NTV Telugu Site icon

‘మేజ‌ర్’ ఓవ‌ర్సీస్ హ‌క్కులు ఎవ‌రికంటే…

అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ ప్ర‌ధాన పాత్రలు పోషించిన సినిమా మేజ‌ర్. ఈ పాన్ ఇండియా మూవీని గూఢ‌చారి ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ప్ల‌స్ ఎస్‌ మూవీస్‌ సంస్థలతో క‌లిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఎన్.ఎస్.జీ. క‌మాండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌ను అడివి శేష్ పోషిస్తున్నాడు. జూన్ 2న ప్రపంచ‌వ్యాప్తంగా తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను కరోనా పేండ‌మిక్ సిట్యుయేష‌న్ ను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. అయితే… నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌తో పాటు మిగిలిన వ్యాపార వ్య‌వ‌హారాలూ స‌జావుగా సాగిపోతూనే ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇంకా విడుద‌ల తేదీ ఖరారు కాక‌పోయినా, మూవీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని వీకెండ్ సినిమా యూఎస్ సంస్థ స‌ద‌రన్ స్టార్ తో క‌లిసి సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను ఇక‌పై వ‌రుస‌గా ఇస్తామంటూ చిత్ర నిర్మాత‌లు చెబుతున్నారు. మొత్తం మీద థియేట‌ర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే స‌మ‌యానికి మేజ‌ర్ తొలికాపీ సిద్ధ‌మ‌య్యేలా ఉంది. ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించిన అమర వీర జవాను, ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై మొద‌టి నుండీ భారీ అంచ‌నాలే నెల‌కొని ఉండ‌టం విశేషం.