రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ సినిమాను నిర్మించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగులో విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లోకి దిగిపోయినట్టు కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఈ పోస్టర్ చూస్తే చాలు అర్థమవుతుంది.
మరోసారి ప్రేక్షకులకు మంచి మాస్ బిర్యాని వడ్డించేందుకు రవితేజ సిద్ధమైపోయినట్టు కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో రవితేజ దుమ్ము లేపుతాడన్న విషయం పోస్టర్‌ను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ‘రాక్షసుడు’ హిట్ తరువాత రమేశ్ వర్మ జోనర్ మార్చుకుని చేసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌తో సాంగ్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇంతకుముందు మీనాక్షి .. తెరపై మెరిసినప్పటికీ, డింపూల్ హాయాతీ కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి ఈ ఇద్దరికీ రవితేజతో ఇదే ఫస్టు మూవీ అనుకోవాలి. ఈ సినిమా వాళ్ల కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి. ప్రముఖ పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, వెన్నెల కిషోర్, సచిన్ కేడకర్, రావు రమేష్, మురళీ శర్మ, భరత్‌రెడ్డి, అనసూయ భరద్వాజ్, ముకేష్ రుషి తదితరులు నటిస్తున్నారు.
