడు.
‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’లో ఓ కొడుకు తన తండ్రికి రోబోను గిఫ్ట్ గా ఇస్తాడు. తరువాత అతను రష్యాలో ఉద్యోగానికి వెళతాడు. అప్పుడు తండ్రికి నేస్తంగా మారిపోతుంది రోబో. అలా దానితో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన జీవితంలో ఏం జరిగింది అన్నదే కామెడీ ఎంటర్టైనర్ ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’! చూడాలి మరి, 2021లోనే… సెట్స్ మీదకు వెళ్లనున్న అనీల్ కపూర్ స్టారర్ రీమేక్ మూవీ 2022లో… ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ పొందుతుందో!
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!